iDreamPost
android-app
ios-app

బన్నీకి నేషనల్ అవార్డు! ట్రెండ్ అవుతున్న మహేష్ బాబు!

  • Author ajaykrishna Published - 11:36 AM, Fri - 25 August 23
  • Author ajaykrishna Published - 11:36 AM, Fri - 25 August 23
బన్నీకి నేషనల్ అవార్డు! ట్రెండ్ అవుతున్న మహేష్ బాబు!

కొన్నిసార్లు ఇండస్ట్రీలో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ అనుకోకుండా మిస్ అవుతుంటాయి. ఆ కాంబినేషన్ లో సినిమా పడితే బాగుంటుందని అనిపిస్తుంది. కానీ.. చివరికి కారణాలు ఏవైనా ఫైనల్ గా హీరోనే నిర్ణయం తీసుకుంటాడు కాబట్టి.. ఏదైనా యాక్సెప్ట్ చేయకతప్పదు. అప్పుడు మిస్ అయిన అవకాశం.. వదులుకున్న సినిమాకు లేదా క్యారెక్టర్ కి ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభిస్తే ఎలా ఉంటుంది? అదే క్యారెక్టర్ కి ఏకంగా నేషనల్ అవార్డు వస్తే.. ముందు ఆ సినిమా వద్దనుకున్న హీరో ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి? అనంటే.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఇలాంటి చర్చలే జరుగుతున్నాయి. 69వ నేషనల్ ఫిల్మ్ అవార్డులలో పుష్ప సినిమాకి గాను అల్లు అర్జున్ కి ఉత్తమ నటుడుగా అవార్డు వరించింది.

దీంతో ఒక్కసారిగా అల్లు అర్జున్ పేరు దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. సోషల్ మీడియాలో కూడా బన్నీకి అన్ని ఇండస్ట్రీల నుండి, ఫ్యాన్స్ నుండి భారీ ఎత్తున బెస్ట్ విషెస్ లభిస్తున్నాయి. పుష్ప మూవీలో అల్లు అర్జున్ కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు.. ఇప్పటికే 2021 ఏడాదికి గాను చాలా అవార్డులు అందుకున్నాడు. అయితే.. నేషనల్ అవార్డు వచ్చిన అల్లు అర్జున్ పేరు ఎంత ట్రెండ్ అవుతుందో.. అదే రేంజ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు కూడా వైరల్ అవుతోంది. అందులోనూ పుష్ప మూవీకి మహేష్ ని లింక్ పెడుతూ ట్రెండ్ చేయడం గమనార్హం. మరి అల్లు అర్జున్ కు అవార్డు వస్తే.. అందరు సంతోషించే విషయమే.. ఆఖరికి మహేష్ బాబు కూడా సంతోషం వ్యక్తం చేస్తాడు.

అలాంటిది మహేష్ పేరును ఎందుకు ట్రెండ్ చేస్తున్నారు? అనంటే.. కొన్ని క్రేజీ కారణాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళ్తే.. 1 నేనొక్కడినే మూవీ ప్లాప్ అయ్యాక మహేష్ తో ఇంకో సినిమా ప్లాన్ చేశాడు సుకుమార్. మహేష్ వద్దకు వెళ్లి.. ఓ కథ కూడా వినిపించాడు. క్రియేటివ్ డిఫరెన్స్ వలన మహేష్ ఆ కథను రిజెక్ట్ చేసినట్లు ట్వీట్ పెట్టి మరీ క్లారిటీ ఇచ్చాడు. ఆ తర్వాత సుకుమార్.. అల్లు అర్జున్ తో పుష్ప తీసి మంచి హిట్ కొట్టాడు. అది కాస్త పాన్ ఇండియా నుండి పాన్ వరల్డ్ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకోవడమే కాకుండా.. ఇప్పుడు నేషనల్ అవార్డులు సైతం అందుకుంది. దీంతో అప్పుడు మహేష్ రిజెక్ట్ కథనే పుష్ప అని.. పుష్పను వదులుకొని మహేష్ మిస్టేక్ చేశాడని నెట్టింట అభిప్రాయాలు వెలువడుతున్నాయి. మరి మహేష్ కి సుకుమార్ చెప్పిన కథ ఇదేనా లేక వేరేనా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఇక నేషనల్ అవార్డు రాకతో అటు అల్లు అర్జున్, ఇటు మహేష్ పేర్లు మార్మోగుతున్నాయి. వీరిద్దరూ ప్రస్తుతం తదుపరి సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibomgrandpashabetmarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetgrandpashabet girişjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobet