iDreamPost
android-app
ios-app

హనుమాన్ హీరోను సత్కరించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!

  • Published Jan 18, 2024 | 6:13 PM Updated Updated Jan 18, 2024 | 6:13 PM

HanuMan Movie: సంక్రాంతి కానుకగా వచ్చిన హనుమాన్ మూవీ దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు సినిమాపై ప్రశంసలు కురిపించారు. తాజగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హీరో తేజ సజ్జాను సత్కరించారు.

HanuMan Movie: సంక్రాంతి కానుకగా వచ్చిన హనుమాన్ మూవీ దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు సినిమాపై ప్రశంసలు కురిపించారు. తాజగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హీరో తేజ సజ్జాను సత్కరించారు.

  • Published Jan 18, 2024 | 6:13 PMUpdated Jan 18, 2024 | 6:13 PM
హనుమాన్ హీరోను సత్కరించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!

హనుమాన్.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసిన వినిపిస్తోన్న పేరు ఇది. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, యంగ్ హీరో తేజ సజ్జా కాంబినేషన్ లో  హనుమాన్ సినిమా తెరకెక్కింది. పాన్ ఇండియా మూవీగా జనవరి 22న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దండయాత్ర చేస్తోంది. ఇప్పటికే 100 కోట్ల క్లబ్ లో చేరి.. మరింత లాభాల బాట ముందుకెళ్తోంది. ఇక హనుమాన్ సినిమాపై సినీ, రాజకీయ ప్రముఖులు అభినందలు చెబుతున్నారు. తాజాగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి.. హనుమాన్ హీరో తేజ సజ్జాను సత్కరించారు. అంతేకాక హనుమాన్ సినిమా సక్సెస్ పై ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. తెలుగు, హిందీ భాషలతో పాటు ఇతర భాషల్లో కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ వస్తోంది.  డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాను తీసిన విధానానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. బీజీఎం, విజువల్స్, సాంగ్స్ ఇలా అన్ని విషయాల్లో ప్రశాంత్ వర్మ తన మార్క్ ను చూపించారు. ఇక హీరో తేజ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. హనుమాన్ మూవీతో తేజ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.

నార్త్ అమెరికాలో అయితే ఈ సినిమా పలు విషయాల్లో బాహుబలి-2, సలార్ వంటి పెద్ద సినిమాలను సైతం దాటేసి నెంబర్ వన్ స్థానంలో ఉంది. అంచనాలకు మించి హనుమాన్ సినిమా సక్సెస్ పుల్ గా థియేటర్లలో రన్ అవుతోంది. ఇక ఈ సినిమాపై  సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. మెగాస్టార్ చిరంజీవి..హనుమాన్ చిత్ర బృందాన్ని అభినందించారు. తాజాగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి హనుమాన్ సక్సెస్ పై ట్వీట్ చేశారు. అంతేకాక ఢిల్లీలో హనుమాన్ సినిమా హీరో తేజాను ఆయన శాలువా కప్పి సత్కరించారు.

అదే విధంగా ఈ సినిమా సక్సెస్ పై ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని హీరో తేజ సజ్జా కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఓ ట్వీట్ కూడా చేశారు. దేశ వ్యాప్తంగా సన్సెషన్ సృష్టించిన హనుమాన్ చిత్రం మంచి హిట్ కావడం తనకు చాలా సంతోషంగా ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. అయోధ్యలోని శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా .. భవ్య రామ మందిరానికి హనుమాన్ సినిమాకు సంబంధించిన ప్రతి టిక్కెట్టు నుండి రూ.5 విరాళంగా ఇవ్వడం అభినందించ తగ్గ  విషయమని ఆయన తెలిపారు.

ఇక కిషన్ రెడ్డి ఇచ్చిన ఆతిథ్యం, చేసిన ట్వీట్ పై హనుమాన్ సినిమా హీరో తేజ కూడా రిప్లయ్ ఇచ్చారు. మీరు అభినందించడం చాలా సంతోషంగా ఉందని, మీ అభినందనలు, మీ ఆశీస్సులు అందించినందుకు కృతజ్ఞతలు సార్ అంటూ కిషన్ రెడ్డికి ట్వీట్ కి రిప్లయ్ ఇచ్చారు. తేజ సజ్జ హీరోగా నటించిన హనుమాన్ సినిమాలో  అమృతా అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ కీలకపాత్రలు పోషించారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. నార్త్ లోనూ భారీ వసూళ్లు రాబడుతోంది హనుమాన్ మూవీ. మరి.. వీరిద్దరి ట్వీట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss