Venkateswarlu
ఇండియన్ సినిమా వంద కోట్ల వసూళ్లు సాధించడం గొప్ప విషయం అనుకుంటున్న సమయంలో వందల కోట్లు సాధించడం మొదలు అయింది. ఇప్పుడు వెయ్యి కోట్ల వసూళ్లు కూడా పెద్ద కష్టం ఏమీ కాదని ఇప్పటికే పలు సినిమాలు నిరూపితం చేశాయి. ఇక ఈ ఏడాది అయిన 2023 లో ఏకంగా అయిదు వెయ్యి కోట్ల సినిమాలు విడుదల అయినట్లుగా రికార్డ్ నమోదు అవ్వబోతుంది.
ఇండియన్ సినిమా వంద కోట్ల వసూళ్లు సాధించడం గొప్ప విషయం అనుకుంటున్న సమయంలో వందల కోట్లు సాధించడం మొదలు అయింది. ఇప్పుడు వెయ్యి కోట్ల వసూళ్లు కూడా పెద్ద కష్టం ఏమీ కాదని ఇప్పటికే పలు సినిమాలు నిరూపితం చేశాయి. ఇక ఈ ఏడాది అయిన 2023 లో ఏకంగా అయిదు వెయ్యి కోట్ల సినిమాలు విడుదల అయినట్లుగా రికార్డ్ నమోదు అవ్వబోతుంది.
Venkateswarlu
ఒకప్పుడు ఇండియన్ సినిమా వంద కోట్ల వసూళ్లు సాధించింది అంటే గొప్ప విషయం. పదేళ్ల క్రితం వరకు వంద కోట్ల వసూళ్లు సాధించడం అంత ఈజీ కాదు అనుకునేవారు. ఇక సౌత్ ఇండియన్ సినిమాలు వంద కోట్ల వసూళ్లు సాధించడం అనేది అసాధ్యం అన్నట్లుగా అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పడు పరిస్థితి మారింది. బాలీవుడ్ సినిమాలతో పాటు సౌత్ సినిమాలు ఈజీగా వంద కోట్ల వసూళ్లు నమోదు చేస్తున్నాయి. మొన్నటి వరకు ఇండియన్ సినిమాలు హాలీవుడ్ సినిమాల మాదిరిగా వెయ్యి కోట్లకు మించి వసూళ్లు సాధిస్తాయా?
అన్నఅనుమానాలు ఉండేవి. కానీ ఇప్పుడు బాలీవుడ్, సౌత్ సినిమాలు వెయ్యి కోట్ల వసూళ్లు సాధిస్తూ అందరి దృష్టి ఆకర్షిస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే పఠాన్, జవాన్ సినిమాలు వెయ్యి కోట్లకు మించి వసూళ్లు నమోదు చేసిన విషయం తెల్సిందే. మరో మూడు సినిమాలు కూడా ఈ ఏడాదిలో వెయ్యి కోట్ల సినిమాలుగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దంగల్, బాహుబలి 2, ఆర్ఆర్‌ఆర్, కేజీఎఫ్ సినిమాల వెయ్యి కోట్ల రికార్డ్ ని బ్రేక్ చేయడం ఇప్పట్లో సాధ్యం కాదు అనుకున్నారు.
కానీ, బాక్సాఫీస్ వర్గాల వారికి షాక్ ఇస్తూ 2023 ఆరంభంలోనే షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ తో వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు దక్కించుకున్నాడు. ఇక జవాన్ సినిమా కూడా వెయ్యి కోట్ల వసూళ్లు నమోదు చేసుకుని సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఇటీవలే విడుదల అయిన యానిమల్ సినిమా ఇప్పటి వరకు రూ.700 కోట్ల వసూళ్లు దక్కించుకుంది. పది రోజుల్లోనే ఆ స్థాయి వసూళ్లు నమోదు చేసింది కనుక లాంగ్ రన్ లో కచ్చితంగా యానిమల్ వెయ్యి కోట్ల మార్క్ ని క్రాస్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు బలంగా వాదిస్తున్నారు.
ఇక క్రిస్మస్ సందర్భంగా రాబోతున్న రెండు సినిమాలు సలార్ మరియు డంకీ లు కూడా వెయ్యి కోట్ల టార్గెట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఒక్క రోజు తేడాతో రాబోతున్న సలార్, డంకీ సినిమాలు కచ్చితంగా వెయ్యి కోట్ల వసూళ్లు సాధించగల సత్తా ఉన్న సినిమాలు. కానీ ఒకేసారి విడుదల అవుతున్న నేపథ్యంలో కచ్చితంగా రెండు సినిమాలకు ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయి. రెండు సూపర్ హిట్ అయితే కచ్చితంగా రెండు కూడా వెయ్యి కోట్ల వసూళ్లు నమోదు చేస్తుందనే నమ్మకాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.
రెండు సినిమాలు కాకున్నా కనీసం ఆ రెంటిలో ఒక్కటి వెయ్యి కోట్ల వసూళ్లు సాధించిన కూడా ఒకే ఏడాది నాలుగు వెయ్యి కోట్ల సినిమాలు విడుదల అయిన రికార్డ్ నమోదు అవ్వబోతుంది. ఒక వేళ రెండు హిట్ అయ్యి వెయ్యి కోట్ల వసూళ్లు నమోదు చేస్తే అరుదైన అద్భుతమైన రికార్డ్ గా చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇండియన్ బాక్సాఫీస్ వర్గాల వారు క్రిస్మస్ సినిమాల వైపు ఆసక్తిగా చూస్తున్నారు. మరి, సలార్, డంకీ సినిమాలు వెయ్యి కోట్ల వసూళ్లు సాధిస్తాయని మీరు భావిస్తున్నారా..? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.