iDreamPost
android-app
ios-app

‘తంగలాన్’ సీక్వెల్​పై విక్రమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్! ఏమన్నారంటే..?

  • Published Aug 16, 2024 | 9:22 PM Updated Updated Aug 16, 2024 | 9:22 PM

Vikram Gives Clarity On Thangalaan Movie Sequel: చియాన్ విక్రమ్ నటించిన ‘తంగలాన్’ మూవీ పంద్రాగస్టు కానుకగా విడుదలైంది. సక్సెస్​ఫుల్​గా రన్ అవుతున్న ఈ ఫిల్మ్​కు సీక్వెల్ ఉంటుందని వార్తలు వచ్చాయి. దీనిపై విక్రమ్ క్లారిటీ ఇచ్చారు.

Vikram Gives Clarity On Thangalaan Movie Sequel: చియాన్ విక్రమ్ నటించిన ‘తంగలాన్’ మూవీ పంద్రాగస్టు కానుకగా విడుదలైంది. సక్సెస్​ఫుల్​గా రన్ అవుతున్న ఈ ఫిల్మ్​కు సీక్వెల్ ఉంటుందని వార్తలు వచ్చాయి. దీనిపై విక్రమ్ క్లారిటీ ఇచ్చారు.

  • Published Aug 16, 2024 | 9:22 PMUpdated Aug 16, 2024 | 9:22 PM
‘తంగలాన్’ సీక్వెల్​పై విక్రమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్! ఏమన్నారంటే..?

డిఫరెంట్ ఫిల్మ్స్​తో ఆడియెన్స్​ను ఎంటర్​టైన్ చేసే చియాన్ విక్రమ్ అలాంటి మరో సినిమాతో వచ్చేశారు. ఆయన నటించిన కొత్త చిత్రం ‘తంగలాన్’ పంద్రాగస్టు కానుకగా గురువారం ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైంది. మునుపెన్నడూ చూడనటువంటి వైవిధ్యమైన గెటప్​లో విక్రమ్ కనిపించడం, విభిన్నమైన సినిమాలను తీసే పా రంజిత్ దర్వకత్వంలో తెరకెక్కడం, మూవీ నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్ లాంటి ప్రమోషనల్ కంటెంట్ బాగుండటంతో ‘తంగలాన్’ మీద మంచి అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లే మొదట పాజిటివ్ టాక్స్ బయటకు వచ్చాయి. కానీ ఆ తర్వాత మిక్స్​డ్ టాక్స్ ఎక్కువగా వినిపించాయి. అయినా సినిమా బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేస్తోంది. దీంతో ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందనే ప్రచారం మొదలైంది.

‘తంగలాన్’ కథలో సీక్వెల్​కు స్కోప్ ఉండటంతో పక్కా రెండో పార్ట్ ఉంటుందని పుకార్లు మొదలయ్యాయి. ఈ విషయం హీరో విక్రమ్ వరకు వెళ్లినట్లు ఉంది. తాజాగా హైదరాబాద్​లో నిర్వహించిన ‘తంగలాన్’ సక్సెస్​మీట్​లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పిన ఆయన.. సీక్వెల్ మీద కూడా క్లారిటీ ఇచ్చారు. ‘తంగలాన్’ పార్ట్ 2 ఉంటుందని ఆయన కన్ఫర్మ్ చేశారు. సినిమా మీద ఇంత ప్రేమను చూపిస్తున్నందుకు అందరికీ థ్యాంక్స్ చెప్పారు విక్రమ్. ఆడియెన్స్, ఫ్యాన్స్ నుంచి వచ్చిన ఆదరణ చూసి ‘తంగలాన్’కు సీక్వెల్ తీయాలని డిసైడ్ అయ్యామని.. త్వరలోనే అందుకు సంబంధించిన పనులు మొదలవుతాయని తెలిపారు.

‘తంగలాన్’ సీక్వెల్​పై మూవీ ప్రమోషన్స్ సమయంలోనే విక్రమ్ హింట్ ఇచ్చారు. ఈ ఫిల్మ్ స్టోరీ డిఫరెంట్​గా ఉంటుందన్నారు. ప్రీక్వెల్, సీక్వెల్ చేయడానికి ఛాన్స్ ఉందన్నారు. సెకండ్ పార్ట్ మాత్రం కచ్చితంగా ఉంటుందని విక్రమ్ తెలిపారు. చాలా కథాంశాలతో ముడిపడి ఉన్నందున దీన్ని నాలుగు పార్ట్​లుగా తీసి ఆడియెన్స్​కు అందించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. తాను ఈ మాట సరదాగా చెప్పడం లేదని.. ఈ స్టోరీకి అంత బలం ఉందన్నారు విక్రమ్. సీక్వెల్స్​కు సంబంధించి హీరో లుక్, కాస్ట్యూమ్స్ కూడా డిఫరెంట్​గా ఉంటాయన్నారు. అప్పుడు సీక్వెల్స్ గురించి హింట్ ఇచ్చిన విక్రమ్.. ఇప్పుడు రిలీజ్ తర్వాత కన్ఫర్మ్ చేశారు. మరి.. ‘తంగలాన్’కు సీక్వెల్ తీయాలనే ఆలోచనపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.