iDreamPost
android-app
ios-app

Varun Tej’s Ghani గని సోలోగా వస్తున్నాడు కానీ

  • Published Apr 07, 2022 | 11:32 AM Updated Updated Apr 07, 2022 | 11:33 AM
Varun Tej’s Ghani  గని సోలోగా వస్తున్నాడు కానీ

ఆర్ఆర్ఆర్ తర్వాత విడుదల కాబోతున్న చెప్పుకోదగ్గ పెద్ద సినిమా గని ఒకటే. రేపు గ్రాండ్ రిలీజ్ కి సర్వం సిద్ధం చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లు అయిపోయాయి. ప్రమోషన్ పరంగా ఎంత చేయాలో అంతా చేశారు. అల్లు అర్జున్ అతిధిగా వేడుక జరిగిపోయింది. కానీ ఆశించిన స్థాయిలో బయట మాత్రం బజ్ కనిపించడం లేదు. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ చాలా కష్టపడ్డాడు. బాక్సర్ గా న్యాచురల్ అవుట్ ఫిట్ కోసం ఒళ్లు హూనం చేసుకున్నాడు. ఫిట్ నెస్ మిస్ కాకుండా ఉండేందుకు కఠిన నిబంధనలు పాటించాడు. కిరణ్ కొర్రపాటి కొత్త దర్శకుడు అయినప్పటికీ రిస్క్ చేసి మరీ నిర్మాత అల్లు బాబీ (బన్నీ అన్నయ్య)గనికి భారీ బడ్జెట్ ఖర్చు పెట్టారు.

ఇలాంటి టైంలో సోలో రిలీజ్ దక్కడం మంచిదే. ఓపెనింగ్స్ పరంగా చాలా హెల్ప్ అవుతుంది. కానీ గనికి అదెంత వరకు అడ్వాంటేజ్ అవుతుందో రేపు ఉదయం ప్రీమియర్ అయ్యాకే తెలుస్తుంది. ఎంత మెగా ప్రిన్స్ అయినా రోజు మొత్తం హౌస్ ఫుల్ చేసే కెపాసిటీ వరుణ్ కి ఇంకా రాలేదు. టాక్ బాగుందని వస్తే చాలు ఈవెనింగ్ నుంచి పికప్ ఉంటుంది. ట్రిపులార్ తాకిడి కొంత నెమ్మదించడం గనికి కలిసొచ్చే అంశం. అలా అని ధీమాగా ఉండటానికి లేదు. ఎందుకంటే మంచి కాన్ఫిడెన్స్ తో వచ్చిన మిషన్ ఇంపాజిబుల్, జాన్ అబ్రహం అటాక్ లు వీక్ కంటెంట్ వల్ల రివర్స్ లో ట్రిపులార్ కే ప్లస్ అయ్యాయి.అలా జరగకూడదంటే గని సూపర్బ్ అనిపించుకోవాలి.

పైగా అసలైన పెద్ద రిస్క్ వారం తిరక్కుండానే ముంచుకు రాబోతోంది. విజయ్ బీస్ట్ 13న, దీనికి జస్ట్ ఒక్క రోజు గ్యాప్ తో కెజిఎఫ్ 2 బాక్సాఫీస్ మీద దాడి చేయబోతున్నాయి. రెండింటి వెనకాల పెద్ద ప్రొడక్షన్ హౌసులు, డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు కాబట్టి థియేటర్లు పెద్ద సంఖ్యలో దొరుకుతాయి. ఆర్ఆర్ఆర్ కు అప్పటికింకా మూడో వారమే కాబట్టి స్క్రీన్ కౌంట్ భారీగా తగ్గే ఛాన్స్ లేదు. అలాంటప్పుడు ఈ మొత్తం సీన్ లో ఇబ్బంది పడేది గనినే. ఇన్ని నెలల కష్టం, ఇంత వెయిటింగ్ తర్వాత వస్తున్న గనికి సానుకూలాంశాల కంటే ప్రతికూలాంశాలే ఎక్కువగా ఉన్నాయి. మరి వీటితో ఫైట్ చేసి ఎలా నెగ్గుతాడో రేపీపాటికి తేలిపోనుంది