iDreamPost
android-app
ios-app

Jani Master: జానీ మాస్టర్ కేసులో బిగ్ ట్విస్ట్.. మరో ఇద్దరు ఎంట్రీ?

  • Published Sep 21, 2024 | 1:13 PM Updated Updated Sep 21, 2024 | 1:13 PM

New Update In Joni Master Case: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. తాజాగా ఈ కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. జానీ మాస్టర్ కేసులో మరో ఇద్దరు పేర్లు ఎంట్రీ ఇచ్చాయి.

New Update In Joni Master Case: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. తాజాగా ఈ కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. జానీ మాస్టర్ కేసులో మరో ఇద్దరు పేర్లు ఎంట్రీ ఇచ్చాయి.

  • Published Sep 21, 2024 | 1:13 PMUpdated Sep 21, 2024 | 1:13 PM
Jani Master: జానీ మాస్టర్ కేసులో బిగ్ ట్విస్ట్.. మరో ఇద్దరు ఎంట్రీ?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ గా నడుస్తోంది. తనపై జానీ మాస్టర్ అత్యాచారం చేశాడంటూ ఓ లేడీ కొరియోగ్రాఫర్  ఆరోపణలు చేసిన సంగతి తెలిసింది. అంతేకాక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జానీ మాస్టర్ పై కేసు కూడా నమోదైన విషయం విధితమే. ఈ కేసులో జానీ మాస్టర్ అరెస్టు కావడం, చంచల గూడా జైలుకు తరలించడం జరిగింది. ఇది ఇలా ఉంటే.. ఈ కేసు విషయంలో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ కేసులో జానీ మాస్టర్, ఆయన భార్య ఆయేషాపై మాత్రమే కేసులు నమోదు అయ్యాయి. అయితే తాజాగా జానీ మాస్టర్ కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. జానీ కేసులో మరో ఇద్దరు పేర్లు వెలుగులోకి వచ్చాయి. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

జానీ మాస్టర్ భార్య ఆయేషాపై బాధితురాలు మరో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసింది. తనపై జానీ మాస్టర్, ఆయన భార్య దాడి చేసినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో జానీ భార్యపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమెపై ఓ కేసు నమోదైన సంగతి తెలిసింది. తనపై జానీ మాస్టర్ భార్య కూడా పలు రకాల వేధింపులకు గురి చేసినట్లు గతంలో ఆ యువతి తెలిపింది. మతం మార్చుకుని, తన భర్తను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది. తాజాగా దాడి చేసినట్లు మరో ఫిర్యాదు చేయడంతో ఆయేషాపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఈ కేసులో మరో ఇద్దరిని నిందితులుగా చేర్చే అవకాశం ఉన్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తోన్నాయి.

ముంబైలో తనపై అత్యాచారం జరిగినప్పుడు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్లు అయిన మోయిన్, రాహుల్ తనతో ట్రావెల్స్ చేసినట్లు సదరు యువతి ఫిర్యాదులో పేర్కొంది. తనపై అత్యాచారం జరిగినప్పుడు వారు కూడా ఉన్నారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో వారిద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొనున్నారు. అయితే వారిద్దని నిందితులుగా కాకుండా సాక్ష్యులుగా తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. వారిద్దరిని అదుపులోకి తీసుకుని, ముంబైకి వెళ్లిన సమయంలో జానీ మాస్టర్, ఆ యువతి మధ్య జరిగిన సంఘనలు, వారిద్దరి ప్రవర్తనలు ఎలా ఉండేది..వంటి సమాచారాన్ని పోలీసులు సేకరించనున్నరు.

ఇకపోతే..తనపై దాడి చేసినట్లు  బాధితురాలు చేసిన ఫిర్యాదులై జానీ మాస్టర్ భార్య స్పందించారు. బాధితురాలని కొట్టినట్లుగా ఆయేషా ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో ఒప్పుకున్నారు. అయితే  ఆ యువతిని ఎందుకు  కొట్టాల్సి వచ్చిందో కూడా ఆయేషా వివరణ ఇచ్చారు. ఆ యువతి జానీ మాస్టర్ ను తనకు, తన పిల్లలకు దూరం చేసిందని ఆయేషా చెప్పుకొచ్చింది. ఆ యువతి తన దగ్గర ఒకటమాట, తన భర్త దగ్గర మరొక మాటలు చెప్పేదని తెలిపింది. తనను వదినా.. వదినా.. అని పిలిచేదని, అలాంటప్పుడు ఆ యువతిపై ఎలా అనుమానం వస్తుందని ఆయేషా చెప్పుకొచ్చింది. మరోవైపు జానీ మాస్టర్ దగ్గరకు వెళ్లి నీవు లేకపోతే చనిపోతాను, నాకు నీవే దిక్కు అన్నట్లు ఆ యువతి మాట్లాడేది. అలా  ఆ అమ్మాయి మాట్లాడే రెండు విధాలైన మాటలను తాను ఎలా జీర్ణించుకోవాలని ఆయేషా అన్నారు. ఇలా డబుల్ గేమ్ ఆడినప్పుడే ఆ యువతి ఇంటి వెళ్లాలన్నారు.

అది కూడా ఆ యువతి ప్రవర్తన పీక్ స్టేజ్ లో ఉండటంతో వాళ్ల ఇంటికి వెళ్లాలని ఆయేషా తెలిపింది. ఆ సమయంలో కూడా జానీ మాస్టర్ కి ఆ యువతి దగ్గరగా ఉండటంతో దూరం జరగమని చెప్పానని తెలిపింది. అయితే  ఆ యువతి పక్కకు జరగకపోవడంతోనే..ఆమెను కొట్టడం జరిగిందంటూ ఆయేషా వివరణ ఇచ్చింది. అలా తన భర్తను వేరే వాళ్లు చూస్తేనే ఒప్పుకోని తనపై…అనేక అసత్య వార్తలు మీడియాలో రాస్తున్నారని ఆయేషా చెప్పుకొచ్చింది. మొత్తంగా జానీ మాస్టర్ కేసులో మరో ఇద్దరు పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. మరి..ఈ కేసు మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. మరి..జానీ మాస్టర్ కేసు విషయంలో వెలుగులోకి వచ్చిన ఈ  సమాచారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişbetparkGrandpashabetgrandpashabetGrandpashabetMeritkingCasibomCasibomcasibomjojobet günceldeneme bonusu veren sitelerjojobetMadridbetMadridbetJojobetnakitbahisJojobetjojobetjojobetgrandpashabetcasibomcasibomcasibomcasibomcasibom girişholiganbetjojobetbetciojojobetcasibomJojobet