ప్రాణాలను పణంగా పెట్టి మనవడిని కాపాడుకున్న70 ఏళ్ల బామ్మ!

Grandma Donates Kidney To Grandson: పిల్లలపై ఆ కుటుంబ పెద్దలకు ఎంతో ప్రేమ, ఆప్యాయత ఉంటుంది. వారికి చిన్న ప్రమాదం జరిగిన ఆ ఇంటి పెద్దలు అల్లాడిపోతారు. అలానే తాజాగా నిస్వార్థానికి నిలువెత్తు నిదర్శనంగా ఓ 70 ఏళ్ల బామ్మ నిలిచారు.

Grandma Donates Kidney To Grandson: పిల్లలపై ఆ కుటుంబ పెద్దలకు ఎంతో ప్రేమ, ఆప్యాయత ఉంటుంది. వారికి చిన్న ప్రమాదం జరిగిన ఆ ఇంటి పెద్దలు అల్లాడిపోతారు. అలానే తాజాగా నిస్వార్థానికి నిలువెత్తు నిదర్శనంగా ఓ 70 ఏళ్ల బామ్మ నిలిచారు.

ప్రేమ అనేది చాలా గొప్పది. ఎందుకంటే.. ఇది ఎలాంటి త్యాగం చేయడానికైనా మనిషిని సిద్ధపడేలా చేస్తుంది. ముఖ్యంగా ప్రేమ అంటే.. కేవలం యువతి యువకుల మధ్య ఏర్పడేది మాత్రమే అనుకుంటే పొరపాటు. ఈ లవ్ అనేది కుటుంబ సభ్యుల మధ్య ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలపై ఆ కుటుంబ పెద్దలకు ఎంతో ప్రేమ, ఆప్యాయత ఉంటుంది. వారికి చిన్న ప్రమాదం జరిగిన ఆ ఇంటి పెద్దలు అల్లాడిపోతారు. ఇవ్వన్నీ పక్కన పెడితే.. నిస్వార్థానికి నిలువెత్తు నిదర్శనంగా ఓ 70 ఏళ్ల బామ్మ నిలిచారు. తన మనవడి ప్రాణాలను కాపాడేందుకు తన ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి సిద్ధ పడింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్ పూర్ జిల్లాలోని సిహోరా ప్రాంతంలో 23 ఏళ్ల యువకుడు తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతడు గత రెండేళ్ల నుంచి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు ఎన్ని ఆస్పత్రులకు తిప్పి చికిత్స చేయించిన నయం కాలేదు. ఇదే క్రమంలో అతని రెండు కిడ్నీలు పూర్తి గా దెబ్బతిన్నాయి. కిడ్నీ మార్పిడి చేస్తే తప్ప అతడు ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని వైద్యులు చెలిపారు. దీంతో కిడ్నీ దానం చేసే వారి కోసం బాధితుడు కుటుంబ సభ్యులు ప్రయ్నతం చేశారు.

ఎవరు దొరక్కపోవడంతో కుటుంబ సభ్యులోనే ఎవరో ఒకరు ఇవ్వాలని భావించారు. అయితే వారిలోని ఏ ఒక్కరి బ్లడ్ గ్రూప్ ఆ యువకుడి బ్లడ్ గ్రూప్ కి సరిపోలేదు. ఇదే సమయంలో ఓ ఆసక్తికర విషయం ఒకటి బయటకు వచ్చింది. మిగిలిన కుటుంబ సభ్యులతో పోలిస్తే ఆ ఇంట్లోని 70 ఏళ్ల బామ్మ, మనవడి  బ్లడ్ గ్రూప్ ఒకటేనని తేలింది. అలానే వారిద్దరికి సంబంధించిన పలు పరీక్షలు చేయగా..కిడ్నీ కూడా మ్యాచ్ అయ్యింది. దీంతో తన మనవడి ప్రాణం కంటే తనకు ఏది ఎక్కువ కాదని ఆ బామ్మ భావించింది. తన ప్రాణాలను ఫణంగా పెట్టి..మనవడికి ప్రాణ బిక్ష పెట్టింది… ఆ 70 ఏళ్ల బామ్మ.  మనవడికి కిడ్నీని దానం చేసేందుకు ఆ బామ్మ అంగీకరించింది.

దాదాపు నెల రోజులపాటు బామ్మ శారీరక సామర్థ్యాన్ని వైద్యులు పరిశీలించారు. ఆ తరువాత ఇటీవలే కిడ్నీ మార్పిడి ఆపరేషన్ నిర్వ‌హించారు. ఈ బామ్మ ఎంతో ధైర్యంతో ముందుకు వచ్చి తన మనవడికి కొత్త జీవితం ప్రసాదించడం అందరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక కిడ్నీ మార్పిడి ఆపరేషన్ సక్సెస్ అయిందని, అంతేకాక మనవడు, బామ్మ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. వీరికి జబల్ పూర్ మెట్రో ఆస్పత్రిలో ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఈ విషయం తెలిసి..స్థానికులు బామ్మపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కిడ్నీ మార్పిడి అనేది నేటికాలంలో సర్వసాధారణమైనప్పటికీ ఇంత పెద్ద వయసులో ప్రాణాన్ని పణంగా పెట్టి బామ్మ కిడ్నీ దానం చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. వృద్ధురాలి శరీరం నుంచి కిడ్నీని తొలగించిన అనంతరం ఆరోగ్యపరంగా ఎలాంటుందో అని అందరు ఆందోళన వ్యక్తం చేశారు. చివరకు ఆపరేషన్ విజయవంతం కావడంతో అందరు సంతోషిస్తున్నారు.

Show comments