iDreamPost
android-app
ios-app

ఈ చిన్నోడిని గుర్తుపట్టారా.. ఇప్పుడు టాలీవుడ్ లో ట్రెండింగ్ స్టార్

  • Published Apr 01, 2024 | 2:52 PM Updated Updated Apr 01, 2024 | 2:56 PM

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకడు. పైగా ఈ హీరోకు యూత్ లో తెగ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతేకాకుండా ఈ హీరో ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ మొత్తన్ని షేక్ చేస్తున్నాడు. అలాగే తన స్టైల్ , ఆకర్షించే లుక్స్ తో అమ్మాయిలను ఇట్టే మాయ చేస్తాడు. ఇంతకి ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరో ఎవరో గుర్తపట్టారా

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకడు. పైగా ఈ హీరోకు యూత్ లో తెగ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతేకాకుండా ఈ హీరో ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ మొత్తన్ని షేక్ చేస్తున్నాడు. అలాగే తన స్టైల్ , ఆకర్షించే లుక్స్ తో అమ్మాయిలను ఇట్టే మాయ చేస్తాడు. ఇంతకి ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరో ఎవరో గుర్తపట్టారా

  • Published Apr 01, 2024 | 2:52 PMUpdated Apr 01, 2024 | 2:56 PM
ఈ చిన్నోడిని గుర్తుపట్టారా.. ఇప్పుడు టాలీవుడ్ లో  ట్రెండింగ్ స్టార్

సినీ ఇంటస్ట్రీలో స్టార్స్ గా ఎదగడానికి చాలామంది ఎంతో కష్టపడుతుంటారు. ఈ క్రమంలోనే సినిమాల కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఎందుకంటే.. ఇక్కడ చేసిన ప్రతి సినిమా కూడా హిట్ అవ్వలంటే చిన్న మాట కాదు. ఆ విషయంకొస్తే సినిమా కంటెంట్ తో పాటు అదృష్టం కూడా తోడై ఉండాలి. అయితే ఇండస్ట్రీలో నటులుగా ఎన్ని సినిమాలు చేసిన.. ఎంతో ఆద్భుతంగా నటించిన.. స్టార్ గా గుర్తింపు తెచ్చేది మాత్రం ఏదో ఒక్క సినిమా మాత్రమే. ఆ ఒక్క సినిమానే ఒక్కోక్కసారి ఇండస్ట్రీ మొత్తన్ని షేక్ చేస్తుంది. కేవలం ఆ ఒక్క సినిమానే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను విపరీతమైన క్రేజ్ ను తెచ్చిపెడుతుంది.పైగా విమర్శించే వారి చేతనే ప్రశంసలు అందుకోనలా చేస్తుంది.అయితే మనం ఇప్పుడు చెప్పుకోబోయిన ఓ యంగ్ హీరో కూడా ఇదే కోవకు చెందినవాడు. అవును పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నోడు ఇప్పుడు హీరోగా సౌత్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు. అయితే, ఈ హీరో కూడా మొదట ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన సిని జీవితాన్ని ప్రారంభించి నేడు హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇంతకి ఈ హీరో ఎవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా..

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకడు. పైగా ఈ హీరోకు యూత్ లో తెగ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక తన స్టైల్ , ఆకర్షించే లుక్స్ తో అమ్మాయిలను ఇట్టే మాయ చేసేస్తాడు. కానీ సినిమాల్లో అమ్మాయిల చేతుల్లో మాత్రం మోసపోతూ ఉంటాడు. ఇక ఇప్పటికే ఆయన ఎవరో మీకు అర్థమైపోయి ఉంటుంది. మరి ఆ చిన్నోడు మరెవరో కాదు.. డీజే టిల్లు గా ముద్ర వేసుకున్న యంగ్ హీరో ‘సిద్ధు జొన్నలగడ్డ’. ఈయన మొదటగా.. సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ లో నటిస్తూ.. ఆ తర్వాత హీరోగా ఇండస్ట్రీలో నిలదక్కుకున్నాడు. ఈ క్రమంలోనే.. ‘గుంటూరు టాకీస్‌’, ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీలా’ లాంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ఆ తర్వాత ‘డీజే టిల్లు’ సినిమాతో సెన్సేషనల్ హిట్ ను అందుకున్నాడు. కాగా, ఇటీవలే ‘టిల్లు స్క్వేర్’ తో ప్రేక్షకులను అలరించి మరోసారి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈ సినిమాలో డైలాగ్స్ ను కూడా సిద్ధునే రాశాడు. ఇక టిల్లు స్క్వేర్ తో మరో హిట్ ను అందుకున్న సిద్ధు ప్రస్తుతం ఇండస్ట్రీలో ట్రెండింగ్ లో ఉన్నాడు. అయితే ప్రస్తుతం ఆయన చిన్ననాటి ఫోటో కాస్త నెట్టింట వైరల్ అవ్వడంతో ఫాన్స్ తమ అభిమాన హీరో చిన్నప్పుడు కూడా ఎంతో క్యూట్ గా ఉన్నడంటూ.. కామెంట్స్ పెడుతున్నారు.

ఇక టిల్లు స్క్వేర్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబెడుతుంది. కాగా, ఈ మూవీ రిలీజైన రెండు రోజుల్లోనే వరల్డ్ వైడ్ 45.3 కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించి రూ. 50 కోట్ల క్లబ్‌ వైపు దూసుకెళ్తుంది. పైగా ఈ సినిమా త్వరలోనే రూ.100 కోట్లు కలెక్ట్ చేస్తుందని ప్రొడ్యూసర్ నాగ వంశీ ముందే చెప్పిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు సిద్ధూ జోరు చూస్తుంటే త్వరలోనే ఈ సినిమా రూ. 100 కోట్లు కొల్లగొట్టిన ఆశ్చర్యపోవల్సిన అవసరం లేదు. మరి, ప్రస్తుతం సిద్ధూ చిన్ననాటి ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss