iDreamPost
android-app
ios-app

రాత్రుళ్లు తాగుతూ.. తెల్లారి స్క్రీన్​పై దేవుడిగా చేస్తే ప్రజలు నమ్మరు: వివేక్ అగ్నిహోత్రి

  • Author singhj Published - 06:54 PM, Tue - 25 July 23
  • Author singhj Published - 06:54 PM, Tue - 25 July 23
రాత్రుళ్లు తాగుతూ.. తెల్లారి స్క్రీన్​పై దేవుడిగా చేస్తే ప్రజలు నమ్మరు: వివేక్ అగ్నిహోత్రి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒక్కో సినిమాతో తన రేంజ్​ను పెంచుకుంటూ పోతున్నారు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా ఆయన మూవీస్ చేసుకుంటూ వెళ్తున్నారు. ‘బాహుబలి 2’ సినిమా తర్వాత సరైన హిట్ లేనప్పటికీ ఆయన నటించిన ‘ఆదిపురుష్’ మూవీ ఇటీవల రిలీజై భారీ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. ఈ చిత్రంపై ఎన్ని వివాదాలు, ట్రోల్స్ వచ్చినప్పటికీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో ప్రభాస్ సక్సెస్ అయ్యారు. అయితే ఈ ఫిల్మ్ లాంగ్ రన్​ను కొనసాగించలేకపోయింది. ఓపెనింగ్స్ సూపర్బ్​గా వచ్చినప్పటికీ ఫుల్ రన్​లో దాన్ని కంటిన్యూ చేయలేకపోయింది.

‘ఆదిపురుష్’ సినిమాను తీసిన విధానం, అందులో ప్రధాన పాత్రలను చూపించిన తీరుపై ఎన్నో విమర్శలు వినిపించాయి. అయితే మొత్తానికి ఈ సినిమా నుంచి బయటపడిన ప్రభాస్ తన తదుపరి చిత్రాలపై దృష్టి పెడుతున్నారు. ‘సలార్​’తో పాటు ‘కల్కీ 2898 ఏడీ’ మీద డార్లింగ్ ఫోకస్ చేస్తున్నారు. ఇలాంటి టైమ్​లో ప్రభాస్​ను ఉద్దేశించి ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి మరోమారు సంచలన కామెంట్స్ చేశారు. ప్రతి రోజూ రాత్రి తాగేవాళ్లు తెల్లారి లేచి దేవుడిగా నటిస్తే ప్రజలు ఎలా నమ్ముతారని ఆయన ప్రశ్నించారు. భారతీయ పౌరాణిక, ఇతిహాసాలపై సినిమాలు తీసే మేకర్స్ కథ, కథనాల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలన్నారాయన. పౌరాణిక, ఇతిహాసాలపై పూర్తి పట్టు ఉంటే తప్ప సినిమాగా తీసే ప్రయత్నం చేయొద్దని సూచించారు.

రామాయణం, మహాభారతంను పూర్తిగా నమ్మి సినిమా తీస్తే ఫలితం బాగుంటుందని వివేక్ అగ్నిహోత్రి అన్నారు. ‘ఆదిపురుష్’ మూవీ విషయంలో తప్పంతా మేకర్స్​దేనని ఆయన చెప్పుకొచ్చారు. ‘ఫలానా స్టార్ స్క్రీన్ మీద కనిపించి నేను దేవుడ్ని అన్నంత మాత్రాన వాళ్లు భగవంతులైపోరు. ప్రతి రోజూ రాత్రి తాగివచ్చే వారు ఉదయం లేచి నేను దేవడ్ని, నన్ను నమ్మండి అంటే ఎలా? అలాంటి వారిని ఎవరూ నమ్మరు. అలా చేసే స్టార్లను నమ్మడానికి ప్రజలు పిచ్చోళ్లేమీ కాదు’ అని వివేక్ అగ్నిహోత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే ఒకసారి ప్రభాస్​పై కామెంట్స్ చేసిన ఈయన.. మరోమారు డార్లింగ్​ను పరోక్షంగా టార్గెట్ చేయడం కాంట్రవర్షియల్​గా మారింది. ప్రభాస్​పై వివాదాస్పద కామెంట్స్ చేసిన వివేక్ అగ్నిహోత్రి మీద డార్లింగ్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet