iDreamPost
android-app
ios-app

త్రివిక్రమ్ రివర్స్ ప్లాన్! అప్పుడు మహేష్.. ఇప్పుడు పవన్!

  • Author ajaykrishna Updated - 04:44 PM, Mon - 4 September 23
  • Author ajaykrishna Updated - 04:44 PM, Mon - 4 September 23
త్రివిక్రమ్ రివర్స్ ప్లాన్! అప్పుడు మహేష్.. ఇప్పుడు పవన్!

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ ‘గుంటూరు కారం’. దాదాపు పన్నెండేళ్ల తర్వాత వీరి కాంబోలో మూడో సినిమాగా గుంటూరు కారం వస్తోంది. అయితే.. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా.. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. మహేష్ బాబును ఇదివరకు ఎన్నడూ చూడని డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ లో త్రివిక్రమ్ చూపించబోతున్నట్లు లుక్, టీజర్ చూస్తే అర్ధమవుతుంది. కాగా.. మహేష్ తో ఊరమాస్ డైలాగ్స్ వినిపించబోతున్నాడని ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.

ఇక మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే.. అతడులో సైలెంట్ అయినా బుల్లెట్స్ లాంటి డైలాగ్స్ చెప్పించాడు. ఆ తర్వాత ఖలేజాలో అదే మహేష్ చేత నాన్ స్టాప్ డైలాగ్స్ తో పాటు సూపర్ కామెడీని ప్రెజెంట్ చేశాడు త్రివిక్రమ్. అలాంటిది ఇప్పుడు మూడో సినిమా అనేసరికి.. నెక్స్ట్ లెవెల్ లో అంచనాలు పెట్టేసుకున్నారు అభిమానులు. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కాగా.. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. అయితే.. గుంటూరు కారం మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో, ఇండస్ట్రీ వర్గాలలో వైరల్ గా మారింది.

అదేంటంటే.. గతంలో జల్సా సినిమా కోసం మహేష్ బాబు చేత వాయిస్ ఓవర్ చెప్పించాడు త్రివిక్రమ్. ఇప్పుడు అదే కాంబో రివర్స్ చేయబోతున్నాడని తెలుస్తోంది. గుంటూరు కారం సినిమా కోసం పవన్ కళ్యాణ్ చేత వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడని టాక్. గుంటూరు మిర్చి యార్డ్ నేపథ్యంలో కథాంశం ఉండనుందని.. కథ పరంగా ఆ నేపథ్యాన్ని పవన్ వాయిస్ ఇవ్వనున్నాడట. త్రివిక్రమ్ ప్లాన్ ప్రకారమే.. అడిగిన వెంటనే పవన్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఒప్పుకున్నాడని వినికిడి. ప్రస్తుతానికి ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ.. ఒకవేళ నిజమే అయితే ఫ్యాన్స్ కి పండగే అని టాక్. మరి గుంటూరు కారం మూవీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibommeritbet girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetholiganbet