iDreamPost
android-app
ios-app

ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి.. ఓ స్టార్ హీరోయిన్

  • Published Mar 05, 2024 | 4:00 PM Updated Updated Mar 05, 2024 | 4:00 PM

ఈ ఫోటోలో ఇద్దరు చిన్నారులు విందు భోజనం చేస్తూ.. ఎవరి గురించో చర్చించుకుంటున్నారు కదా. అందులో అందంగా , చందమామలా కనిపిస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్. ఎవరో గుర్తు పట్టారా..?

ఈ ఫోటోలో ఇద్దరు చిన్నారులు విందు భోజనం చేస్తూ.. ఎవరి గురించో చర్చించుకుంటున్నారు కదా. అందులో అందంగా , చందమామలా కనిపిస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్. ఎవరో గుర్తు పట్టారా..?

  • Published Mar 05, 2024 | 4:00 PMUpdated Mar 05, 2024 | 4:00 PM
ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి.. ఓ స్టార్ హీరోయిన్

టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిల కంటే ఇతర భాషలకు చెందిన అందగత్తెలు హవా సాగిస్తుంటారు. బహు భాష నటీమణులు తెలుగు ఇండస్ట్రీలో సత్తా చాటి, పాతుకుపోయి.. ఇక్కడ హీరోలను మనువాడిన హీరోయిన్లు ఉన్నారు. ఎక్కడ బ్యూటీ కనిపిస్తుందో వెంటనే సినిమా అభిరుచి ఎక్కువ ఉన్న టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేస్తుంటారు దర్శక నిర్మాతలు. అటు ఢిల్లీ నుండి ఇటు మాలీవుడ్ వరకు ఎంతో మంది ముద్దుగుమ్మలు టీటౌన్‌లో మెరిశారు.. మెరుస్తూ ఉంటారు. పరాయి ఇండస్ట్రీలో అంత పాపులర్ కాకపోయినా పర్లేదు, డీ గ్లామర్ పాత్రలు పోషిస్తున్నా ఓకే, ఇక్కడకు తెచ్చేయాల్సిందే. కాస్తంత టాలెంట్ కనిపించినా చాలు, అటువంటి భామలకు లైఫ్ ఇచ్చేస్తుంది టాలీవుడ్ ఇండస్ట్రీ.

ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న పాపనను చూశారా.. ఏదో విందులో కూర్చుని ఎవరినో తదేకంగా చూస్తుంది కదూ. చక్కటి చిరునవ్వుతో చందమామ మోముతో కనిపిస్తున్న ఈ చిన్నారి.. ఇప్పుడో స్టార్ హీరోయిన్. మాలీవుడ్ నుండి వచ్చిన మరో బ్యూటిఫుల్ గర్ల్. తెలుగులో అడుగుపెట్టడం కాస్త లేటయినా.. ఒక్కసారిగానే క్రేజీయెస్ట్ హీరోయిన్ అయిపోయింది. ఓ సినిమాలో ఆమె నటనను చూసి వామ్మో అని భయపడిపోయారు ప్రేక్షకులు. హీరోయిన్ అంటే.. ఇలా కూడా చేస్తారా అని ఆశ్చర్యపోయేలా చేసింది ఆమె నటన. ఇంతకు ఆ బ్యూటీ ఎవరంటే.. సంయుక్త మీనన్. ఇప్పుడు మనం చెప్పుకున్న వివరణ అంతా విరూపాక్ష సినిమా గురించి. తొలుత అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించిన ఈ సోయగం.. సెకండాఫ్‌లో అదిరిపోయే ట్విస్టు ఇచ్చి భయపెట్టేసింది కదా.

2016లో మాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ సుందరాంగి.. తెలుగులో అడుగుపెట్టడానికి ఆరేళ్లు పాటు సమయం పట్టింది. ఈ మధ్యలో అలా మలయాళ, తమిళ ఇండస్ట్రీని చుట్టేసింది కూడా. తెలుగులో తొలి సినిమాతోనే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు అందించిన.. పవన్ కళ్యాణ్, రానా కాంబోలో వచ్చిన భీమ్లా నాయక్ చిత్రంలో నటించింది ఈ క్యూటీ. బింబిసారలో నందమూరి కళ్యాణ్ రామ్ సరసన ఆడిపాడి.. సెకండ్ హిట్ అందుకుంది. ఆ తర్వాత బైలింగ్వల్ మూవీ సార్ చిత్రంతో హ్యాటిక్ హిట్ సొంతం చేసుకుంది. ఇక విరూపాక్షలో ఆమె ఇరగదీసిన యాక్టింగ్‌కు ఫిదా అయిపోయారు ఆడియన్స్. అలాగే మరోసారి కళ్యాణ్ రామ్ తో జతకట్టింది. వీరిద్దరి కలయికలో డెవిల్ అనే మూవీ రాగా, ఓకే అనిపించింది. మొత్తానికి తెలుగు తెరపై సక్సెస్ సాధించింది. ప్రస్తుతం ఆమె చేతిలో నిఖిల్ హీరోగా నటిస్తున్న స్వయంభు చిత్రం ఉంది. ఇదే కాకుండా మరిన్ని కథలు వింటున్నట్లు తెలుస్తోంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet