iDreamPost
android-app
ios-app

పెళ్లిపై విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు! అప్పుడే చేసుకుంటానంటూ..!

  • Author singhj Published - 03:07 PM, Thu - 31 August 23
  • Author singhj Published - 03:07 PM, Thu - 31 August 23
పెళ్లిపై విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు! అప్పుడే చేసుకుంటానంటూ..!

రౌడీస్టార్ విజయ్ దేవరకొండ సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన నటంచిన గత చిత్రం ‘లైగర్’ భారీ అంచనాల నడుమ రిలీజై డిజాస్టర్​గా నిలిచింది. దీంతో ఈసారి ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని ఆయన అనుకుంటున్నారు. ఈ క్రమంలో ‘ఖుషి’ మూవీతో ఆడియెన్స్​ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సరసన స్టార్ హీరోయిన్ సమంత నటించారు. సెప్టెంబర్ 1వ తేదీన విడుదల కానున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

‘ఖుషి’ నుంచి ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై ఎక్స్​పెక్టేషన్స్​ను మరింత పెంచేసింది. సినిమా మీద అంచనాలను మరింత పెంచేందుకు ప్రమోషన్స్​లో జోరు పెంచారు విజయ్ దేవరకొండ. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ పోతున్నారు రౌడీస్టార్. ఈ క్రమంలో ఆయన తన కెరీర్​తో పాటు పెళ్లి గురించి కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యాక్టింగ్​తో పాటు డైరెక్షన్ చేయడం అంటే తనకు చాలా ఇష్టమన్నారు విజయ్. నటనకు కొన్నాళ్లు విరామం ఇచ్చి ఏదైనా సినిమా తీయాలని ఉందన్నారు. తనకు ఆర్కిటెక్చర్ అంటే ఇష్టమన్నారు. హాలీవుడ్ మూవీ ‘గ్లాడియేటర్’ అంటే తనకు చాలా ఇష్టమన్నారు రౌడీస్టార్.

తెలుగులో సూపర్​స్టార్ మహేష్​బాబు ‘పోకిరి’ సినిమా తనపై చాలా ప్రభావం చూపిందన్నారు విజయ్ దేవరకొండ. ఈ చిత్రంలో మహేష్ ఇంట్రడక్షన్ సీన్ చూసి తాను నటుడ్ని అవ్వాలని ఫిక్స్ అయ్యానన్నారు. ప్రతి ఒక్కరికీ ఫెయిల్యూర్ వస్తుందని.. దాని నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందడుగు వేస్తే టార్గెట్​ను చేరుకోవచ్చన్నారు రౌడీస్టార్. పెళ్లి గురించి ఆయన మాట్లాడుతూ.. ‘నా జీవిత భాగస్వామి ఇంటెలిజెంట్ అయి ఉండాలి. నేను ఇష్టపడే వాటిని తనూ ఇష్టపడాలి. నాకు చేసుకోవాలని అనిపించినప్పుడు పెళ్లి చేసుకుంటా. అయితే చాలా సింపుల్​గా చేసుకోవాలని అనుకుంటున్నా. అందుకే చేసుకునే టైమ్​లో ఎవరికీ చెప్పను’ అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు.