iDreamPost
android-app
ios-app

Ram Charan: గేమ్ ఛేంజర్ టీమ్ కు రామ్ చరణ్ ఫ్యాన్స్ రిక్వెస్ట్! పాపం ఈ బాధ నరకం!

  • Published Aug 13, 2024 | 1:40 PM Updated Updated Aug 13, 2024 | 1:40 PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ ను చరణ్ ఫ్యాన్స్ ఓ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ ను చరణ్ ఫ్యాన్స్ ఓ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Aug 13, 2024 | 1:40 PMUpdated Aug 13, 2024 | 1:40 PM
Ram Charan: గేమ్ ఛేంజర్ టీమ్ కు రామ్ చరణ్ ఫ్యాన్స్ రిక్వెస్ట్! పాపం ఈ బాధ నరకం!

టాలీవుడ్ లో సినిమా పండగ మెుదలైపోయింది. వరుస సినిమాలతో స్టార్ హీరోలు ప్రేక్షకులను పలకరించే పనిలో పడ్డారు. ఆగస్ట్ 15న మిస్టర్ బచ్చన్ తో రవితేజ, డబుల్ ఇస్మార్ట్ తో రామ్ థియేటర్లలోకి రాబోతున్నారు. ఆ తరువాత కూడా భారీ చిత్రాలు ఆడియెన్స్ ను అలరించడానికి సిద్ధం అవుతున్నాయి. మరీ ముఖ్యంగా డిసెంబర్ లో స్టార్ హీరోల చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2, మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ భక్త కన్నప్ప, నాగచైతన్య తండేల్, నితిన్ రాబిన్ హుడ్ మూవీలతో పాటుగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ కూడా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ లో రానుంది. ఈ నేపథ్యంలో గేమ్ ఛేంజర్ టీమ్ కు చరణ్ ఫ్యాన్స్ ఓ రిక్వెస్ట్ చేస్తున్నారు.

గేమ్ ఛేంజర్.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ప్రతిష్టాత్మకమైన చిత్రం. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి అధికారిక అప్డేట్ ను మేకర్స్ రిలీజ్ చేయలేదు. దాంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇది చాలదు అన్నట్లుగా వారు ఇంకో బాధను అనుభవిస్తున్నారు. అదేంటంటే? ప్రమోషనల్  కంటెంట్ విషయంలో మూవీ టీమ్ స్పీడ్ గా లేరన్నది వారి బాధ.

Ram Charan Fan Request to Game Changer Team!

మిగతా సినిమాల విషయానికి వస్తే.. గేమ్ ఛేంజర్ కంటే స్పీడ్ గా ఉన్నారు. పుష్ప 2, దేవర మూవీలకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఏ రేంజ్ లో దూసుకెళ్తుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా దేవర సెకండ్ సాంగ్ ‘చుట్టమల్లే’ యూట్యూబ్ రికార్డ్స్ ను బ్రేక్ చేసింది. ఇప్పటికే 75 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుని దూసుకెళ్తోంది. ఇలాంటి కంటెంట్ ను గేమ్ ఛేంజర్ నుంచి ఫ్యాన్స్ ఊహించారు. కానీ, సినిమా నుంచి ఎలాంటి సాంగ్ గానీ, అప్డేట్స్ కానీ రావడం లేదు. అప్పడెప్పుడో ‘జరగండి జరగండి’ సాంగ్ వచ్చింది. డిసెంబర్ లో థియేటర్లకు వస్తామని ప్రకటించిన మేకర్స్ అందుకు సంబంధించిన కంటెంట్ ను ప్రేక్షకుల్లోకి వదలట్లేదు. ఇలాగైతే సినిమాపై బజ్ ఎలా ఏర్పడుతుంది? అంటూ బాధపడుతున్నారు. సాలిడ్ కంటెంట్ ను ఆడియెన్స్ లోకి తీసుకెళ్తేనే కదా భారీ హైప్ క్రియేట్ అయ్యేది అన్నది ఫ్యాన్స్ భావన.

ఇదిలా ఉండగా.. శంకర్ భారతీయుడు 2 సినిమా ఫలితం గేమ్ ఛేంజర్ పై పడుతుందా? అన్న టెన్షన్ కూడా మరోవైపు ఉంది. అయితే అలాంటిదేమీ లేదని గేమ్ ఛేంజర్ తో గట్టి హిట్ కొట్టబోతున్నామని మేకర్స్ ధీమాగా చెబుతున్నారు. ఇప్పటికైనా సాలిడ్ ప్రమోషనల్ కంటెంట్ ను విడుదల చేయాలని చరణ్ ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ టీమ్ కు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక ఇది చూస్తున్న సగటు సినీ అభిమానులు పాపం ఈ బాధ ఎవ్వరికీ రావొద్దని, చరణ్ ఫ్యాన్స్ ఈ విషయంలో నరకం అనుభవిస్తున్నారని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş