iDreamPost
android-app
ios-app

దారుణం: చిన్నారి చేతి వేళ్ల సర్జరీ బదులు నాలుకకు చేసిన వైద్యులు!

ఎంతో మంది డాక్టర్లు ప్రజలకు సేవలు చేసి.. మంచి గుర్తింపు పొందుతున్నారు. కొందరు మాత్రం వృతి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. వైద్యులందరికి చెడ్డ పేరు తెస్తున్నారు.

ఎంతో మంది డాక్టర్లు ప్రజలకు సేవలు చేసి.. మంచి గుర్తింపు పొందుతున్నారు. కొందరు మాత్రం వృతి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. వైద్యులందరికి చెడ్డ పేరు తెస్తున్నారు.

దారుణం: చిన్నారి చేతి వేళ్ల సర్జరీ బదులు నాలుకకు చేసిన వైద్యులు!

సమాజంలో వైద్యులకు ఎంతో గుర్తింపు ఉంది. వారిని జనాలు దేవుళ్లుగా భావిస్తారు. తమకు ఏదైనా రోగం, ఇతర అనారోగ్య సమస్యలు వస్తే..వెంటనే వైద్యుల దగ్గరకి వెళ్తారు. అలా ఎంతో మంది డాక్టర్లు ప్రజలకు సేవలు చేసి.. మంచి గుర్తింపు పొందుతున్నారు. కొందరు మాత్రం వృతి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. వైద్యులందరికి చెడ్డ పేరు తెస్తున్నారు. ఇప్పటికే వైద్యుల నిర్లక్ష్యం కారణంగా జరిగిన అనేక ఘోరమైన ఘటనల గురించి మనం విన్నాము. తాజాగా మరో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల చిన్నారి చేతి వేళ్లకు సర్జరీ చేయమంటే.. నాలుక చేశారు. ఈ దారుణ ఘటన ఎక్కడ చోటుచేసుకుంది. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

కేరళ రాష్ట్రంలోన కోజికోడ్ పట్టణంలోని కోజికోడ్ వైద్య కళాశాల ఆస్పత్రిలో ఈ దారుణ ఘటన చేటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉండే ఒక 4 ఏళ్ల చిన్నారి చేతికి 6 వేళ్లు ఉన్నాయి. అయితే అదనంగా వచ్చిన ఆ వేలును సర్జరీ చేసి తొలగించాలని ఆమె తల్లిదండ్రులు భావించారు. ఈ క్రమంలోనే కోజికోడ్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌ వైద్యులను సంప్రదించారు. వారు సర్జరీ డేట్ ఇవ్వడంతో ఇంటికి వెళ్లారు.

వైద్యులు చెప్పిన రోజు.. కోజికోడ్ కాలేజీ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ ఆ చిన్నారిని ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్‌కు వైద్యులు తీసుకెళ్లారు. కాసేపటికి తర్వాత వైద్యులు ఆ చిన్నారిని బయటికి తీసుకువచ్చారు. అయితే ఆ చిన్నారి నోటి చుట్టూ ప్లాస్టర్ ఉండడాన్ని కుటుంబ సభ్యులు గమనించారు. తమ బిడ్డ నోటికి ప్లాస్టర్ ఎందుకు వేశారో ఆ పాప కుటుంబ సభ్యులకు అర్థం కాలేదు. అదే సమయంలో ఆ  చిన్నారి చేతికి ఆరో వేలు అలాగే ఉంది. దీంతో అనుమానం వచ్చిన బాధితురాలి తల్లిదండ్రులు నర్సుకు విషయం చెప్పి ఏం జరిగిందని ప్రశ్నించారు. ఆ సమయంలో ఆ నర్సు నవ్వుతూ ఉందే తప్ప సమాధానం ఇవ్వలేదు.

అంతేకాక ఆ చిన్నారి నాలుకకు కూడా సమస్య ఉందని ఆమె చెప్పినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు వెల్లడించారు. చిన్నారి నోటికి చేసిన సర్జరీ గురించి ఆస్పత్రికి ప్రధాన అధికారులకు ఫిర్యాదు చేయగా.. ఆయన వచ్చి తప్పు జరిగిందని క్షమాపణలు చెప్పారు. అంతేకాక ఆ చిన్నారి ఆరో వేలు తొలగించేందుకు మళ్లీ తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. మొత్తంగా  ఈ ఘటన స్థానికంగా అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. గతంలో ఓ బాలింతరాలికి కూడా కడుపులో బ్యాండేజ్ పెట్టి కుట్లు వేశారు. అలానే కొందరి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా పలువురు రోగులు మృతి చెందారు. ఇది చేతికి సంబంధించినది కాబట్టి సరిపోయిందని మరేదన్న అయ్యి ఉంటే ప్రాణాలకే ప్రమాదమని పలువురు అభిప్రాయ పడుతున్నారు.