iDreamPost
android-app
ios-app

షాకింగ్: గుండెపోటుతో 6 ఏళ్ల బాలుడు మృతి

ఢిల్లీలో మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గుండెపోటుతో 6 ఏళ్ల బాలుడు మృతి చెందాడు.

ఢిల్లీలో మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గుండెపోటుతో 6 ఏళ్ల బాలుడు మృతి చెందాడు.

షాకింగ్: గుండెపోటుతో 6 ఏళ్ల బాలుడు మృతి

గత కొంత కాలం నుంచి దేశ వ్యాప్తంగా గుండె పోటు మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. ఇటు చిన్న పిల్లల నుంచి అటు వృద్ధుల వరకు వయసులో తేడా లేకుండా ప్రాణాలు విడుస్తున్నారు. ఇక వరుస హార్ట్ ఎటాక్ లతో జనాలు పిట్టాల్లా రాలుతుండడంతో ప్రజలను భయందోళనలకు గురవుతున్నారు. అయితే, కరోనా సమయంలో వేయించుకున్న వ్యాక్సిన్ కారణంగానే జనాలు హార్ట్ ఎటాక్ తో మరణిస్తున్నారని కొందరు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ 6 ఏళ్ల బాలుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ పిల్లాడి మరణంతో అందరూ షాక్ గురవుతున్నారు. మరీ ముఖ్యంగా మృతుడి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారుతోంది. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ కు చెందిన విహాన్ జైన్ (6) అనే బాలుడు తన తల్లిదండ్రులతో కలిసి ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరయ్యాడు. అక్కడ తన బంధువులతో కలిసి విహాన్ ఎంతో సంతోషంగా తిరిగాడు. కానీ, ఉన్నట్టుండి ఆ బాలుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు అప్రమత్తమై స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. గుండెలో గడ్డలు ఏర్పడ్డాయని, దీని కారణంగానే ఈ బాలుడికి గుండెపోటు వచ్చి మరణించాడని నిర్ధారించారు. ఆ వైద్యుల మాటలు విన్న మృతుని తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు.

కాగా, కేవలం 6 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో మరణించడం ఏంటని వారి బంధువులు షాక్ కు గురవుతున్నారు. అనంతరం ఆ బాలుడిని తమ సొంతూరుకు తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు. అయితే, మృతుని స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు భయందోళనలకు గరవుతున్నారు. వరుస గుండె పోటు మరణాల నేపథ్యంలోనే కేవలం 6 ఏళ్ల బాలుడు హార్ట్ ఎటాక్ తో మరణించడం ఏంటని భయపడిపోతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారుతోంది. గుండెపోటుతో మరణించిన 6 ఏళ్ల బాలుడి ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.