Arjun Suravaram
ఇటీవల కాలంలో మాజీ సీఎంలు, మంత్రులు అవినీతి, అక్రమాస్తుల కేసులో అరెస్టు అవుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అలానే కొందరికి జైలు శిక్షలు కూడా పడుతున్నాయి. తాజాగా ఓ సీనియర్ మంత్రికి మూడేళ్ల జైలు శిక్ష పడింది.
ఇటీవల కాలంలో మాజీ సీఎంలు, మంత్రులు అవినీతి, అక్రమాస్తుల కేసులో అరెస్టు అవుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అలానే కొందరికి జైలు శిక్షలు కూడా పడుతున్నాయి. తాజాగా ఓ సీనియర్ మంత్రికి మూడేళ్ల జైలు శిక్ష పడింది.
Arjun Suravaram
ప్రజాప్రతినిధులు అంటే ప్రజల చేత ఎన్నుకోబడి, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేసేవారు. అయితే అలా నీతిగా నిజాయితీగా పని చేసే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. అధికారంలోకి రావడమే ఆలస్యం ఎంత నొక్కేద్దామా అనే వారే ఎక్కువయ్యారు. ఇలా అక్రమంగా ఆస్తలు కూడబెట్టి, అధికారం అండతో అవినీతికి పాల్పడిన ఎందరో నేతలు జైలు పాలయ్యారు. ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలు, మంత్రులు కూడా జైలుకు వెళ్లారు. గతంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, బీహార్ మాజీ సీఎం లాలు ప్రసాద్ యాదవ్ వివిధ అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లారు. తాజాగా ఓ మంత్రికి భారీ షాక్ తగిలింది. అక్రమాస్తుల కేసులో ఆయనకు మూడేళ్లు జైలు శిక్ష పడింది. మరి.. ఆవివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతం తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం నడుస్తోంది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఉన్నారు. ఆయన మంత్రి వర్గంలో విద్యాశాఖ మంత్రిగా కె. పొన్నుడి పని చేస్తున్నారు. ఆయన గతంలోనూ అనేక సార్లు వివిధ శాఖలకు మంత్రిగా చేశారు. ప్రస్తుతం స్టాలిన్ మంత్రి వర్గంలో ఆయన సీనియర్ మంత్రిగా ఉన్నారు. అలాంటి పొన్నుడికి భారీ షాక్ తలిగింది. అక్రమాస్తులు కేసులో మంత్రిని మద్రాస్ హైకోర్టు దోషిగా తేల్చి.. మూడేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. ఇక మంత్రి సహా ఆయన భార్య విశాలక్ష్మిని కూడా కోర్టు దోషిగా తేల్చింది. ఈ సందర్భంగా కింది న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను పక్కనబెట్టింది. రూ.1.79 కోట్ల అక్రమాస్తులను మంత్రి పొన్ముడి, ఆయన భార్య కూడబెట్టినట్టు మద్రాస్ కోర్టు నిర్దారించింది. రెండు రోజుల కిందట వారిని దోషులుగా నిర్దారించిన ఉన్నత న్యాయస్థానం.. గురువారం శిక్షలను ఖరారు చేసింది.
2017లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను జస్టిస్ జి.జయచంద్రన్ విచారణకు అనుమతించారు. విల్లుపురంలోని అవినీతి నిరోధక చట్టం కేసుల్లో గతంలో ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుని కూడా జడ్జీ పక్కనబెట్టారు. ఇక తాజా తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకునేందుకు వీలుగా శిక్షను సస్పెండ్ చేయాలన్న మంత్రి తరఫు లాయర్ విజ్ఞప్తి చేయగా.. కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అప్పీలుకు 30 రోజులు గడువు ఇచ్చిన మద్రాస్ హైకోర్టు ఇచ్చింది. అప్పటి వరకు శిక్షను అమలు చేయకుండా నిలిపివేసింది. ఇక తాజాగా మద్రాస్ కోర్టు తీర్పుతో మంత్రి పదవికి పొన్ముడి రాజీనామా చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.
సీఎం స్టాలిన్ తన మంత్రివర్గం నుంచి పొన్ముడిని తప్పించాలని ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అలా ఆయన డిమాండ్ చేసిన మర్నాడే మంత్రికి శిక్ష ఖరారు కావడం విశేషం. డీఎంకే అధికారంలో ఉన్నప్పుడు 2006 ఏప్రిల్ 13 నుంచి 2010 మార్చి 31 మధ్య కాలంలో మంత్రి, ఆయన భార్య రూ.1.79 కోట్ల ఆక్రమాస్తులను కూడబెట్టినట్లు ప్రాసిక్యూషన్ పేర్కొంది. ఇక ప్రజాప్రతినిధ్య చట్టం ప్రకారం.. క్రిమినల్ కేసులో దోషిగా తేలి.. మూడేళ్ల జైలు శిక్ష పడితే.. సదరు ఎంపీ లేదా ఎమ్మెల్యే ఆటోమేటిక్‌గా అనర్హుడవుతారు. మరి.. ఇలా అవినీతి కేసుల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు జైలుకు వెళ్తుంటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.