iDreamPost
android-app
ios-app

తండ్రి తమ్ముడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి

  • Published Jul 29, 2023 | 5:20 PM Updated Updated Jul 29, 2023 | 5:20 PM
  • Published Jul 29, 2023 | 5:20 PMUpdated Jul 29, 2023 | 5:20 PM
తండ్రి తమ్ముడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి

ప్రేమ గుడ్డిది అని అప్పుడప్పుడు కొందరు అంటుంటే ఏమో అనుకున్నా.. కానీ, ఈ ఘటన తెలుసుకున్నాక నిజమే అనిపిస్తుంది. అవును.. మీరు విన్నది నిజమే. ఓ యువతి వావి వరసలు మరిచి ఏకంగా తన తండ్రి తమ్ముడినే ప్రేమించింది. అంతే కాకుండా.. అతను లేకుండా నేను ఉండలేను, నేను లేకుండా అతడు ఉండలేడు అంటూ సినిమా డైలాగులు చెప్పి చివరికి పెళ్లి కూడా చేసుకుంది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటనతో గ్రామస్తులు అంతా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

స్థానికుల కథనం ప్రకారం.. అది ఉత్తర్ ప్రదేశ్ జౌన్ పూర్ జిల్లా తాజుద్దీన్ పూర్ ప్రాంతం. ఇక్కడే రియా అనే యువతి తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటూ చదువుకునేది. ఈ క్రమంలోనే ఆమె తండ్రి తమ్ముడైన సుభమ్ అనే వ్యక్తిని ప్రేమించింది. ఇతడు కూడా ఆమెను ప్రేమించాడు. అలా వీరి ప్రేమాయణం దాదాపు మూడేళ్ల పాటు మూడో మనిషికి తెలియకుండా కొనసాగింది. అయితే, వీరి ప్రేమ వ్యవహారం ఇటీవల వీరి ఇంట్లో తెలిసింది. దీంతో వారి కుటుంబ సభ్యులు వీరిపై కోపంతో ఊగిపోయి విడగొట్టే ప్రయత్నం చేశారు.

కానీ, వీళ్లు మాత్రం.. మేమిద్దరం విడిచి ఉండలేము అంటూ ప్రేమను ఒలకబోశారు. దీంతో వారి కుటుంబ సభ్యులు వేరే మార్గం కనిపించకపోవడంతో వీరి పెళ్లికి అంగీకరించారు. ఆ తర్వాత గ్రామంలోని హానుమాన్ గుడి వద్ద వీరిద్దరికి పెళ్లి చేశారు. ఈ ఘటనతో గ్రామస్తులు అంతా షాక్ గురై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఈ యువతి తండ్రి తమ్ముడిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం కరెక్టేనని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: స్మశానంలో ప్రేమ పెళ్లి.. ఎందుకో తెలుసా?

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet