iDreamPost
android-app
ios-app

వీడియో: పెళ్లి అయ్యాక తొలిసారి కెమెరా ముందుకు లావణ్య, వరుణ్ తేజ్!

సెలబ్రిటీలంతా తమ వివాహాలను డెస్టినేషన్ వెడ్డింగ్ పేరుతో జరుపుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ లవ్ బర్డ్స్ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిలు ఈ నెల 1వ తేదీన.. వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరిద్దరూ ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు.

సెలబ్రిటీలంతా తమ వివాహాలను డెస్టినేషన్ వెడ్డింగ్ పేరుతో జరుపుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ లవ్ బర్డ్స్ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిలు ఈ నెల 1వ తేదీన.. వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరిద్దరూ ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు.

వీడియో: పెళ్లి అయ్యాక తొలిసారి కెమెరా ముందుకు లావణ్య, వరుణ్ తేజ్!

డెస్టినేషన్ వెడ్డింగ్ పేరుతో విదేశాల్లో సెలబ్రిటీలు పెళ్లి చేసుకోవడం ఇప్పుడు నయా ట్రెండ్‌గా మారింది. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌కు కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే వెళ్లగలుగుతున్నారు. ఆ తర్వాత తమ ప్రాంతాల్లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల సినీ ప్రముఖులు చేసుకున్న పెళ్లిళ్లన్నీ ఈ తరహాలోనివే. తాజాగా టాలీవుడ్ ప్రేమ పక్షులు వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి నవంబర్ 1న పెళ్లి పీటలు ఎక్కారు. ఇటలీలోని టుస్కానీలో వీరి వివాహం జరిగింది. సియోనాలోని బోర్గోశాన్ ఫెలిసీ రిసార్ట్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులంతా ఈ వివాహ వేడుకల్లో పాల్గొని హంగామా చేసిన సంగతి విదితమే.

వీరి పెళ్లి ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వేడుకకు అల్లు అర్జున్ దంపతులు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. మెగా ఫ్యామిలీ అంతా ఒక చోట కనిపించే సరికి.. ఆ ఫోటోలను చూసి అభిమానులు తరించిపోయారు. ఈ వివాహానికి మెగా ఫ్యామిలీ కాకుండా నితిన్, నీరజ కోన, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అయితే ఇటలీలో పెళ్లి వేడుకలు ముగియగానే ఒక్కొక్కరు తిరిగి హైదరాబాద్ చేరుకుంటున్నారు. ఇప్పటికే నితిన్, పవన్ కళ్యాణ్, వైష్ణవ్ తేజ్, సాయి థరమ్ తేజ్ తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. కొత్త జంట కూడా వరుణ్-లావణ్య త్రిపాఠిలు కూడా భాగ్యనగరికి వచ్చేశారు. ఈ దంపతులు ఎయిర్ పోర్ట్‌లో కనిపించగానే.. మీడియా, ఇతరులు వీడియోలు తీసేందుకు పోటీ పడ్డారు.

పెళ్లైయ్యాక తొలిసారిగా కెమెరా కంటికి నవ దంపతులు చిక్కే సరికి.. క్లిక్ క్లిక్ మనిపించారు.  వారిద్దరిపై పూలు జల్లి ఆహ్వానం పలికారు అభిమానులు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. నవంబర్ 5న హైదరాబాద్‌లో వరుణ్, లావణ్య పెళ్లి రిసెప్షన్ జరగనుంది. దీని నిమిత్తం వీరిద్దరూ తిరిగి నగరానికి చేరుకున్నారు. కాగా, రిసెప్షన్ గట్టిగా ప్లాన్ చేసింది మెగా కుటుంబం. ఈ వేడుకకు టాలీవుడ్ కాకుండా బాలీవుడ్, రాజకీయ ప్రముఖులు కూడా హాజరుకానున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని తెలుస్తోంది.