iDreamPost
android-app
ios-app

2 వారాలలో రిలీజ్! స్కంద ఏ చప్పుడు లేదేంటి..?

  • Author ajaykrishna Updated - 01:15 PM, Wed - 13 September 23
  • Author ajaykrishna Updated - 01:15 PM, Wed - 13 September 23
2 వారాలలో రిలీజ్! స్కంద ఏ చప్పుడు లేదేంటి..?

ఇండస్ట్రీలో సినిమా రిలీజ్ దగ్గర పడుతుందంటే ఆ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ మామూలుగా ఉండవు. ఎక్కడ చూసినా ఆ సినిమా టీమ్ ప్రమోషనల్ ఈవెంట్స్, ఇంటర్వ్యూలు కనిపిస్తుంటాయి. ఇవన్నీ నార్మల్ గా ప్రతీ సినిమా రిలీజ్ కి జరిగేవి. కానీ.. ఓ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుందంటే.. ఏ రేంజ్ లో ప్రమోషన్స్ చేయాల్సి ఉంటుందో చెప్పక్కర్లేదు. బ్రాండ్ నేమ్ ఉన్న దర్శకుడు రాజమౌళి.. రిలీజ్ ముందు ప్రమోషన్స్ ఊహించని విధంగా ప్లాన్ చేస్తుంటాడు. బాహుబలి సిరీస్ తో వచ్చిన ఫేమ్ కి, వరల్డ్ వైడ్ గుర్తింపుకి అసలు ప్రమోషన్స్ చేయకపోయినా.. ఆయన పేరు మీద సినిమాలు కలెక్షన్స్ రాబడతాయి.

అలాంటి పాన్ ఇండియా డైరెక్టర్ తన సినిమాని థియేటర్స్ లోకి వచ్చేదాకా ఎంతో జాగ్రత్తగా ప్లానింగ్ చేసి ప్రమోట్ చేస్తుంటాడు. కానీ.. తెలుగు నుండి కొత్తగా పాన్ ఇండియా రిలీజ్ ప్రకటించిన స్కంద టీమ్ మాత్రం ఇంకా సైలెంట్ గా ఎందుకు ఉందో ఎవరికి అర్ధం కావట్లేదు. కొన్నాళ్ళుగా రామ్ పోతినేని ఇండస్ట్రీలో మాస్ హీరో ఇమేజ్ కోసం తెగ కష్టపడుతున్నాడు. ఆ విధంగా సినిమాలు ట్రై చేస్తున్నాడు. కానీ.. ఇంతవరకు సరైన మాస్ సినిమా పడలేదు. దీంతో కొత్తగా దర్శకుడు బోయపాటి కాంబినేషన్ లో స్కంద చేశాడు. ముందు సెప్టెంబర్ 15న రిలీజ్ అనుకున్న ఈ సినిమా.. సలార్ వాయిదా పడటంతో సెప్టెంబర్ 28కి వాయిదా వేసుకున్నారు. సరే మంచి వీకెండ్ దొరికింది కదా.. అని అంతా అనుకున్నారు.

ఇప్పటికి స్కంద నుండి విడుదలైన టీజర్, సాంగ్స్ కూడా కాస్త బజ్ అయితే క్రియేట్ చేశాయి. తీరా ట్రైలర్ వచ్చాక రెగ్యులర్ బోయపాటి మసాలా అనే కామెంట్స్ వినిపించాయి. పాన్ ఇండియా రిలీజ్ అనుకున్న ఈ సినిమాకి ఇంకా రెండు వారాల సమయమే ఉంది. కానీ.. ఇప్పటిదాకా హీరోహీరోయిన్, మూవీ టీమ్ అసలు ప్రమోషన్స్ స్టార్ట్ చేసినట్లు ఎక్కడా కనిపించడం లేదు. పైగా సినిమాకు సంబంధించి బిజినెస్ కూడా స్లోగా జరుగుతుందని టాక్. మరి పాన్ ఇండియా రిలీజ్ అన్నారు.. ఎక్కడా ఏ సౌండ్ వినిపించడం లేదు. ఎందుకు ఈ సైలెంట్? అని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి ఇకనైనా బోయపాటి ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తాడేమో చూడాలి. రామ్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటించగా.. చిట్టూరి శ్రీనివాస్ ఈ సినిమాని నిర్మించారు. మరి స్కంద గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş