Vishal: వారిపై విశాల్‌ ఆగ్రహం.. సినిమాలపై మీ పెత్తనం ఏంటంటూ

Vishal.. కోలీవుడ్ హీరో విశాల్ టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. నేరుగా సినిమాలు చేయనప్పటికీ.. తన డబ్బింగ్ చిత్రాలతో ఇక్కడ కూడా మంచి మార్కెట్ ఏర్పరుచుకున్నాడు. అలాగే సామాజిక అంశాలు, సేవాగుణం కూడా ఎక్కువే. సినిమా ఇండస్ట్రీ గురించి ఎక్కువ ఆలోచిస్తుంటాడు. ఈ నేపథ్యంలో

Vishal.. కోలీవుడ్ హీరో విశాల్ టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. నేరుగా సినిమాలు చేయనప్పటికీ.. తన డబ్బింగ్ చిత్రాలతో ఇక్కడ కూడా మంచి మార్కెట్ ఏర్పరుచుకున్నాడు. అలాగే సామాజిక అంశాలు, సేవాగుణం కూడా ఎక్కువే. సినిమా ఇండస్ట్రీ గురించి ఎక్కువ ఆలోచిస్తుంటాడు. ఈ నేపథ్యంలో

కోలీవుడ్ హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. పేరుకు తమిళ ఇండస్ట్రీ అయినా..అతడు తెలుగు అబ్బాయి. సినిమాల పరంగానే కాదు.. సామాజిక సేవలో ముందు వరుసలో ఉంటాడు. తనకు నచ్చని విషయాన్ని కుండబద్దలు చేస్తుంటాడు. ఈ ఏడాది రత్నం మూవీతో పలకరించాడు. ప్రస్తుతం తుప్పరివాలన్ సీక్వెల్ చేస్తున్నాడు విశాల్. తాను రాజకీయాల్లోకి వస్తానని, 2026లో పార్టీని ఏర్పాటు చేసి, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని గతంలో వెల్లడించాడు. అలాగే ఇండస్ట్రీ బాగుండాలని ఆరాటపడే వ్యక్తి. ఇదిలా ఉంటే తాజాగా డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు చేశాడు. సినిమా ఇండస్ట్రీపై తమిళనాడు ప్రభుత్వం జోక్యం ఎక్కువైందని విమర్శలు గుప్పించాడు. ఈ క్రమంలో రత్నం మూవీ సినిమా రిలీజ్ సమయంలో జరిగిన సంఘటనను గుర్తు చేశారు.

కడలూరులో ఓ క్యారక్రమానికి హాజరైన విశాల్ తమిళనాడు మంత్రి కమ్ నటుడు ఉదయనిధి స్టాలిన్, ఆయన బ్యానర్ రెడ్ జెయింట్ పై తీవ్రంగా విమర్శలు చేశాడు . తాను నటించిన రత్నం సినిమా విడుదలను అడ్డుకున్నారని, ఆ అధికారం ఎవరిచ్చారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. సినిమా రంగంపై స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వ పెత్తనం ఎక్కువైందని, గత ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోలేదని అన్నారు. ‘తమిళ సినిమాకు ఏడాది నుండి కష్టకాలంగా మారింది. సినిమాలను కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడమే దీనికి కారణం. రాబోయే రోజుల్లో 10 పెద్ద సినిమాలు విడుదల అవుతున్నాయి. ఫెస్టివల్ సీజన్స్ అయిన దసరా, దీపావళి, క్రిస్మస్ బరిలో ఈ సినిమాలు విడుదలవుతున్నాయి. దీంతో చిన్న సినిమాలను కొనేవారు లేరు. విడుదల చేసేవారు లేరు. అయినప్పటికీ మంచి సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారు’అని చెప్పారు.

అయితే ఈ ఏడాది కమర్షియల్ గా చిత్ర పరిశ్రమకు కష్ట తరంగా మారనుంది. దీనికి కారణం ప్రభుత్వ జోక్యమే. సినిమా విషయాల్లోకి ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవాలి అంటూ ప్రశ్నించారు. ఇక రాజకీయాల్లోకి తాను రావాలా వద్దా అనేది ప్రజలే డిసైడ్ చేస్తారున్నారు. ఒక వేళ తాను రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకుంటే.. మరో మార్గం లేదు.. ప్రజల కోసం వస్తానని అన్నారు. ‘నేను షూటింగ్ కి వెళ్లినప్పుడు తాగు నీరు లేని గ్రామం ఉంది. స్వాంత్రంత్యం వచ్చి 70 ఏళ్లు గడిచినా తాగునీరు లేని గ్రామం ఉందంటే విడ్డూరంగా ఉంది. రాజకీయ నాయకులు నటులుగా మారిపోవడం వల్ల.. నటులు రాజకీయ నేతలుగా మారుతున్నారు’ అంటూ బహిరంగ విమర్శలు చేశారు విశాల్.

Show comments