iDreamPost
android-app
ios-app

మరో వివాదంలో విశ్వక్ సేన్! మళ్లీ విజయ్​ను టార్గెట్ చేశాడంటూ..!

  • Author singhj Published - 05:00 PM, Tue - 29 August 23
  • Author singhj Published - 05:00 PM, Tue - 29 August 23
మరో వివాదంలో విశ్వక్ సేన్! మళ్లీ విజయ్​ను టార్గెట్ చేశాడంటూ..!

ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా వచ్చి సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంటే అంత ఈజీ కాదు. కానీ సొంత ప్రతిభను నమ్ముకొని, అష్టకష్టాలు పడి ఛాన్సులు దక్కించుకొని స్టార్లుగా ఎదిగిన వాళ్లు చాలా కొద్ది మందే ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు యంగ్ హీరో విశ్వక్​ సేన్. చేసింది తక్కువ సినిమాలే అయినా యూత్, మాస్​లో మంచి క్రేజ్ సంపాదించారు విశ్వక్. ‘ఈ నగరానికి ఏమైంది’, ‘హిట్’, ‘ఫలక్​నుమా దాస్’, ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ లాంటి హిట్లతో కెరీర్​లో జెట్​ స్పీడుతో దూసుకెళ్తున్నారాయన. ప్రస్తుతం ‘గ్యాంగ్స్​ ఆఫ్ గోదావరి’ చిత్రంలో ఆయన నటిస్తున్నారు.

ఓటీటీలోనూ విశ్వక్ సేన్ ఓ రియాలిటీ షోను హోస్ట్ చేస్తున్నారు. ‘ఆహా’ ఓటీటీలో ‘ఫ్యామిలీ ధమాకా’ అనే షో చేస్తున్నారాయన. ఇప్పటికే కొన్ని ఎపిసోడ్స్ షూట్ చేశారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. విశ్వక్ గతంలో పలు వేదికలపై చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. కొన్ని సందర్భాల్లో ఆయన చేసిన కామెంట్స్​ మరో యంగ్ హీరో విజయ్​ దేవరకొండను ఉద్దేశించి చేసినవేనని పలువురు ఆరోపించారు. సోషల్ మీడియాలో విజయ్ ఫ్యాన్స్ విశ్వక్​ను టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మరోసారి విశ్వక్​ను నెటిజన్స్ టార్గెట్ చేస్తున్నారు. ఆయన విజయ్ దేవరకొండను ఉద్దేశించి మాట్లాడారని అంటున్నారు.

అసలేం జరిగిందంటే.. ‘ఆహా’లో చేస్తున్న ‘ఫ్యామిలీ ధమాకా’ షో వివరాలు వెల్లడించడానికి సోమవారం సాయంత్రం ఓ ప్రెస్​మీట్ పెట్టారు. ఈ సందర్భంగా ఓ జర్నలిస్ట్ విశ్వక్​సేన్​ను ఓ ఆసక్తికర ప్రశ్న అడిగారు. ఇప్పుడు అందరు హీరోలు మల్టీస్టారర్, పాన్ ఇండియా లెవల్లో మూవీస్ ప్లాన్ చేస్తున్నారని.. ఇమేజ్ పరంగా మీ అంచనాలు ఏంటని క్వశ్చన్ చేశారు. దీనికి విశ్వక్ స్పందిస్తూ.. ‘ఇమేజ్ పరంగా మనకన్నీ తెలుసు. మనం మేధావులమని లెక్కలేసుకుంటాం. కానీ కొన్నిసార్లు మనం పాన్ ఇండియా మూవీ తీద్దామని అనుకుంటాం. అది గల్లీ సినిమా అవుతుంది. అదే కొన్నిసార్లు ‘కాంతార’ లాంటి చిన్న చిత్రం తీస్తాం. అది కాస్తా పాన్ ఇండియా మూవీ అయిపోతుంది’ అని విశ్వక్ చెప్పుకొచ్చారు.

‘సినిమాలు చేసుకుంటూ పోవడమే నా పని. ఏది రూ.100 కోట్లు, ఏది రూ.200 కోట్లు కొల్లగొడుతుందో లెక్కలేసేంత మేధావిని నేను కాదు. ప్రతి సినిమాకు ఒకేలా కష్టపడతా. మూవీస్ చేస్తున్న తరుణంలో దారిలోకి ఈ షో వచ్చింది. కచ్చితంగా ఈ షో నాకు మేలు చేస్తుంది’ అని విశ్వక్ సేన్ వ్యాఖ్యానించారు. ఈ యంగ్ హీరో కామెంట్స్​కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఆయన విజయ్ దేవరకొండను ఉద్దేశించే పైవ్యాఖ్యలు చేశారని కొంతమంది నెటిజన్స్ అంటున్నారు. అయితే ఇంకొందరు మాత్రం విశ్వక్ దేని గురించి మాట్లాడినా ఎందుకో విజయ్ గురించి మాట్లాడినట్లే ఉంటుందని కామెంట్స్ పెడుతున్నారు. మరి.. విశ్వక్ సాధారణంగానే ఈ వ్యాఖ్యలు చేశారా? లేదా విజయ్​ దేవరకొండను దృష్టిలో పెట్టుకొని ఈ కామెంట్స్ చేశారా? అనేది ఆయనకే తెలియాలి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetJojobetmatbetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet