iDreamPost
android-app
ios-app

vishvak sen వివాదాల వనంలో అర్జున కళ్యాణం

  • Published May 04, 2022 | 2:24 PM Updated Updated May 04, 2022 | 2:24 PM
vishvak sen వివాదాల వనంలో అర్జున కళ్యాణం

రెండు రోజుల క్రితం విశ్వక్ సేన్ ఏ ఉద్దేశంతో ప్రాంక్ వీడియో చేసినా దానికి మించి పదిరెట్ల ఫలితం దక్కింది. టీవీ9 స్టూడియోలో జరిగిన రచ్చ, యాంకర్ దేవి నాగవల్లి ప్రవర్తన. విశ్వక్ వాడిన అభ్యంతరకర పదం తదితరాలు సోషల్ మీడియాలో చాలా బలంగా వెళ్లాయి. నిన్న దేవి ఏకంగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ని కలిసి ఫిర్యాదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. విశ్వక్ సేన్ సైతం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ వివాదానికి సంబంధించి మరింత క్లారిటీ ఇవ్వడమే కాదు ఆ ప్రాంక్ లో పాల్గొన్న అబ్బాయిని ఎవరూ ఏమి చేయలేరని తనకు నేనున్నానంటూ ఘాటు వార్నింగ్ ఇవ్వడం ఆన్ లైన్ లో వైరల్ అయ్యింది.

దెబ్బకు అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమా మీద జనాల ఫోకస్ మళ్లింది. పేస్ బుక్ ఇన్స్ టా తదితరాల్లో విశ్వక్ కు నెటిజెన్ల మద్దతు దక్కుతోంది. ఎల్లుండి విడుదల కాబోతున్న ఈ చిత్రం ఓపెనింగ్స్ మీద ఈ ఇష్యూ అంతో ఇంతో పాజిటివ్ గా ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. అసలే పోటీగా జయమ్మ పంచాయితీ, భళా తందనాన ఉన్నాయి. ఇవి కాదు కానీ డాక్టర్ స్ట్రేంజ్ మల్టీ వర్స్ అఫ్ మ్యాడ్ నెస్ బుకింగ్స్ భయపెడుతున్నాయి. పిల్లల కోసం ఫ్యామిలీ ఆడియన్స్ కూడా దానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక యూత్ సంగతి సరేసరి. అందుకే విశ్వక్ ఎలాగైనా ఓపెనింగ్స్ పోగొట్టుకూడదనే ఉద్దేశంతో గట్టి ప్రమోషన్లు చేస్తున్నాడు.

అసలే చేతిలో వారం రోజుల టైం మాత్రమే ఉంటుంది. మే 12న మహేష్ బాబు సర్కారు వారి పాట వచ్చాక ఆడియన్స్ ఛాయస్ అదే అవుతుంది. ఆలోగా వీలైనంత రాబట్టుకోవాలి. ఒకవేళ అశోక వనంలోకి సూపర్ హిట్ టాక్ వస్తే సెకండ్ వీక్ లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. చెప్పుకోదగ్గ సంఖ్యలో థియేటర్లు కంటిన్యూ అవుతాయి. అది సినిమా చూశాకే తెలుస్తుంది. ఆచార్య దారుణమైన ఫలితం దీనికి ప్లస్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. మ్యూజిక్ వైరల్ కాకపోవడం, కాన్సెప్ట్ గురించి జనం పెద్దగా మాట్లాడుకొకపోవడం లాంటి బలహీనతలు మూవీలోని కంటెంట్ కాచుకోవాలి. మరి విశ్వక్ కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుందా. లెట్ వెయిట్ అండ్ సి