iDreamPost
android-app
ios-app

ఇండస్ట్రీలో పెద్ద మనిషి రూమ్ బుక్ చేస్తా.. వస్తావా అని అడిగాడు: వరలక్ష్మి శరత్ కుమార్

  • Published Apr 29, 2024 | 9:55 PM Updated Updated Apr 29, 2024 | 9:55 PM

ఇండస్ట్రీ అన్నాక పెద్ద మనుషుల ముసుగులో హీరోయిన్స్ ని కమిట్మెంట్ అడగడం.. లైంగికంగా వేధించడం.. తమ మాట వినకపోతే అవకాశాలు ఇవ్వకపోవడం వంటివి జరగడం కామన్. అయితే మామూలు చిన్న ఆర్టిస్టులకే కాకుండా బ్యాక్ గ్రౌండ్ ఉన్న తనకి కూడా కమిట్మెంట్ కష్టాలు ఎదురయ్యాయని వరలక్ష్మి శరత్ కుమార్ తెలిపారు. ఇండస్ట్రీలో ఒక పెద్ద మనిషి రూమ్ బుక్ చేస్తా అంటూ పిలిచాడని అన్నారు.

ఇండస్ట్రీ అన్నాక పెద్ద మనుషుల ముసుగులో హీరోయిన్స్ ని కమిట్మెంట్ అడగడం.. లైంగికంగా వేధించడం.. తమ మాట వినకపోతే అవకాశాలు ఇవ్వకపోవడం వంటివి జరగడం కామన్. అయితే మామూలు చిన్న ఆర్టిస్టులకే కాకుండా బ్యాక్ గ్రౌండ్ ఉన్న తనకి కూడా కమిట్మెంట్ కష్టాలు ఎదురయ్యాయని వరలక్ష్మి శరత్ కుమార్ తెలిపారు. ఇండస్ట్రీలో ఒక పెద్ద మనిషి రూమ్ బుక్ చేస్తా అంటూ పిలిచాడని అన్నారు.

  • Published Apr 29, 2024 | 9:55 PMUpdated Apr 29, 2024 | 9:55 PM
ఇండస్ట్రీలో పెద్ద మనిషి రూమ్ బుక్ చేస్తా.. వస్తావా అని అడిగాడు: వరలక్ష్మి శరత్ కుమార్

వరలక్ష్మి శరత్ కుమార్.. స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారు. ఈమెతో మాట్లాడాలంటే కొత్తవాళ్లు భయపడతారు. అంత డేరింగ్ అండ్ డ్యాషింగ్ గా ఉంటారు. అలానే స్ట్రాంగ్ విమెన్ అన్న పేరు కూడా తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు ఇంత స్ట్రాంగ్ గా ఉన్న వరలక్ష్మి శరత్ కుమార్ ని ఇండస్ట్రీకొచ్చిన కొత్తలో కమిట్మెంట్ అడిగారట. స్టార్ హీరో కూతురు.. అయినప్పటికీ తనకి అవమానాలు తప్పలేదట. శబరి మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆమె ఈ విషయాలను పంచుకున్నారు. మే 3న వరలక్ష్మి నటించిన ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఆమె మూవీ ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆమె జీవితంలో ఎదురైన సంఘటనలను మీడియాతో పంచుకుంటున్నారు.

ఒక అమ్మాయి ఇండస్ట్రీలో రాణించడం అంటే అంత సులభం కాదని.. తన తండ్రికి తాను ఇండస్ట్రీకి రావడం ఇష్టం లేదని.. అయినా కానీ ఇష్టం లేకున్నా సినిమాల్లోకి వచ్చానని అన్నారు. అయితే తాను నటిగా అప్పుడప్పుడే గుర్తింపు వస్తున్న రోజుల్లో ఒక టీవీ ఛానల్ అధినేత తన ఇంటికి వచ్చాడని.. ఒక ప్రాజెక్ట్ లో నటించాలని అడిగాడని ఆమె అన్నారు. అందుకు తాను ఒప్పుకున్నానని.. అయితే కొంచెం సేపయ్యాక మనం మళ్ళీ బయట కలుద్దామా అని అతను అడిగాడని వెల్లడించారు. ఎందుకు సార్ అని అడిగితే.. రూమ్ బుక్ చేస్తాను.. మాట్లాడుకుందాం అని అన్నాడని వరలక్ష్మి శరత్ కుమార్ అన్నారు. ఆ తర్వాత అతనిపై కేసు పెట్టానని అన్నారు. స్టార్ హీరో కూతురు అయినంత మాత్రాన తనకు అవకాశాలు రాలేదని.. తాను కూడా అందరిలానే ఇబ్బందులు పడ్డానని అన్నారు.

చాలా మంది తనను కమిట్మెంట్ అడిగారని.. దీని వల్ల చాలా సినిమాలు వదులుకోవాల్సి వచ్చిందని అన్నారు. స్టార్ హీరో కూతుర్నైనా తనకే ఇలా జరిగితే.. ఇక సాధారణ అమ్మాయిల పరిస్థితి ఏంటని అనిపించిందని.. అందుకే అతని మీద అప్పుడే కేసు పెట్టానని అన్నారు. ఈ ఘటన ఆరేళ్ళ క్రితం జరిగిందని.. ఇలాంటి వాళ్ళ ఆటకట్టించడానికే తాను ‘సేవ్ శక్తి ఫౌండేషన్’ ని స్థాపించానని అన్నారు. శక్తిగా పిలవబడే మహిళలను కాపాడడమే ఈ ఫౌండేషన్ లక్ష్యం అని అన్నారు.

ఈ ఫౌండేషన్ ద్వారా చాలా మంది ఆడపిల్లలను రక్షించామని అన్నారు. అమ్మాయిలకి ఎలాంటి ఆపద వచ్చినా సరే తమ ఫౌండేషన్ కి వచ్చి సాయం అడిగితే ఖచ్చితంగా చేస్తామని ఆమె అన్నారు. సేవ్‌ శక్తి ఫౌండేషన్‌ ద్వారా చాలామంది ఆడబిడ్డలను రక్షించామని ఆమె చెప్పింది. ఎలాంటి ఆపద అయినా సరే తమ ఫౌండేషన్‌లోకి వచ్చి సాయం అడిగితే తప్పకుండా జరుగుతుందని ఆమె పేర్కొంది. మరి స్టార్ హీరో కూతురు అయినప్పటికీ ఇబ్బందులు తప్పలేదని నటి వరలక్ష్మి శరత్ కుమార్ చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom