iDreamPost
android-app
ios-app

ఆర్య హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడు ఆమె రేంజ్ ఏంటంటే? పూర్తిగా అజ్ఞాతంలోకి!

  • Published May 08, 2024 | 4:51 PM Updated Updated May 08, 2024 | 4:51 PM

ఆర్య మూవీ వచ్చి మే 7కి 20 ఏళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. అలాగే ఓ వేడుక నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా హీరోయిన్ గురించి ప్రస్తావించాడు బన్నీ.

ఆర్య మూవీ వచ్చి మే 7కి 20 ఏళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. అలాగే ఓ వేడుక నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా హీరోయిన్ గురించి ప్రస్తావించాడు బన్నీ.

  • Published May 08, 2024 | 4:51 PMUpdated May 08, 2024 | 4:51 PM
ఆర్య హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడు ఆమె రేంజ్ ఏంటంటే? పూర్తిగా అజ్ఞాతంలోకి!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన బ్యూటీఫుల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఆర్య. 2004లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. కొత్త కథ, కథనం, పాటలకు ఫిదా అయిపోయారు ఆడియన్స్. ఇప్పటికీ ఈ సినిమాకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బీజీఎం, పాటలు ఇప్పటికీ మనస్సును హత్తకుంటాయి. ఫీల్ మై లవ్ అంటూ మాయ చేశాడు. ఈ సినిమా వచ్చి ఈ నెల 7తో 20 ఏళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఎమోషనల్ ట్వీట్ చేశాడు బన్నీ. ఈ సినిమా తన దశను దిశను మార్చేసింది అంటూ పేర్కొన్నాడు. అలాగే 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ నిర్వహించింది చిత్ర యూనిట్.

అల్లు అర్జున్, దిల్ రాజు, దేవీ శ్రీ ప్రాసాద్, శివ బాలాజీ, రత్నవేల్ వంటి నటీనటులు హాజరై.. ఈ సినిమాతో తమకున్న అనుభవాలను పంచుకున్నారు. సుకుమార్, బన్నీలు తమ స్పీచుతో అదరగొట్టారు. అయితే అల్లు అర్జున్..ఇందులో తనకు జోడీగా నటించిన అనురాధ మోహతాను గుర్తు చేసుకున్నాడు. ఈ చిత్రంలో ఆమె భాగమైనందుకు ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. ఆర్య తర్వాత అనుని నేను ఎప్పుడూ కలవలేదని, కానీ నువ్వు లేకపోతే ఆర్య లేదు అని ప్రశంసించాడు. కాగా, ఈ వేడుకకు ఆమె రాకపోవడంపై కూడా చర్చించుకుంటున్నారు. దీంతో అనురాధ మెహతా ఎక్కడ ఉంది అంటూ నెటిజన్లు వెతుకుతున్నారు. కాగా, ఆమె సోషల్ మీడియాలో కూడా లేదని తెలుస్తోంది. ఆర్య అంటే.. గీత. గీత లేకుండా ఆర్య లేనే లేదు. ఈ రెండు క్యారెక్టర్లకు అంతలా కనెక్ట్ అయ్యారు ప్రేక్షకులు.

ఆర్య మూవీతో ఎంటరైన అను మోహతా.. ఈ సినిమాతో మంచి మార్కులు కొట్టేసింది. తన సైలెంట్ నటనతో కుర్రాళ్ల గుండెల్ని మీటింది. ఈ సినిమాతో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. కన్నడలో అజయ్ అనే మూవీ చేసింది. ఇది తెలుగు ఒక్కడు రీమేక్. పునీత్ సరసన నటించింది. ఆ తర్వాత నరేష్, ఆర్యన్ రాజేష్ నువ్వంటే నాకిష్టం చిత్రంలో కనిపించంది. మహారాజశ్రీ, వేడుక వంటి పిక్చర్స్ లో నటించింది. చివరిగా 2008లో వచ్చిన కన్నడ మూవీ హోంగనసులో నటించి.. సినిమాల నుండి తప్పుకుంది. అప్పటి నుండి కెమెరాకు దూరంగా ఉంది. 2021లో ఓ రిసార్టులో గొడవ జరగ్గా.. పోలీసులు రావడంతో మరోసారి వార్తల్లో నిలిచింది. కానీ అప్పటి నుండి మళ్లీ కనిపించలేదు. ఆర్య మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిన బ్యూటీ.. కేవలం నాలుగేళ్లకే ఇండస్ట్రీని విడిచిపెట్టింది. పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఇప్పుడు ఆమె ఎక్కడుంది అంటూ ఆరా తీస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş