iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్: హీరో జీవా కారుకు ప్రమాదం..

  • Published Sep 11, 2024 | 3:44 PM Updated Updated Sep 11, 2024 | 3:45 PM

Jiiva: తమిళ స్టార్ హీరో జీవాకు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. చెన్నై నుండి సేలం వస్తుండగా.. కన్నియమూర్ వద్ద ఆయన కారు బారికేడ్ ను ఢీ కొట్టింది

Jiiva: తమిళ స్టార్ హీరో జీవాకు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. చెన్నై నుండి సేలం వస్తుండగా.. కన్నియమూర్ వద్ద ఆయన కారు బారికేడ్ ను ఢీ కొట్టింది

  • Published Sep 11, 2024 | 3:44 PMUpdated Sep 11, 2024 | 3:45 PM
బ్రేకింగ్: హీరో జీవా కారుకు ప్రమాదం..

తమిళ స్టార్ హీరో జీవాకు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. చెన్నై నుండి సేలం వస్తుండగా..కళ్లకురిచ్చి జిల్లా కన్నియమూర్ వద్ద ఆయన కారు బారికేడ్‌ను ఢీ కొట్టింది. భార్య సుప్రియతో కలిసి వెళుతుండగా.. అనుకోకుండా ఎదురుగా వచ్చిన బైక్‌ను తప్పించే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. నటుడు జీవా, ఆయన భార్యకు ఎటువంటి గాయాలు కాలేదని సమాచారం. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ స్తంభించి, గందరగోళం నెలకొంది. ప్రముఖ దర్శకుడు ఆర్బీ చౌదరి తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు జీవా. చైల్ట్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ చేసిన జీవా.. ఆసై ఆసై మూవీతో హీరోగా మారాడు. ‘ఈ’ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న ఈ నటుడు.. తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో నటించాడు.

శివ మనసులో శక్తి, రంగం (కో), రౌద్రం, స్నేహితుడు, మాస్క్ (మూగముడి), పోకిరి రాజా వంటి చిత్రాలతో ఫేమ్ తెచ్చుకున్నాడు. తెలుగులో ఏటో వెళ్లిపోయింది మనసు చిత్రంలో ఓ పాటలో కనిపించిన ఆయన.. ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన యాత్ర 2లో మెయిన్ రోల్ పోషించాడు. అలాగే కస్టడీలో కూడా క్యామియో అప్పీయరెన్స్ ఇచ్చారు. 83 చిత్రంతో హిందీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు జీవా. ప్రస్తుతం ఆయన మంచు విష్ణు  కలల ప్రాజెక్ట్ కన్నప్పలో కూడా నటిస్తున్నాడు. దీంతో పాటు మరో తమిళ్ మూవీ చేస్తున్నాడు జీవా.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet