iDreamPost
android-app
ios-app

అయ్యప్ప భక్తులకు గొప్ప శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.5 లక్షలు! సౌకర్యాలు కూడా..

  • Published Nov 04, 2024 | 1:31 PM Updated Updated Nov 04, 2024 | 1:31 PM

Sabarimala Ayyappa Devotees: అయ్యప్ప దీక్షల సీజన్ మొదలైంది. ప్రతిఏటా స్వామి వారిని దర్శించుకునేందుకు లక్షల సంఖ్యల్లో భక్తులు శబరిమల వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం.

Sabarimala Ayyappa Devotees: అయ్యప్ప దీక్షల సీజన్ మొదలైంది. ప్రతిఏటా స్వామి వారిని దర్శించుకునేందుకు లక్షల సంఖ్యల్లో భక్తులు శబరిమల వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం.

అయ్యప్ప భక్తులకు గొప్ప శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.5 లక్షలు! సౌకర్యాలు కూడా..

కార్తీక మాసం వచ్చిందంటే అయ్యప్ప దీక్షలు మొదలవుతాయి. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అయ్యప్ప స్వామి మాలధారణ చేస్తుంటారు భక్తులు. హరి హర సుతుడు అయ్యప్ప స్వామిని కీర్తిస్తూ మండల దీక్షని చేపట్టి తమ ఇడుముడిని స్వామి వారికి సమర్పించడానికి శబరిమల చేరుకుంటారు. ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి దర్శనం కోసం వెళ్లే భక్తుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. అయ్యప్ప ఆలయంలో మండల-మకరవిలక్కు యాత్ర సీజన్ ఈ నెల 16 నుంచి ప్రారంభం కానుంది. స్వామి వారిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు లక్షల సంఖ్యల్లో తరలి వస్తుంటారు. తాజాగా శబరిమల యాత్రికులకు గొప్ప శుభవార్త చెప్పింది కేరళా సర్కార్. పూర్తి వివరాల్లోకి వెళితేే..

అయ్యప్ప స్వామిని దర్శించుకునే యాత్రికులు అందరికీ ట్రావెన్​కోర్ దేవస్థానం బోర్డు (TDB) ఒక్కొక్కరికీ రూ.5 లక్షల ఉచిత బీమా సౌకర్యం కల్పించనుంది. ఈ విషయాన్ని కేరళా రాష్ట్రదేవస్థాన శాఖా మంత్రి వీఎన్ వాసవన్ తెలిపారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ విషయం గురించి చర్చించినట్లు దేవస్థానం మంత్రి వాసవన్ తెలిపారు. ఇప్పటికే యాత్రికుల కోసం కేరళా ప్రభుత్వం, ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు విస్తృత ఏర్పాటు చేసింది. ఆన్‌లైన్ టిక్కెట్లతో పాటు స్పాట్ బుకింగ్ దర్శనాలకు అనుమతిస్తామని దేవస్థానం బోర్డు తెలిపింది. అయ్యప్ప భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, సాఫీగా దర్శనం కల్పించేందుకు కొండ కింద గుడి వద్ద ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి తెలిపారు.అయ్యప్ప దీక్షలో ఉన్నే స్వాములు శబరిమల యాత్ర సందర్భంగా మరణిస్తే.. వారి కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారం అందించనున్నారు. అంతేకాదు ఆ భక్తుడి మృతదేహాన్ని స్వస్థలానికి తరలించడానికి ప్రభుత్వమే అన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. మొత్తం 13,600 మంది పోలీసు అధికారులు, 2,500 మంది అగ్నిమాపక, రెస్క్యూ సిబ్బంది, 1000 మంది పారిశుద్ద్య సిబ్బంది విధుల్లో పెడుతున్నట్ల మంత్రి తెలిపారు.

పథనంతిట్టా విపత్తు నిర్వహణ విభాగానికి రూ.17 లక్షల నిధులు మంజూరు చేశామన్నారు. అలాగే, 90 మంది రెవెన్యూ సిబ్బంది ఇందులో అంటారని ఆయన అన్నారు. ఇక, ప్రసాదాల విషయానికి వస్తే.. వృశ్చికం మాసం మొదటి రోజు నుంచి ఆరంభించి మండల – మకరవిళక్కు యాత్రం కోసం ఇప్పటికే 40 లక్షల అవరణ పాయసం (అయ్యప్ప పలహారం) డబ్బాలను సిద్దం చేశామని అన్నారు. యాత్రికులు చేరుకునే అన్ని ప్రాంతాలకు సరిపడా తాగునీటి సరఫరా అయ్యేలా జలమండలి ఇప్పటికే విస్తృత ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అంతేకాదు పంబ, సన్నిధానం, అప్పాచిమేడు సమీపంలోని హాస్పిటల్స్ లో ప్రత్యేక కార్డియాలజీ చికిత్స సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. భక్తులు యాత్ర చేసే సమయంలో ఏదైనా విషపురుగు, పాము కాటుగు గురతే వారికి యాంటీ- వెనమ్ చికిత్స అందించేందుకు వైద్యులను సిద్దంగా ఉంచామన్నారు.వన్యప్రాణి విభాగం ఆధ్వర్యంలో 1500 మంది ఎకో- గార్డులు, ఏనుగు స్క్వాడ్ లను నియమించారు.యాత్రికులకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందించేలా టీడీబీ ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు ఆయన అన్నారు. గత ఏడాది యాత్ర సీజన్ లో 15 లక్షల మందికి అన్నదానం అందించగా.. ఈ సంవత్సరం 20 లక్షల మంది అయ్యప్ప భక్తులకు సన్నిధానంలో అన్నదానం చేయనున్నట్లు మంత్రి వాసవన్ తెలిపారు. గతంలో భక్తులు ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో పేట్టుకొని ఈ ఏడాది ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.