చెత్త సేకరించే మహిళలు.. రూ. 250 అప్పు చేసి.. 10 కోట్లు గెలిచారు!

ఆ మహిళలందరూ నిన్నటి వరకు తినడానికి తిండి కూడా లేని నిరుపేదలు. కానీ, ఇప్పుడు.. కోటీశ్వరులు. కేవలం 250 రూపాయలు.. దాదాపు 11 మంది మహిళల జీవితాన్ని మార్చేసింది. అది కూడా అప్పుగా తీసుకున్న ఆ మొత్తం వారందర్నీ కోట్లకు పడగలెత్తేలా చేసింది. అదృష్టం పడిశం పట్టినట్లు పట్టి.. కేరళ 10 కోట్ల లాటరీ లక్షల మందిని కాదని వీరిని వరించింది. 25 రూపాయలతో వారి దశ తిరిగింది. ఆ పూర్తి వివరాల్లోకి వెళితే.. కేరళలోని పరప్పనగడికి చెందిన 11 మంది మహిళలు అక్కడి మున్సిపాలిటీలో ప్లాస్టిక్‌ చెత్త ఏరే పని చేస్తూ ఉన్నారు. వీరు ప్రతీ రోజూ ఇంటి ఇంటికి వెళ్లి ప్లాస్టిక్‌తో పాటు భూమిలో కలిసిపోని వ్యర్థాలను సేకరిస్తూ ఉంటారు.

వీరికి నెలకు 7 వేలనుంచి 14 వేల రూపాయల జీతం వస్తుంది. అయితే, ఈ జీతం అస్సలు సరిపోయేది కాదు. ఈ నేపథ్యంలోనే కొద్దిరోజుల క్రితం వీరందరూ కేరళ 10 కోట్ల లాటరీ కొనాలని డిసైడ్‌ అయ్యారు. అందరూ 250 రూపాయలు అప్పుచేసి తీసుకున్నారు. తర్వాత దాంతో 250 రూపాయల టిక్కెట్‌ కొన్నాడు. అయితే, తమకు అదృష్టం వరిస్తుందని వాళ్లు అస్సలు ఊహించలేదు. తాజాగా, 10 కోట్ల లాటరీ ఫలితాలను ప్రకటించారు. అందులో వీరికి లాటరీ తగిలినట్లు తేలింది. మున్సిపల్‌ గోడౌన్‌లో పని చేసుకుంటున్న వీరికి సమాచారం అందింది.

దీంతో వారి నోట్లో మాటలు రాలేదు. ఆనందంతో ఉబ్బితబ్బుబ్బయ్యారు. ఆ డబ్బులతో తమ కష్టాలు మొత్తం గట్టెక్కుతాయని చెబుతున్నారు. వీరికి 10 కోట్ల లాటరీ తగిలిన విషయం ఆ ప్రాంతం మొత్తం పాకిపోయింది. వీరికి శుభాకాంక్షలు చెప్పడానికి పెద్ద సంఖ్యలో జనం గోడౌన్‌ దగ్గరికి చేరారు. గతంలో వీరందరూ ఓనం లాటరీ కొన్నారు. ఆ లాటరీలో వీరికి 7,500 వచ్చాయి. ఆ నమ్మకంతోనే ఈ సారి కూడా లాటరీ కొనడానికి పూనుకున్నారు. అదృష్టం మరోసారి వరించింది. మరి, చెత్త ఏరుకునే మహిళలకు 10 కోట్ల రూపాయల లాటరీ తగలటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments