ఇండస్ట్రీలో ఒకరి సినిమా, ఒకరి సినిమా గురించి కామెంట్స్ చేసేముందు.. ఆయా సినిమాలకు జనాలలో బజ్ ఎలా ఉంది? అనేది చూసుకుంటే చాలా బాగుంటుంది. కానీ.. ఊరికే ఒకరిపై ఉన్న ఆవేశాన్ని.. బాక్సాఫీస్ రిలీజ్ దగ్గర తేల్చుకుందాం అనుకుంటే తిప్పలు తప్పవు. ప్రస్తుతం ‘కశ్మీర్ ఫైల్స్’ మూవీ డైరెక్టర్ పరిస్థితి అలాగే ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అందుకు కారణం లేకపోలేదు. గతేడాది కశ్మీర్ ఫైల్స్ సినిమాతో ఇండియా వైడ్ అద్భుతమైన విజయం అందుకున్నాడు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. రూ. 15 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన కశ్మీర్ ఫైల్స్ మూవీ.. ఏకంగా రూ. 300 కోట్లకు పైగా వసూల్ చేసింది.
ఆ టైమ్ లో కశ్మీర్ ఫైల్స్ కి పోటీగా బాక్సాఫీస్ వద్ద డార్లింగ్ ప్రభాస్ నటించిన.. రాధేశ్యామ్ విడుదలైంది. రాధేశ్యామ్ మూవీ నిరాశ పరచడంతో.. జనాలంతా కశ్మీర్ ఫైల్స్ కి క్యూ కట్టి బ్రహ్మరథం పట్టారు. అది ముగిసింది. ఈ ఏడాది ఆదిపురుష్ మూవీ టైమ్ లో ప్రభాస్ ని టార్గెట్ చేస్తూ ఘోరంగా కామెంట్స్ చేశాడు వివేక్. పైగా ప్రభాస్ నుండి వస్తున్న సలార్ మూవీకి పోటీగా అదే రోజు తన సినిమా కూడా రిలీజ్ చేస్తానని సవాల్ విసిరాడు. అనుకున్నట్లుగా తాను తీసిన వ్యాక్సిన్ వార్.. సెప్టెంబర్ 28న రిలీజ్ అయ్యింది. కానీ.. సలార్ వాయిదా పడి.. డిసెంబర్ 22న రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. అయితే.. వివేక్ వ్యాక్సిన్ వార్ గురించి చెప్పిందంతా బిల్డప్ అని అంటున్నారు విశ్లేషకులు.
ఎందుకంటే.. సినిమా ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ థియేటర్స్ లో కనిపించడం లేదు. ఫస్ట్ డే నుండి వ్యాక్సిన్ వార్ పట్ల జనాలు ఆసక్తి చూపించడం లేదట. దాదాపు పెట్టిన బడ్జెట్ కి ఇరవై శాతం కూడా రెండు రోజుల్లో కవర్ చేయలేకపోయిందని ట్రేడ్ వర్గాల సమాచారం. మొత్తానికి వివేక్ ఆర్భాటంగా రిలీజ్ చేసిన వ్యాక్సిన్ వార్.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ వైపు పరుగులు పెడుతుందని అంటున్నారు. మరి ఇలాంటి సినిమాని పాన్ ఇండియా మూవీ సలార్ కి పోటీగా దింపాలని ఎలా అనుకున్నాడో గానీ.. జనాలు గట్టిగా సమాధానం చెప్పారని నెటిజన్స్ చెప్పుకుంటున్నారు. మరోవైపు సలార్ లేకపోతేనే సినిమా పరిస్థితి ఇలా ఉంటే.. ఒకవేళ సలార్ వచ్చి ఉంటే పరిస్థితి ఏంటని కామెంట్స్ చేస్తున్నారు. మరి వ్యాక్సిన్ వార్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.
#TheVaccineWar is heading towards a huge disaster despite glowing reviews.
Going by the first two days’ numbers, the film may not be able to recover the print costs both in domestic & overseas markets. pic.twitter.com/5Iu3dKi6bu
— Aakashavaani (@TheAakashavaani) September 30, 2023