Arjun Suravaram
Radha Madhavam: ఓటీటీలోకి వారం వారం అనేక సినిమాలు వస్తుంటాయి. కొన్ని మూవీస్ అయితే థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆడకపోయినా..ఓటీటీలో మాత్రం అదిరిపోయే రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటున్నాయి. అలాంటి ఓ సినిమా ఓటీటీలో ట్రెడింగ్ లో ఉంది.
Radha Madhavam: ఓటీటీలోకి వారం వారం అనేక సినిమాలు వస్తుంటాయి. కొన్ని మూవీస్ అయితే థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆడకపోయినా..ఓటీటీలో మాత్రం అదిరిపోయే రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటున్నాయి. అలాంటి ఓ సినిమా ఓటీటీలో ట్రెడింగ్ లో ఉంది.
Arjun Suravaram
ప్రస్తుతం ఓటీటీ హవా కొనసాగుతోంది. థియేటర్లో విడుదలైన ప్రతి సినిమా కూడా కొన్ని రోజుల తరువాత ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై ప్రత్యక్షమవుతుంది. మూములు సినిమాలతో పాటు సూపర్ హిట్ మూవీస్ కూడా ఓటీటీలో సందడి చేస్తుంటాయి. కొన్ని సినిమాలు థియేటర్లలో దుమ్ములేపుతుంటాయి. అదే విధంగా ఓటీటీ ప్లాట్ ఫామ్ పై కూడా ఈ సినిమాలు రచ్చ చేస్తుంటాయి. ఇది ఇలా ఉంటే…కొన్ని చిన్న సినిమాలకు ఓటీటీలో అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఓటీటీలో ప్రేక్షకులు ఆ సినిమాలకు బ్రహ్మరథం పడుతుంటారు. అలాంటి ఓ టాలీవుడ్ చిన్న సినిమా ఓటీటీలో బాగా ట్రెడింగ్ లో ఉంది. ఈ సినిమాలో పరువు సిరీస్ కి మించిన ట్విస్టులు ఉన్నాయి. మరి.. ఆ సినిమా ఏమిటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది, ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం…
లవ్ స్టోరీతో, పరువు హత్యల నేపథ్యంలో గతంలో అనేక సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా గ్రామీణ లవ్ స్టోరీల ఆధారంగా ఈ మధ్య ఎక్కువగా వస్తున్నాయి. వాటిల్లో కొన్ని మెప్పించగా..మరికొన్ని యావరేజ్ టాక్ తో నిలిచాయి. ఈ లవ్ స్టోరీతో వచ్చిన కొన్ని సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. అలాంటి కథతోనే వచ్చిన మరో మూవీ ‘రాధా మాధవం’. ఈ సినిమాలో వినాయక్ దేశాయ్, అపర్ల దేవి హీరో హీయిన్లు గా నటించారు. ఈ సినిమాకు దాసరి ఇసాక్ దర్శకత్వం వహించగా గోనాల వెంకటేష్ నిర్మించారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 1న థియేటర్లలో విడుదలైంది. అయితే ఆశించిన స్థాయిలో ఈ సినిమా బాక్సాపీస్ వద్ద నిలబడలేదు.
ఈ క్రమంలోనే థియేటర్లలో నుంచి ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ఫ్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో అనుకున్నంత గుర్తింపు రాకపోయినా..ఓటీటీలో మాత్రం అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఎక్కడా అశ్లీలత, ఓవర్ రోమాన్స్ లేకుండా గ్రామీణ నేపథ్యంలో రాధామాధవం తెరకెక్కించారు. పరువు హత్యలు, పట్టింపుల, ప్రేమలు, లాంటి ఎమోషనల్ సీన్స్ తో ఓటీటీ ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటుంది. ఎవరైనా సినిమాను థియేటర్లలో చూడటం మిస్సై ఉంటే.. అమోజాన్ ఓటీటీలో చూడవచ్చు.
ఇక రాధామాధవం సినిమా కథ విషయానికి వస్తే… అనంతపురం జిల్లాలోని ఓ మారుముల గ్రామానికి చెందిన యువకుడు మాధవ్ ( వినాయక్ దేశాయ్) అదే గ్రామానికి చెందిన రాధ( అపర్ణాదేవి) అనే అమ్మాయి ప్రేమించుకుంటారు. ఇద్దరు వేరు వేరు కులాలకు చెందిన వారు. చిన్నప్పటి నుంచి ఒకే పాఠశాలలో చదువుతారు. ఆ తరువాత మాధవ్ ఉన్నత చదువుల కోసం సిటీకి వెళ్లి వస్తాడు. రాధ వాళ్ళ నాన్న వీరభద్రం రాజకీయాల్లో ఎదగడానికి ఏమైనా చేయాలనుకుంటాడు. అయితే తక్కువ వేరే కులానికి చెందిన మాధవ్ ని ఎన్నికల ముందు ఏదైనా చేస్తే అతని వర్గానికి చెందిన ఓట్లు రావని వీరభధ్రం ఏమీ చేయడు. ఇక ఆ ఊరివాళ్ళంతా రాధా, మాధవ్ ల పెళ్ళి జరిపించడం కోసం వీరభద్రంకి ఓటు వేసి గెలిపిస్తారు. ఇలాంటి సమయంలో మాధవర్, రాధాలు ఊరి నుంచి వెళ్లిపోతారు. మరి వీరభద్రం ఏం చేశాడు? రాధా, మాధవ్ ల పెళ్ళి జరిగిందా లేదా అనేది తెలియాలంటే.. సినిమాను చూసేయాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.