AC Falls On Man: రెండో అంతస్తుపై నుంచి ఏసీ పడి మృతి చెందిన ఢిల్లీ యువకుడు

రెండో అంతస్తుపై నుంచి ఏసీ పడి మృతి చెందిన ఢిల్లీ యువకుడు

Beware Of These Sections Before Buying AC: మీరు ఏసీ కొనడానికి వెళ్తున్నారా? ఏసీ కొనేశారా? ఏసీ ఆల్రెడీ ఇంట్లో బిగించేశారా? అయితే మీరు ఈ కథనం ఖచ్చితంగా చదవాలి. మీరు ఈ తప్పు చేస్తే కనుక పోలీస్ కేసు నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఓ ఇంటి యజమానిపై ఇప్పటికే కేసు కూడా నమోదు అయ్యింది.

Beware Of These Sections Before Buying AC: మీరు ఏసీ కొనడానికి వెళ్తున్నారా? ఏసీ కొనేశారా? ఏసీ ఆల్రెడీ ఇంట్లో బిగించేశారా? అయితే మీరు ఈ కథనం ఖచ్చితంగా చదవాలి. మీరు ఈ తప్పు చేస్తే కనుక పోలీస్ కేసు నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఓ ఇంటి యజమానిపై ఇప్పటికే కేసు కూడా నమోదు అయ్యింది.

చాలా మంది ఏసీలు కొంటారు. అయితే అవుట్ డోర్ యూనిట్ ఒకటి ఉంటుంది. దాన్ని ఇంటి బయట బిగించాల్సి ఉంటుంది. అయితే చాలా మంది ఏసీ యూనిట్లను బయట గోడకు బిగిస్తుంటారు. బాల్కనీ అనేది లేకపోవడం వల్ల రోడ్డు మీదకి ఫేసింగ్ అయి ఉంటుంది. దీని వల్ల ఆ ఏసీ యూనిట్ స్టాండ్ వీక్ అయ్యి జారి ఎవరి మీదనైనా పడితే ఇక అంతే సంగతులు. కొన్ని సందర్భాల్లో గోడకి క్రాక్స్ వచ్చి ఏసీ యూనిట్ స్టాండ్ లూజయ్యే ఛాన్స్ ఉంటుంది. దీని వల్ల ఆ ఏసీ యూనిట్ రోడ్డు మీద గానీ పక్కనున్న బిల్డింగ్ పైన గానీ పడుతుంది. ఆ టైంలో అక్కడ ఎవరైనా ఉంటే ఎంత ప్రమాదం. అందుకే మీరు ఏసీలు కొన్న తర్వాత బిగించే ముందు జాగ్రత్త. అవకాశం ఉంటే ఏసీ యూనిట్ జారి కింద పడినా గానీ నేలకి అడుగు, రెండడుగుల ఎత్తులో ఉండేలా ప్లాన్ బిగించుకుంటే మంచిది. మేడ మీద ఖాళీ ఉంటుంది కాబట్టి ఏసీ యూనిట్ ని అక్కడ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది.

ఒకవేళ ఏసీ యూనిట్ ని కనుక ఇంకా గోడ బయట గాల్లో కనుక బిగించి ఉంటే కనుక ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి. లేదంటే పోలీస్ కేసు నమోదయ్యే అవకాశం ఉంది. దీనికి తాజాగా జరిగిన ఒక సంఘటనే ఉదాహరణ. ఏసీ పడి ఓ వ్యక్తి మరణించడంతో ఇంటి యజమాని మీద కేసు నమోదు చేశారు పోలీసులు. 18 ఏళ్ల కుర్రాడు తల మీద ఏసీ యూనిట్ పడి మృతి చెందిన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. కరోల్ బాగ్ ఏరియాలోని ఓ భవనం రెండో అంతస్తులో ఉన్న ఏసీ యూనిట్ ఒక్కసారిగా యువకుడి మీద పడింది. దీంతో ఆ యువకుడు స్పాట్ లోనే మృతి చెందాడు. చనిపోయిన వ్యక్తి దొరివాళ ప్రాంతానికి చెందిన జితేష్ అని స్థానికులు చెబుతున్నారు. పటేల్ నగర్ ఏరియాకి చెందిన 17 ఏళ్ల ప్రన్షు, 18 ఏళ్ల జితేష్ బిల్డింగ్ కింద నిలబడి మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో రెండో అంతస్తు నుంచి ఏసీ యూనిట్ జితేష్ తల మీద పడింది. దీంతో జితేష్ కింద పడిపోయాడు. ప్రన్షుకి గాయాలు అయ్యాయి. ఇద్దరినీ స్థానికులు హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అయితే అప్పటికే జితేష్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా ప్రన్షు చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

జితేష్ ఇంట్లోంచి అప్పుడే బయటకు వచ్చి బయట పార్క్ చేసి ఉన్న స్కూటీ మీద కూర్చున్నాడు. స్కూటీ కీ ఆన్ చేసి వెళ్లిపోయే ముందు ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాడు. ప్రన్షు జితేష్ కి బాయ్ చెప్పడానికి బయటకు వచ్చాడు. కాసేపు మాట్లాడుకున్నారు. వెళ్లిపోయే ముందు ఫ్రెండ్ ప్రన్షు జితేష్ కి హగ్ ఇచ్చాడు. అంతే అదే ఆఖరి హగ్ అయ్యింది. ఫ్రెండ్ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. ఏసీ యూనిట్ రెండో ఫ్లోర్ నుంచి జితేష్ మీద పడడంతో అప్పటివరకూ స్కూటీ మీద కూర్చుని ఉన్న జితేష్ కూలబడిపోయాడు. దేశ్ బందు గుప్త పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. ఫోరెన్సిక్ టీమ్ ప్రమాద ఘటనను పరీక్షించనుంది. దీనిపై దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. భారతీయ న్యాయ సంహిత చట్టంలోని ఇతరుల జీవితానికి లేదా వ్యక్తిగత భద్రతకు హాని కలిగించినందుకు 125(ఏ), నిర్లక్ష్యం కారణంగా ఒక వ్యక్తి మృతికి కారణమైనందుకు 106 సెక్షన్ల కింద ఏసీ యూనిట్ యజమానులపై కేసు నమోదు చేశారు.

Show comments