iDreamPost
android-app
ios-app

మాటల మాంత్రికుడు.. పడిన బాకీ ఇప్పుడైనా తీరుస్తాడా?

  • Author ajaykrishna Updated - 02:30 PM, Thu - 5 October 23
  • Author ajaykrishna Updated - 02:30 PM, Thu - 5 October 23
మాటల మాంత్రికుడు.. పడిన బాకీ ఇప్పుడైనా తీరుస్తాడా?

టాలీవుడ్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ క్రేజ్ వేరు. ఆయన సినిమాలలో ఉండే డైలాగ్స్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డైలాగ్ రైటర్ గా కెరీర్ ఆరంభించి.. ఆ తర్వాత కథారచయితగా.. తర్వాత దర్శకుడిగా త్రివిక్రమ్ ప్రయాణం చాలా పెద్దది. ఇప్పటిదాకా రచయితగా రాసిన సినిమాలకంటే.. దర్శకుడిగా తీసిన సినిమాలు తక్కువే. కానీ.. తన డైలాగ్స్ పరంగా.. సినిమాలో హీరో ఎలివేషన్స్ పరంగా త్రివిక్రమ్ మార్క్ వేరు. దర్శకుడిగా త్రివిక్రమ్ అజ్ఞాతవాసి తప్ప.. ఆ తర్వాత వచ్చిన అరవింద సమేత, అల వైకుంఠపురంలో మూవీస్ తో మళ్ళీ సూపర్ ఫామ్ లోకి వచ్చేసాడు. ఇప్పటికి అల్లు అర్జున్ కి హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చేసాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జల్సా, అత్తారింటికి దారేది లాంటి సూపర్ హిట్స్ ఇచ్చాడు. దాదాపు తాను వర్క్ చేసిన అందరు హీరోలకు గురూజీ హిట్స్ ఇచ్చేశాడు. కానీ.. ఒక్కరికి తప్ప. ఆ హీరోనే సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. కానీ.. బాగున్నాయి అనిపించుకున్నాయి, టీవీలో అయితే ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్స్. అయినా.. మహేష్ కెరీర్ లో హిట్ పడనట్లే కదా! సో.. తనతో వర్క్ చేసిన అందరు హీరోలకు హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్.. మహేష్ బాబుకు ఇంకా బాకీ ఉన్నాడు. రెండు సినిమాలు చేసినా వాటి ఫలితాలు నిరుత్సాహపరిచాయి.

కట్ చేస్తే.. ఇప్పుడు మహేష్ తో ముచ్చటగా మూడో సినిమా చేస్తున్నాడు. గుంటూరు కారం టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై హైప్ గట్టిగా క్రియేట్ అయ్యింది. అందుకు కారణం.. మహేష్ ని చాలా గ్యాప్ తర్వాత మాస్ అవతారంలో చూపిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. సో.. ఈసారి మూడో సినిమా కాబట్టి.. ఇకనైనా హిట్ బాకీ తీర్చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా గుంటూరు కారం రిలీజ్ కాబోతుంది. సో.. ఇంకా రిలీజ్ కి 100 రోజులే ఉండటంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ మొదలుపెట్టేశారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నాడు. దసరాకు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని టాక్. మరి గుంటూరు కారం గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.