iDreamPost
android-app
ios-app

ఆ ఒక్కటి జరిగితే డబుల్ ఇస్మార్ట్ ఆగస్టు 15 రిలీజ్ కష్టమే! ఏమైందంటే?

  • Published Aug 09, 2024 | 12:18 PM Updated Updated Aug 09, 2024 | 12:24 PM

Double Ismart: రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ డబుల్ ఇస్మార్ట్ మూవీ ఈనెల ఆగస్టు 15వ తేదీన థియేటర్స్ లో గ్రాాండ్ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీకి కొత్త కష్టాలు వచ్చేలా ఉన్నాయి. ఒకవేళ అదే కనుక జరిగితే ఈ మూవీ అనుకున్న తేదీకి థియేటర్స్ లో రిలీజవ్వడం కష్టమనే చెప్పవచ్చు. ఇంతకీ ఏం జరిగిందంటే..

Double Ismart: రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ డబుల్ ఇస్మార్ట్ మూవీ ఈనెల ఆగస్టు 15వ తేదీన థియేటర్స్ లో గ్రాాండ్ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీకి కొత్త కష్టాలు వచ్చేలా ఉన్నాయి. ఒకవేళ అదే కనుక జరిగితే ఈ మూవీ అనుకున్న తేదీకి థియేటర్స్ లో రిలీజవ్వడం కష్టమనే చెప్పవచ్చు. ఇంతకీ ఏం జరిగిందంటే..

  • Published Aug 09, 2024 | 12:18 PMUpdated Aug 09, 2024 | 12:24 PM
ఆ ఒక్కటి జరిగితే డబుల్ ఇస్మార్ట్  ఆగస్టు 15 రిలీజ్ కష్టమే! ఏమైందంటే?

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా ‘డబుల్ ఇస్మార్’. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో ఇస్మార్ట్ శంకర్ రిలీజై సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ మూవీతో ఆడియోన్స్ ను ఎంటర్టైన్మెంట్ చేయడానికి మూవీ సిద్ధంగా ఉన్నారు. కాగా, ఈ డబుల్ ఇస్మార్ట్ మూవీలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటింస్తుంది. ఇక ఈ మూవీకి ఛార్మికౌర్ నిర్మాతగా వ్యవహారిస్తున్నారు. కాగా, ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈనెల ఆగస్టు 15వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లో రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో.. మూవీ టీమ్ ఇప్పటికే ప్రమోషన్స్ జోరుగా కొనసాగిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. మరొపక్క ఈ డబుల్ ఇస్మార్ట్ మూవీకి పోటీగా రవితేజ మిస్టర్ బచ్చన్, నార్నె నితిన్ ఆయ్ తో పాటు మరోవైపు విక్రమ్ తమిళ్ డబ్బింగ్ మూవీ తంగలాన్ బరిలో ఉన్నాయి.వీటితో పాటు మరో చిన్న సినిమా 35 కూడా ఉంది. అయితే వీటన్నింటి దీటుగా రేసులోకి దిగడానికి సిద్ధంగా రామ్ డబుల్ ఇస్మార్ట్ మూవీ. ఇప్పటికే అడ్వాన్స్ పలు ప్రాంతల్లో ఈ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా సాలిడ్ రేంజ్ లో రెస్పాన్సు వస్తుంది. ఈ విధంగా చూసుకుంటే.. ఈ మూవీకి భారీ ఓపెనింగ్స్ కూడా వచ్చేలా ఉన్నాయి. మరీ ఇలాంటి సమయంలో డబుల్ ఇస్మార్ట్ మూవీకి మరో కొత్త కష్టం వచ్చేలా ఉంది. ఒకవేళ అదే కనుక జరిగితే ఈ మూవీ అనుకున్న తేదీకి థియేటర్ లో రిలీజవ్వడం కష్టమనే చెప్పవచ్చు. ఇంతకీ ఏం జరిగిందంటే..

If that happens, the August 15 release of Double Smart will be difficult

రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ డబుల్ ఇస్మార్ట్ మూవీకి కొత్త కష్టాలు వచ్చేలా ఉన్నాయి. అసలు విషయానికి వెళ్తే.. గతంలో పూరి జగన్నాధ్ తెరకెక్కించిన లైగర్ సినిమా భారీ డిజాస్టార్ గా నిలవడమే కాకుండా.. సినిమా పూరికి చాలా నష్టాలను తెచ్చిపెట్టింది. ఇప్పటికి లైగర్ నష్టాలకు సంబంధించి పంచాయితీ తేల్చేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. కానీ, ఆ సమస్యకు పరిష్కారం రాలేదు. మరోవైపు లైగర్ డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను తనకు రావాల్సిన నష్ట పరిహారం విషయాన్ని తేల్చి అప్పుడు రిలీజ్ చేసుకోమని మొండి పట్టు పట్టాడు. ఒకవేళ సమస్య విషయంలో కనుక ఫిల్మ్ ఛాంబర్ సీరియస్ గా తీసుకోకుండా.. డబుల్ ఇస్మార్ట్ ను రిలీజ్ చేయాలని చూస్తే ఊరుకునేది లేదు, అవసరమైతే ఈనెల 15వ తేదీన థియేటర్ లో సినిమా బంద్చేయాలనీ, ఆ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని నైజాం ఎగ్జిబిటర్లు ఆలోచన చేస్తున్నారు. మరీ ఒకవేళ ఇదే కనుక నిజం అయితే ఈ సినిమాకు పెద్ద ఎఫెక్ట్ పడనుంది. దీంతో రామ్ ఫ్యాన్స్ నైజాం విషయం త్వరగా తేల్చేస్తే మంచిదని లేదంటే డే1 కలక్షన్స్ పై ప్రభావం పడుతుందని ఆందోళనపడుతున్నారు.

మరో వైపు ఆంధ్రలో మాత్రం ఈ సినిమాకు అన్ని రూట్లు క్లియర్ అయ్యాయి. ఇకపోతే నైజాం విషయంలో సినిమాకు ఎఫెక్ట్ లేకుండా ఉండాలంటే.. పూరి ఏ నిర్ణయం తీసుకుంటాడో, ఈ సమస్యకు ఎలా పరిష్కారం తీసుకుంటాడో చూడాల్సి ఉంది.ఇక ఈ విషయం పక్కన పెడితే.. డబుల్ ఇస్మార్ట్ మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా, ఇప్పటికే డబుల్ ఇస్మార్ట్ మూవీ టీజర్, ట్రైలర్, సాంగ్స్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు థియేటర్ లో ఎదురుచూస్తామనని ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు. కానీ, ఇంతలోనే ఈ సినిమాకు అనుకోని విధంగా పెద్ద చిక్కు వచ్చి పడింది. మరీ, రామ్ డబుల్ ఇస్మార్ట్ మూవీకి ఎదురైన సమస్యపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişJOJOBET GİRİŞgamdomCasibomjojobetJojobet Giriş