iDreamPost
android-app
ios-app

OTTలోకి లేటెస్ట్ క్రైమ్‌ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

  • Published Jul 23, 2024 | 12:20 PM Updated Updated Jul 23, 2024 | 12:20 PM

Nindha Movie OTT: ఓటీటీలో చాలా హరర్, క్రైమ్ థిల్లర్ మూవీస్ స్ట్రీమింగ్ అవుతుంటాయి. కొన్ని సినిమాలు చూస్తున్నంత సేపు ఎంతో ఉత్కంఠ కలుగుతుంది. ఆ జోనర్ లో వచ్చే కొత్త సినిమాల కోసం ఓటీటీ ఆడియన్స్ ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా ఓటీటీలోకి లేటెస్ట్ టాలీవుడ్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ రానుంది.

Nindha Movie OTT: ఓటీటీలో చాలా హరర్, క్రైమ్ థిల్లర్ మూవీస్ స్ట్రీమింగ్ అవుతుంటాయి. కొన్ని సినిమాలు చూస్తున్నంత సేపు ఎంతో ఉత్కంఠ కలుగుతుంది. ఆ జోనర్ లో వచ్చే కొత్త సినిమాల కోసం ఓటీటీ ఆడియన్స్ ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా ఓటీటీలోకి లేటెస్ట్ టాలీవుడ్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ రానుంది.

  • Published Jul 23, 2024 | 12:20 PMUpdated Jul 23, 2024 | 12:20 PM
OTTలోకి లేటెస్ట్ క్రైమ్‌ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఇటీవల కాలంలో ఓటీటీ హవా బాగా నడుస్తోంది. ఈ ఫ్లాట్ ఫామ్స్ లో వారం వారం అనేక సినిమాలు స్ట్రీమింగ్ అవుతుంటాయి. థియేటర్లలో సందడి చేసిన సినిమాలు సైతం ఓటీటీలో దుమ్ములేపుతుంటాయి. ఇక ఓటీటీలో మూవీస్ చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు. కామెడీ, థ్రిల్లర్, హరర్, లవ్ వంటి  అన్ని రకాల జోనర్ సినిమాలో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంటాయి. కొన్ని సినిమాలు ఎంతో ఉత్కంఠగా, ఆసక్తిగా ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ లేటెస్ట్  టాలీవుడ్ క్రైమ్ థిలర్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. మరి..  సినిమా ఏమిటి, ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కొత్తబంగారులోకం వంటి అనేక సినిమాలతో టాలీవుడ్ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. ఈ మధ్యకాలంలో కాస్త తక్కువగా వెండితెరపై కనిపిస్తున్నాడు. ఇక వరుణ్ సందేశ్ నటించిన లేటెస్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ నింద.  జూన్ లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్సడ్ టాక్ సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ అప్ డేట్  బయటకు వచ్చింది. ఈ సినిమా త్వరలో ఓటీటీలోకి వచ్చేస్తోంది.

దాదాపు నెలన్న‌ర తరువాత ‘నింద’ మూవీ ఓటీటీలోకి రాబోతున్న‌ట్లు తెలుస్తోంది. నింద మూవీ డిజిట‌ల్‌స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను ఈటీవీ విన్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సొంతం చేసుకున్న‌ట్లు టాక్ . ఆగ‌స్ట్ మొదటి వారంలో ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు సమాచారం. ఇక ఈ మూవీ గురించి చూసినట్లు అయితే.. నింద చిత్రం ద్వారా రాజేష్ జ‌గ‌న్నాథ‌మ్ ద‌ర్శ‌కుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. నింద సినిమాను డైరక్షన్ తో పాటు స్వ‌యంగా ప్రొడ్యూస్ చేశాడు.  ఈ సినిమాలో రాజ‌న్న మూవీ ఫేమ్ అనీ, క్యూ మ‌ధు ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించారు.

ఇక నింద మూవీ స్టోరీ విషయానికి వస్తే.. నింద మూవీలో గ‌త సినిమాల‌కు భిన్నంగా వరుణ్ సందేశ్ నటించాడు. ఈ సినిమాలో  హ్యూమ‌న్ రైట్స్ క‌మీష‌న్‌లో ప‌నిచేసే యువ‌కుడిగా వ‌రుణ్ ప్రత్యేకమైన పాత్రలో క‌నిపించాడు. మంజు (క్యూ మ‌ధు) అనే అమ్మాయిని రేప్ చేసి చంపేశాడ‌ని కాండ్ర‌కోట‌కు చెందిన బాల‌రాజును (ఛ‌త్ర‌ప‌తి శేఖ‌ర్‌) పోలీసులు అరెస్ట్ చేస్తారు. పోలీసుల విచారణలో బాల‌రాజు ఈ హ‌త్య చేశాడ‌ని ఫ్రూప్ లు దొరుకుతాయి. న్యాయమూర్తి స‌త్యానంద్ (త‌నికెళ్ల‌భ‌ర‌ణి) అత‌డికి ఉరిశిక్ష విధిస్తాడు.

ఉరి శిక్ష వేస్తూ తీర్పు ఇచ్చినప్పటికీ బాల‌రాజు నేరం చేయ‌లేద‌ని స‌త్యానంద్‌ న‌మ్ముతాడు. అందుకే అత‌డిని ఎలాగైనా నిర్ధోషిగా నిరూపించ‌మ‌ని తన కొడుకు(వరణ్ సందేశ్)ను కోరుతాడు. తండ్రి మాట మేరకు బాలరాజు కేసును రీ ఇన్వేస్టిగేషన్ చేయడం ప్రారంభిస్తాడు హీరో. అత‌డి ఎంక్వైరీలో ఏం తేలింది? నిజంగా బాల‌రాజే హంతకుండా? లేదా? అలానే హంత‌కుల‌ను ప‌ట్టుకోవ‌డానికి వివేక్ ఎలాంటి రిస్క్ తీసుకున్నాడు? అన్న‌దే నింద మూవీ స్టోరీ. మరి..థియేటర్లలో అలరించిన ఈ సినిమా ఓటీటీలో ఏ మాత్రం ఆకట్టుకుంటుదో  తెలియాలంటే.. మరికొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom