iDreamPost
android-app
ios-app

ఆస్తి కోసం తల్లీ కూతుళ్ల మాస్టర్ స్కెచ్.. మామూలోళ్లు కాదు

ఆ ఇంట్లో బామ్మ, కూతురు, మనవరాలు జీవిస్తుంటారు. అయితే రెండు రోజుల నుండి పెద్దావిడ కనిపించడం లేదు. స్థానికులు అడిగితే ఆమెకు ఆరోగ్యం బాగోలేదని చెప్పింది మనవరాలు. కానీ ఆమె కదలికలపై అనుమానవ ంచ్చింది.

ఆ ఇంట్లో బామ్మ, కూతురు, మనవరాలు జీవిస్తుంటారు. అయితే రెండు రోజుల నుండి పెద్దావిడ కనిపించడం లేదు. స్థానికులు అడిగితే ఆమెకు ఆరోగ్యం బాగోలేదని చెప్పింది మనవరాలు. కానీ ఆమె కదలికలపై అనుమానవ ంచ్చింది.

ఆస్తి కోసం తల్లీ కూతుళ్ల మాస్టర్ స్కెచ్.. మామూలోళ్లు కాదు

మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలుగా మారిపోయాయి. తోడబుట్టిన వాళ్లే కాదు.. కడుపున పుట్టిన పిల్లలు కూడా రూపాయి ఉంటేనే తల్లిదండ్రుల్ని చూస్తున్నారు. ఆస్తి పాస్తులు పంచితేనే పేరెంట్స్‌ను గౌరవిస్తున్నారు. లేకుంటే మాకేం ఇచ్చావ్ అన్న చిన్న చూపు ధోరణీతో పాటు దెప్పి పొడుపు మాటలతో నిత్యం వేధిస్తుంటారు. తమ జీవనం కోసం కొంత డబ్బు దాచుకుంటే.. అవి ఇచ్చేంత వరకు పీడిస్తుంటారు. కొడుకులే కాదు కూతుళ్లు సైతం ఇలానే ఉన్నారు. ఆస్తిలో కొడుకులతో సమానంగా వాటా ఇస్తున్నా.. ఇంకా ఏదో ఇవ్వలేదని, పెట్టలేదని తల్లిదండ్రుల్ని హింసిస్తున్నారు. పంపకాల్లో ఏదైనా తేడా చేస్తే.. తల్లీ, తండ్రి అని కూడా చూడకుండా ఎంతటి ఘోరానికైనా ఒడిగట్టేందుకు వెనకాడటం లేదు. ఇదిగో నిర్మల విషయంలో ఇదే జరిగింది.

కేరళలోని అజూర్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ ఇంట్లో వృద్ధురాలు శవమై కనిపించింది. అదే ఇంట్లో ఉంటున్న కూతురు, మనవరాలిని అడగ్గా.. అనారోగ్య సమస్యలతో చనిపోయిందంటూ స్థానికులకు చెప్పారు. కానీ ఆమె మృతదేహం నుండి స్మెల్ రావడంతో పాటు తల్లీ కూతుళ్లు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు సమాచారం అందించగా.. అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్తి విషయంలో గొడవలే.. తల్లిని హత్య చేసి నార్మల్ మరణంగా చిత్రీకరించారు ఆమె కూతురు, మనవరాలు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిరాయింకేశ్‌కు చెందిన నిర్మల ముగ్గురు కూతుళ్లు. ఓ కూతురు అమెరికాలో స్థిరపడగా.. మరో కూతురు అదే రాష్ట్రంలో మరో ప్రాంతంలో ఉంటుంది. ఆమె పెద్ద కుమార్తె శిఖ మాత్రం కూతురు ఉత్తరతో కలిసి నిర్మల దగ్గరే ఉంటుంది.

ఈ నెల 17వ తేదీన నిర్మలకు ఆరోగ్యం బాగోలేదని బంధువులకు సమాచారం అందించారు తల్లీ కూతుళ్లు శిఖా, ఉత్తర.. తీరా వెళ్లి చూడగా.. ఆమె ఎప్పుడో మరణించింది. స్థానికులు కూడా ఏమైందమ్మా అని ఉత్తరని అడిగితే.. బామ్మకు అనారోగ్య సమస్యలతో చనిపోయిందంటూ చెప్పింది. కానీ ఆమె ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేసిన ఇరుగుపొరుగు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లీ కూతుళ్లు శిఖ, ఉత్తరలను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిర్మలకు చిరాయింకేశ్ సర్వీస్ కో ఆపరేటివ్ బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది. అలాగే కొన్ని ఆస్తులు ఉన్నాయి. ఇవన్నీ వేర్వేరు వ్యక్తుల పేర్లతో వీలునామా ఉండటంతో పాటు తనకేమీ ఇవ్వలేదన్న అక్కసుతో శిఖా.. తన తల్లి నిర్మలతో గొడవ పడింది.

చివరకు ఆమెను చంపి డబ్బు తమ పేరు మీద మార్చుకోవాలనుకున్నారు. ఈ నెల 14న నిర్మల మెడకు బెల్టు చుట్టి హత్య చేసి.. మూడు రోజుల తర్వాత అనారోగ్య సమస్యలతో చనిపోయింంటూ చెప్పారు. అప్పటికి నిర్మల మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉండటం, ఇంటి నుండి దుర్వాసన రావడంతో పోలీసులకు ఫిర్యాదు అందింది. రంగంలోకి దిగిన పోలీసులు CCTV కెమెరా ఫుటేజీ, ఫోన్ కాల్ సమాచారం ఆధారంగా పోలీసులు తల్లీ, కూతుళ్లను పట్టుకుని తమదైన స్టేల్లో విచారిస్తే.. నిందితులు నేరం ఒప్పుకున్నారు.  ఆస్తి కోసం తల్లి తండ్రులను కన్నబిడ్డలే మట్టుబెడుతున్న దారుణాలు రోజు రోజుకు పెరగడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.