iDreamPost
android-app
ios-app

అశ్వినీదత్ చెప్పిన నాగి చెప్పుల కథ! అల్లుడుగారు అసలైన జాతిరత్నం!

  • Published Jul 10, 2024 | 1:38 PM Updated Updated Jul 10, 2024 | 1:38 PM

Aswani Dutt, Nag Ashwin: కల్కి మూవీతో వరల్డ్ వైడ్ గా మంచి క్రేజ్ సంపాదించిన దర్శకుడు నాగ్ అశ్విన్.. బయట ఎంత సింపుల్‌గా కనిపిస్తాడో అందరికి తెలిసిందే. అయితే కొన్ని రోజుల క్రితం ఆయన పాత చెప్పులు ధరించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. వాటిపై తాజాగా నిర్మాత అశ్వినీ దత్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపాడు.

Aswani Dutt, Nag Ashwin: కల్కి మూవీతో వరల్డ్ వైడ్ గా మంచి క్రేజ్ సంపాదించిన దర్శకుడు నాగ్ అశ్విన్.. బయట ఎంత సింపుల్‌గా కనిపిస్తాడో అందరికి తెలిసిందే. అయితే కొన్ని రోజుల క్రితం ఆయన పాత చెప్పులు ధరించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. వాటిపై తాజాగా నిర్మాత అశ్వినీ దత్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపాడు.

  • Published Jul 10, 2024 | 1:38 PMUpdated Jul 10, 2024 | 1:38 PM
అశ్వినీదత్ చెప్పిన నాగి చెప్పుల కథ! అల్లుడుగారు అసలైన జాతిరత్నం!

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రిటీలు ఎంతో ఖరీదైన వస్తువులను  వినియోగిస్తుంటారు. అంతేకాక ఎక్కువ మంది చాలా స్టైలిష్ గా ప్రత్యేకంగా ఉంటుంటారు. కానీ కొందరు మాత్రం ఎంత స్టార్ డమ్ వచ్చినా, ఎంత ఫేమస్ అయినా.. చాలా సాధారణంగానే జీవనం సాగిస్తుంటారు. అంతేకాక వారి ధరించే వస్తువులు కూడా చాలా సాధారణంగానే ఉంటాయి. అలాంటి వారిలో కల్కి2898ఏడీ మూవీ దర్శకుడు నాగ్ అశ్వీన్ ఒకరు. ఆయన ఎంత సింపుల్ గా కనిపిస్తాడో అందరికి తెలిసింది. తాజాగా ఆయన పాతచెప్పులు ధరించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఇదే విషయంపై టాలీవుడ్ నిర్మాత అశ్వినీదత్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా ఎక్కడ చూసిన వినిపిస్తోన్న పేరు కల్కి..కల్కి.  ఇండియన్ ఫిల్మ్ హిస్టరిలోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే విడుదలై సూపర్ హీట్ సొంతం చేసుకుంది. అంతేకాక పలు రికార్డులను సైతం తన ఖాతాలో వేసుకుంది. హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాను దర్శకుడు నాగ్ అశ్వీన్ రూపొందించారు. మహాభారతాన్ని నేటితరంకి కనెక్ట్ చేస్తూ..సినిమా తెరకెక్కించండో నాగీ విజయం సాధించాడు. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల దండయాత్ర చేస్తోంది.

 ఇంతలా వరల్డ్ వైడ్ గా మంచి క్రేజ్ సంపాంధించిన దర్శకుడు నాగ్ అశ్విన్.. బయట ఎంత సింపుల్‌గా కనిపిస్తాడో అందరికి తెలిసిందే.  ఎంతో సాధారణంగా ఒక టీషర్ట్, కార్గో జీన్స్ వేసుకుని,  మాములు చెప్పులు ధరించి బయట కనిపిస్తుంటాడు. సినిమా సెట్లో, ఏదైనా ఈవెంట్లో కూడా అతను అంతే సింపుల్ డ్రైసింగ్ లో నాగీ కనిపిస్తాడు. ‘కల్కి’ సినిమా తీసినన్ని రోజులు అతను ఒకే చెప్పుల జతను ధరించడం విశేషం. సినిమా రిలీజైన సందర్భంలో పాత చెప్పులు వేసుకున్న నాగ్ అశ్వీన్ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక నాగ్ అశ్వీన్ ధరించిన పాత స్లిపర్స్ స్టోరీ గురించి..ఆయన మామ ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. నాగ్ అశ్వీన్ సింప్లిసిటీ గురించి మాట్లాడాడు.

అశ్వినీ దత్ మాట్లాడుతూ… జనం దృష్టిలో నాగ్ అశ్విన్ గొప్ప వ్యక్తి కానీ.. ఆయన చాలా సింపుల్‌గా ఉంటారని తెలిపాడు.  నాగ్ అశ్వీన్ గురించి ఎవరికీ తెలియని విషయాలు కొన్ని ఉన్నాయని, అతను తమ ఇంటికి హడావుడిగా వస్తాడని అశ్వినీదత్ తెలిపారు. అలా వచ్చే సమయంలో  స్లిప్పర్స్ బయట విడిచి లోపలికి వస్తాడని, అలానే వెళ్లేటపుడు అశ్వినీదత్ చెప్పులు వేసుకుని వెళ్లిపోతాడంట. అసలు తమ ఇంటికి వచ్చే ముందు నాగ్  వాళ్ల నాన్న చెప్పులు వేసుకుని వస్తాడంటూ నాగి గురించి  అశ్వినీదత్  సరదా విషయాలు చెప్పుకొచ్చారు. ఇకఇంటర్వ్యూలో నాగి గురించి ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet