iDreamPost
android-app
ios-app

రామ్ చరణ్ ఇంట్లో గ్రాండ్‌గా దీపావళి పార్టీ.. హాజరైన టాలీవుడ్ స్టార్స్

  • Published Nov 12, 2023 | 1:19 PM Updated Updated Nov 12, 2023 | 1:19 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట్లో దీపావళి పార్టీ గ్రాండ్ గా జరిగింది. ఈ పార్టీకి టాలీవుడ్ స్టార్స్ హాజరై సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింటా వైరల్ గా మారాయి. తమ అభిమాన హీరోలు ఒకే చోట కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట్లో దీపావళి పార్టీ గ్రాండ్ గా జరిగింది. ఈ పార్టీకి టాలీవుడ్ స్టార్స్ హాజరై సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింటా వైరల్ గా మారాయి. తమ అభిమాన హీరోలు ఒకే చోట కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

  • Published Nov 12, 2023 | 1:19 PMUpdated Nov 12, 2023 | 1:19 PM
రామ్ చరణ్ ఇంట్లో గ్రాండ్‌గా దీపావళి పార్టీ.. హాజరైన టాలీవుడ్ స్టార్స్

దేశ వ్యాప్తంగా దీపావళి సందడి నెలకొంది. సామాన్యుల నుంచి మొదలు సెలబ్రిటీల వరకు పండుగ వేడుకల్లో మునిగిపోయారు. కుంటుంబ సభ్యులు, ఆత్మీయులు, స్నేహితుల మధ్యలో దీపావళి పండుగను అంగరంగవైభవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ టాప్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట్లో దీపావళి వేడుకలు అంబరాన్నంటాయి. రామ్ చరణ్ పలువురు సెలబ్రిటీలకు గ్రాండ్ గా పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ పార్టీలో టాలీవుడ్ స్టార్స్ సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు నమ్రత ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేయగా క్షణాల్లోనే వైరల్ గా మారాయి.

నటుడు రామ్‌చరణ్‌ నివాసంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో టాలీవుడ్‌ టాప్ హీరోలు సందడి చేశారు. నిత్యం సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉండే స్టార్స్ ఒకే దగ్గర చేరి పండుగను సెలబ్రేట్ చేసుకోవడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా రామ్‌చరణ్‌- ఉపాసన దంపతులు ఇంట్లో గ్రాండ్‌ పార్టీ ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి హైదరాబాద్‌లోని తమ నివాసంలో జరిగిన ఈ వేడుకల్లో నటులు వెంకటేశ్‌, మహేశ్‌బాబు – నమ్రత, ఎన్టీఆర్‌ – ప్రణతీ దంపతులతోపాటు టాలీవుడ్‌కు చెందిన నటీనటులు, దర్శక నిర్మాతలు ఈ పార్టీలో సందడి చేశారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆనందంగా గడిపారు. అంతా ఒకేచోటుకి చేరి భోజనం చేసి, ఆడి పాడి సరదాగా గడిపారు.

రామ్ చరణ్ ఉపాసనల గారాల పట్టీ క్లీంకారకు ఇది తొలి దీపావళి వేడుక కావడంతో గ్రాండ్ గా పార్టీ అరేంజ్ చేసినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్, వెంకటేష్, ఎన్టీఆర్, మహేష్ బాబు ఒకే ఫ్రేమ్ లో ఉన్న ఫొటో ఆకట్టుకుంటోంది. కాగా స్టార్ యాక్టర్స్ మధ్య నెలకొన్న స్నేహపూరిత వాతావరణానికి ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.కాగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత చరణ్‌ నటిస్తోన్న చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. విక్టరీ వెంకటేష్ సైంధవ్ సినిమాతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరతో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. గుంటూరు కారంతో మహేష్ బాబు తన సత్తా చాటేందుకు సన్నద్దమవుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş