iDreamPost
android-app
ios-app

Salaar 2: రెబల్ స్టార్ అభిమానులకు కిక్కిచ్చే న్యూస్.. సలార్ 2 లో ఆ సీక్వెన్స్!

  • Published Oct 07, 2024 | 3:15 PM Updated Updated Oct 07, 2024 | 3:15 PM

Salaar 2: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రశాంత్ నీల్ తో చేసిన సలార్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఇక వీరి కాంబినేషన్లో సలార్ 2 రాబోతుంది.

Salaar 2: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రశాంత్ నీల్ తో చేసిన సలార్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఇక వీరి కాంబినేషన్లో సలార్ 2 రాబోతుంది.

  • Published Oct 07, 2024 | 3:15 PMUpdated Oct 07, 2024 | 3:15 PM
Salaar 2: రెబల్ స్టార్ అభిమానులకు కిక్కిచ్చే న్యూస్.. సలార్ 2 లో ఆ సీక్వెన్స్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. వరుస హిట్లతో దేశవ్యాప్తంగా సూపర్ స్టార్ డంని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ప్రభాస్ కెరీర్లో ఊర మాస్ సినిమాలు చాలానే ఉన్నాయి. అందులో ‘సలార్’ సినిమా అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టిందనే చెప్పాలి. అబ్బా ఇదిరా రెబలోడి బొమ్మ అంటే ప్రభాస్ కట్ అవుట్ కి తగ్గ సినిమారా ఇది అని ఫ్యాన్స్ ఉప్పొంగిపోయారు. అప్పటిదాకా ఈ రేంజ్ లో ఊర మాస్ పర్ఫార్మన్స్ ప్రభాస్ చేయలేదు. గతంలో ప్రభాస్ మాస్ పర్ఫార్మన్స్ చేసినా కానీ సలార్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఇందులో రెబలోడి అభిమానులకు కావాల్సిన ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పటికీ ఎప్పటికీ కాలర్ ఎగరేసుకొని చెప్పుకునే సినిమా ఇది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. పెద్దగా ప్రమోషన్స్ చేయకపోయినా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల ఊచకోత కోసింది. అంతలా మన రెబలోడు ర్యాంప్ ఆడించాడు. గత ఏడాది చివర్లో విడుదలయిన ఈ సినిమా 715 కోట్ల దాకా వసూళ్లని కొల్లగొట్టింది. మన రెబలోడి నుంచి ఇంత ఊర మాస్ చూశాక సలార్‌ 2 పై కొండంత అంచనాలు పెరిగాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్ చేయలేదని ఫ్యాన్స్ డిప్రెస్ అవుతున్నారు. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో అభిమానులకు ఓ రిలీఫ్ దక్కింది. తాజాగా సోషల్ మీడియా నుంచి ఒక లీక్‌ వచ్చింది.. ఈ లీక్ తో సలార్ 2 అంచనాలు కాస్తా డబుల్ నుంచి త్రిబుల్ అయ్యాయి. ఇంతకీ ఆ లీక్ ఏంటి? దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈమధ్య కాలంలో చాలా పాన్ ఇండియా సినిమాల్లో చూసినట్లయితే వాటిల్లో కొన్ని యాక్షన్ బ్లాక్స్ కనిపిస్తాయి. అవి ఆ సినిమాలకే హైలెట్ గా నిలిచాయి. సలార్లో కాటేరమ్మా యాక్షన్ సీక్వెన్స్ చూశాం. అది సినిమాకే హైలెట్. అలాగే సలార్‌ 2 లో కూడా మెంటల్ మాస్ అనిపించే ఓ టన్నెల్‌ ఫైట్ సీక్వెన్స్ ఉంటుందట. ఈ సీక్వెన్స్ కి పూనకాలు రావడం పక్కా అట. సినిమా హాళ్లు తగలడిపోతాయట. తాజాగా దానికి సంబంధించి కొన్ని క్లిప్స్‌, ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.ఈ లీక్‌ నిజంగా ప్రభాస్ అభిమానులకు సర్‌ప్రైజ్‌ అని చెప్పాలి. ఈ సీక్వెన్స్ గూస్ బంప్స్ కా బాప్ అనే రేంజిలో ఉంటుందట. ఇండియన్ సినిమా హిస్టోరీలోనే ఇలాంటి ఫైట్ సీక్వెన్స్ రాలేదట. మరి మన రెబలోడీ కట్ అవుట్ కి అలాంటి సీన్ పడకుంటే ఎలా? అభిమానులు ఊరుకుంటారా? అందుకే అలాంటి యాక్షన్ బ్లాక్ ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్లాన్ చేశాడట. ఈ సీక్వెన్స్ మొత్తం 15 నిమిషాలు ఉంటుందట. తెరపై ఒక కొత్త విద్వంసం మనం చూడొచ్చట.

సలార్ 2 ని సలార్ ని మించి మెంటల్ మాస్ గా చెక్కాలని ప్రశాంత్ నీల్ డిసైడ్ అయ్యడట. మరి ఈ ఫైట్ సినిమాలో పెడుతున్నట్టు మూవీ టీం నుంచి ఇంకా ఎలాంటి అఫిషియల్ న్యూస్ అయితే రాలేదు కాదు. కానీ దీన్ని ప్లాన్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కానీ ఇప్పటి వరకు సలార్‌ 2 షూటింగ్‌ స్టార్ట్ కాలేదని బాధ పడుతున్న అభిమానులకు ఈ లీక్ తో ఊపు వచ్చింది. దీంతో సోషల్ మీడియాని ఊపేస్తున్నారు. ఒకవేళ ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో పెట్టారంటే నా సామీరంగా థియేటర్లు దద్దరిల్లడం ఖాయం. మరి చూడాలి ఈ సీక్వెన్స్ ఉంటుందో లేదో.. ఇక సలార్ 2 టన్నెల్ యాక్షన్ సీక్వెన్స్ గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetsezarcasinoJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomcasibomjojobetcasibomfixbetcasibomfixbetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş