iDreamPost
android-app
ios-app

పెళ్లి పీటలు ఎక్కబోతున్న ’వాన’ మూవీ హీరోయిన్.. డేట్ ఫిక్స్

  • Published Dec 28, 2023 | 7:11 PM Updated Updated Dec 28, 2023 | 7:11 PM

వరుసగా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇప్పుడు మరో బ్యూటీ కూడా పెళ్లి పీటలు ఎక్కుతున్నట్లు తెలుస్తోంది. ప్రియుడితో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ రూమర్లు వచ్చాయి. దీనిపై క్లారిటీ ఇచ్చింది ఆ భామ

వరుసగా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇప్పుడు మరో బ్యూటీ కూడా పెళ్లి పీటలు ఎక్కుతున్నట్లు తెలుస్తోంది. ప్రియుడితో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ రూమర్లు వచ్చాయి. దీనిపై క్లారిటీ ఇచ్చింది ఆ భామ

  • Published Dec 28, 2023 | 7:11 PMUpdated Dec 28, 2023 | 7:11 PM
పెళ్లి పీటలు ఎక్కబోతున్న ’వాన’ మూవీ హీరోయిన్.. డేట్ ఫిక్స్

చేసినవీ నాలుగు సినిమాలే అయినా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంది నటి మీరా చోప్రా. టాప్ హీరోలతో ఆడిపాడిన ఈ అమ్మడు.. సడన్ గా బాలీవుడ్‌కు వెళ్లిపోయింది. తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన బంగారం, వాన, నితిన్‌కు జంటగా మారో, నాగార్జునతో గ్రీకు వీరుడు సినిమాల్లో కనిపించింది. ఈ నాలుగు సినిమాలు ఆమెను టాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్ హీరోయిన్‌ను చేయలేకపోయాయి. ఇదిలా ఉంటే.. మీరా చోప్రా.. వరల్డ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, బాలీవుడ్ నటి పరిణీతి చోప్రాలకు కజిన్ అవుతుంది. ఇప్పుడు బాలీవుడ్ లో సఫేద్ అనే మూవీలో నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషన్లలో భాగంగా పలు ఇంటర్వ్యూస్‌లో పాల్గొంటుంది.

ఈ సందర్భంగా తన పెళ్లిపై వస్తున్న రూమర్ల గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. ‘అవును నిజమే.. నేను పెళ్లి చేసుకోబోతున్నాను. 2024 ఫిబ్రవరి నెలాఖరున నా పెళ్లి జరగబోతుంది. ఇప్పటికే మా కుటుంబ సభ్యులు పెళ్లి పనుల్లో తలమునకలు అయిపోయారు. నా పెళ్లి రాజస్తాన్‌లో జరగనుంది. మా పెళ్లికి 150 మంది అతిధులు రాబోతున్నారు’ అని తెలిపింది. పెళ్లి తర్వాత స్నేహితులు, బాలీవుడ్ సెలబ్రిటీల కోసం ముంబయిలో రిసెప్షన్‌ను నిర్వహించినట్లు పేర్కొంది. అయితే తనకు కాబోయే భర్త వివరాలను మాత్రం వెల్లడించలేదు ఈ వాన భామ.  ఈ క్రిస్ మస్ సందర్భంగా ఇన్ స్టాలో ఓ వ్యక్తితో కలిసి ది గిన ఫోటోను స్టోరీలో పెట్టుకుంది.

దానికి ప్యార్ వాలా క్రిస్మస్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. దీంతో ఆమె ప్రేమలో ఉందంటూ వార్తలు వచ్చాయి. దీంతో ఆమె క్లారిటీ ఇచ్చింది. ఇక ఆమె నటిస్తున్న సఫేద్ చిత్రం జీ 5లో డిసెంబర్ 29 నుండి స్ట్రీమింగ్ కాబోతుంది. ఇందులో ఆమె భిన్నమైన క్యారెక్టర్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందులో మీరా చోప్రా విడోగా కనిపించబోతుంది. ట్రైలర్ ఈ మూవీని వాచ్ చేయాలన్న ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ మూవీని సందీప్ సింగ్ తెరకెక్కించారు. ఇటీవల ఈమె కజిన్ పరిణితీ చోప్రా కూడా వివాహం చేసుకున్న సంగతి విదితమే. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాను మనువాడింది. ఇప్పుడు మీరా కూడా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ఆమె సినిమాల్లో మీకు ఏ చిత్రం అంటే ఇష్టమో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom