iDreamPost
iDreamPost
ఈ శుక్రవారం విడుదల కాబోతున్న ఎఫ్3 ప్రమోషన్లు మంచి స్వింగ్ లో ఉన్నాయి. ఇంటర్వ్యూలు ఇచ్చిన ప్రతి చోట నిర్మాత దిల్ రాజు ఈ సినిమాకు పాత రేట్లే ఉంటయాని నొక్కి చెప్పడం, సునయన లాంటి నోటెడ్ ఆర్టిస్టుతో వీడియో ప్రోమోలు చేయించడం సోషల్ మీడియాలో బాగానే వెళ్లాయి, ఇంకేముంది ప్రేక్షకులు ఒకప్పటి రేట్లతో ఫ్యామిలీతో సహా ఎంజాయ్ చేయొచ్చని సంబరపడ్డారు. ట్రేడ్ తో పాటు అభిమానులు కూడా ఓపెనింగ్స్ తో పాటు లాంగ్ రన్ బలంగా ఉండబోతోందని భారీ అంచనాలు పెట్టేసుకున్నారు. కానీ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాక పరిస్థితి దానికి రివర్స్ లో ఉంది. మళ్ళీ మళ్ళీ అదే కథ తరహాలో ట్రెండ్ రిపీట్ అవుతోంది.
నైజామ్ లో ఇప్పటిదాకా ఓపెన్ చేసిన మల్టీ ప్లెక్సుల బుకింగ్స్ లో దాదాపు అన్ని 295 రూపాయల టికెట్ రేట్ తో ఉన్నాయి. ఏఎంబి లాంటి స్పెషల్ ప్లెక్సులో తప్ప మిగిలిన చోట జిఎస్టితో కలిపి 250 రూపాయలు ఉంటుందన్న రాజు గారి మాట చెల్లుబాటు కాలేదు. ఏషియన్, బివికె, జిపిఆర్, టిఓలి, పివిఆర్, ఐనాక్స్ తదితర సముదాయాల్లో జిఓలో పేర్కొన్న గరిష్ట ధర 295 ఉంది. దీనికి సదరు యాప్స్ వడ్డించే బుకింగ్ ఛార్జీలు అదనంగా ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో దూరాభారాలు చేసి అడ్వాన్ బుకింగ్ చేసుకోకుండా మొదటి వారం సినిమా చూసే రిస్క్ తీసుకోవడం లేదు. ముఖ్యంగా ఫ్యామిలీ మొత్తం వెళుతున్నప్పుడు ప్లానింగ్ అవసరం
ఇక సింగల్ స్క్రీన్లన్నీ 175 రూపాయలు ఫిక్స్ చేసి ఆమేరకు సీట్లను అందుబాటులో ఉంచేశాయి. నిజానికి జనం ఆశించింది 130 నుంచి 150 మధ్యలో. ఈ కారణంగానే బుకింగ్స్ ఆశించినంత వేగంగా జరగడం లేదు. ప్రసాద్ లో మొదటి షోకు సైతం టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఇంకా మూడు రోజులే ఉన్నప్పటికీ ఇందులో ఉన్న క్యాస్టింగ్ కి కనీసం ఫస్ట్ షో అయినా ఫుల్ అవ్వాలి. కానీ ఏపిలో చాలా నయం. పెంపుకు వెళ్ళరు కాబట్టి సిటీ మల్టీప్లెక్సులోనే 180 లోపు సినిమా చూడొచ్చు. జిల్లా కేంద్రాల్లో ఇది 150 రూపాయల లోపే ఉంది. సింగల్ స్క్రీన్లన్నీ 100కే ఇస్తున్నాయి. మొత్తానికి దిల్ రాజు చెప్పిన టికెట్ రేట్ల కహానిలో ఇలా ట్విస్ట్ వచ్చిందన్న మాట