Krishna Kowshik
భర్త వదిలేసి వెళ్లిపోయాడు. బిడ్డలను పెంచడమే కష్టంగా మారింది. కానీ భర్త చేసిన అప్పులు కుప్పగా పెరిగింది. చిల్లిగవ్వ కూడా తీర్చలేని పరిస్థితి. అప్పులు చెల్లించాలంటూ పీకపై కత్తిపెట్టడంతో పాటు ఆమెను ఇంట్లో నుండి గెంటేసింది సంస్థ. చివరకు..
భర్త వదిలేసి వెళ్లిపోయాడు. బిడ్డలను పెంచడమే కష్టంగా మారింది. కానీ భర్త చేసిన అప్పులు కుప్పగా పెరిగింది. చిల్లిగవ్వ కూడా తీర్చలేని పరిస్థితి. అప్పులు చెల్లించాలంటూ పీకపై కత్తిపెట్టడంతో పాటు ఆమెను ఇంట్లో నుండి గెంటేసింది సంస్థ. చివరకు..
Krishna Kowshik
ఇద్దరు పిల్లల్ని భార్యకు వదిలేసి ఏటో వెళ్లిపోయాడు భర్త. అతను చేసిన అప్పులు కుప్పలుగా పెరిగిపోయాయి. కుటుంబ పోషణ భారంగా మారింది మహిళకు. దీంతో బిడ్డల్ని పెంచుకునేందుకు బట్టల దుకాణంలో చేరింది. కానీ అప్పులు ఇచ్చిన వాళ్లు.. కడతావా, చస్తావా అంటూ పీకల మీద కూర్చొన్నారు. నా పరిస్థితి ఇది, బిడ్డలను పెంచుకోవడమే కష్టంగా ఉందన్న కనికరించలేదు. చివరకు ఆమెను ఇంటిని స్వాధీనం చేసుకుని, నడి రోడ్డుపైకి తోసేశారు. సామాన్లు తీసుకుంటామన్నా కూడా అంగీకరించలేదు. కట్టుబట్టలతో బిడ్డలతో నడిరోడ్డుపై నిలబడింది. ఎవరైనా షెల్టర్ ఇస్తారా అని ఎదురు చూసింది. ఆకలితో అలమటిస్తున్న పిల్లలకు బొక్కెడు బువ్వ పెట్టలేని దయనీయ స్థితి చూసి ఆమె మీద ఆమెకే అసహ్యం వేసింది. అయితే కొంత మంది ఆమెకు జరిగిన అన్యాయం గురించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ విషయం ప్రముఖ బిజినెస్ మ్యాన్ దృష్టికి వెళ్లింది. ఆపన్న హస్తం అందించి తన గొప్ప మనస్సు చాటుకున్నారు. ఆమెకు భారీ ఆర్థిక సాయాన్ని అందించారు. ఆపదలో దేవుడిలా ఆదుకున్న ఆ బిలీనియర్ ఎవరంటే.. లూలూ గ్రూప్ ఛైర్మన్ ఏంఏ యూసఫ్ అలీ.
లులూ మాల్స్ గురించి తెలియని వారుండరేమో బహుశా. దాని యజమానే ఈ యూసఫ్ అలీ. ఆయన కేవలం వ్యాపార వేత్తే కాదు.. దాతృత్వ శీలి. ఆయనకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. పది మందికి సాయం చేస్తూ ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఇప్పుడు ఆసరాగా కోల్పోయి.. బతుకు జీవుడా అనుకుని జీవిస్తున్న మహిళకు భారీ సాయం అందించి.. మరోసారి ట్రెండ్ అవుతున్నారు. కేరళలోని నార్ద్ పరవుర్‌లో సంధ్య కుటుంబం నివసిస్తోంది. 2019లో ఇంటి నిర్మాణం కోసం ఆమె భర్త రూ. 4 లక్షలు అప్పు చేశాడు. భార్యా, బిడ్డల్నిపెంచలేక రెండేళ్ల క్రితం కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో అప్పుల భారం మొత్తం భార్య సంద్యపై పడింది. ఓ వైపు భర్త లేక కుటుంబం ఎలా గడుస్తుందని ఏడుస్తుంటే.. అప్పు ఇచ్చిన సంస్థ మాత్రం.. డబ్బులు చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది. దీంతో అప్పుల భారం మొత్తం ఆమె నెత్తిన పడింది. తీసుకున్న అప్పు డబుల్ అయ్యింది.
బతుకు దెరువు కోసం ఓ బట్టల దుకాణంలో పనిచేస్తుంది. ఇంతలో వడ్డీలు పెరిగి రూ. 8 లక్షలైంది. డబ్బులు కట్టాలంటూ అప్పు ఇచ్చిన సంస్థ వార్నింగ్ ఇచ్చింది. కట్టలేదని గుర్తించి.. ఆమె ఇంటిని స్వాధీనం చేసుకుంది. సామాన్లు తీసుకుంటామని చెప్పినా వినిపించుకోలేదు. చాలా నిర్దయగా ఇంట్లో నుండి తోసేయడంతో కట్టుబట్టలతో బయట నిలబడింది. అయితే సంస్థ చర్యలపై స్థానికులు మండిపడుతూ సోషల్ మీడియా వేదికగా సంధ్య స్టోరీని పోస్టు చేశారు. ఈ విషయం లులు అధినేత యూసఫ్ అలీ దృష్టిలో పడింది. ఆమె పరిస్థితిని తెలుసుకున్న ఆయన చలించిపోయారు. వెంటనే సిబ్బందిని పంపి.. రుణం మొత్తం చెల్లించి ఇంటిని తిరిగి ఇప్పించారు. అంతేకాదు.. ఆమెకు రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందించారు.
సాయం పొందిన సంధ్య మీడియాతో మాట్లాడుతూ.. దుర్బర స్థితి నుంచి తన కుటుంబాన్ని బయటపడేసిన యూసఫ్ అలీకి కృతజ్ఞతలు తెలిపింది. ఈ సాయాన్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటామని కన్నీటి పర్యంతమయ్యింది. ఈ బిలీనియర్ చేసిన సాయాన్ని ప్రతి ఒక్కరినీ కదిలించడంతో పాటు.. ఆయనపై ప్రశంసలు కురిసేలా చేసింది. మీరు గ్రేట్ సార్ అంటూ కొనియాడుతున్నారు. వ్యాపార వేత్త మీలా ఉండాలని అంటున్నారు. కాగా, ఈ బిలీనియర్ ఆమెకే కాదు.. తన అభిమానులకు సర్ ప్రైజ్ గిఫ్టులు ఇస్తూ ఆశ్చర్యంలో ముంచేలా చేస్తుంటారు. ఇటీవల ఒక అభిమానికి ఖరీదైన ర్యాడో వాచ్‌ను బహుమతిగా ఇచ్చారు. అతడ్ని తన ఆఫీసుకు పిలిపించి.. చేతికి వాచ్‌ను తొడగడంతో అతడు షాకయ్యాడు. ఆ తర్వాత ఉబ్బితబ్బిబ్బు అయ్యాడు. అలాగే ఒక యువతి తనతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తుండటం గమనించిన ఆయన.. ఆమె దగ్గరకు వచ్చి, నవ్వుతూ సరదాగా ఫోటోకు పోజులు ఇచ్చారు. కష్టకాలంలో ఆదుకుంటున్న ఇటువంటి బిలినియర్లపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.