iDreamPost
android-app
ios-app

కూతుళ్ళ చేతుల్లోకి టాలీవుడ్! ఇక ఆడవారిదే రాజ్యం!

కూతుళ్ళ చేతుల్లోకి టాలీవుడ్! ఇక ఆడవారిదే రాజ్యం!

సినీ ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ అనేది సర్వసాధారణం. ఎంతో మంది సెలబ్రిటీల పిల్లల సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే చాలా మంది వారుసుల ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. స్టార్ హీరోలగా రాణిస్తున్నారు. అలానే నిర్మాతల వారసుళ్లు, వారసురాళ్ల ఎంట్రీ కూడా ఇండస్ట్రీకి కొత్తేమి కాదు. ఇప్పటికే పలువురి నిర్మాతల కుమార్తెలు ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అశ్వీనీదత్ కుమార్తెలు నిర్మాతలు ఇండస్ట్రీలో  రాణిస్తున్నారు. వారితో పాటు దిల్ రాజు కుమార్తె కూడా నిర్మాణ రంగలోకి  అడుగు పెట్టారు. మెగా కాపౌండ్ నుంచి సుశ్మిత, నిహారికలు నిర్మాతలుగా రాణిస్తున్నారు. తాజాగా ఆ లిస్ట్ లోకి చినబాబు కుమార్తె హారిక కూడా వచ్చి.. చేరింది. దీంతో సినీ నిర్మాణం వారసురాళ్ల చేతుల్లోకి వెళ్తుందని టాక్ వినిపిస్తోంది.

చిత్ర పరిశ్రమలోని  నిర్మాతది కీలకమైన పాత్ర. వారు బాగుంటేని ఇండస్ట్రీ బాగుంటుందని చాలా మంది భావిస్తారు. అంతేకాక ఎంతో మంది నిర్మాతలు.. అనేక అద్భుత సినిమాలను నిర్మించారు. ఇప్పటి వరకు ఇండస్ట్రీలు నిర్మాతలు అంటే మగవాళ్లే గుర్తుకు వస్తారు. అశ్వినీదత్, అల్లు అరవింద్, దిల్ రాజు , చినబాబు వంటి  పలువురు నిర్మాతలు ఉన్నారు. వీరందరు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించి.. టాలీవుడ్ లో  అనేక రికార్డులు బదలు కొట్టారు. ఇలా ఏళ్ల తరబడి నిర్మాతలకు చాలా మంది మగవాళ్లు కీలక పాత్రలో పోషించారు.

అయితే తాజాగా వారి వారసురాళ్లు కూడా ఇండస్ట్రీలోకి  ఎంట్రీ ఇచ్చి.. సక్సెస్ అవుతున్నారు. ఇటీవల కొంతకాలం నుంచి ఇదే ట్రెండీ కనిపిస్తుంది. అశ్వినీ దత్ కుమార్తెలు ప్రియాంక దత్, స్వప్న దత్ సినీ నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. అంతేకాక సూపర్ హిట్ చిత్రాలను నిర్మించి.. ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యారు. ఇక వారి తరువాత ప్రముఖ నిర్మాత దిల్ రాజు కుమార్తె హన్షిత కూడా సినీ నిర్మాణలోకి అడుగు పెట్టి.. సక్సెస్ అయ్యారు. హన్షితకు సినిమాలంటే బాగా ఆసక్తి అంట. అందుకే తండ్రి నిర్మాతగా దూసుకుపోతున్నప్పటికీ తాను కూడా మరోవైపు తాను ప్రొడ్యూసర్ గా  ఎదిగింది. మెగా ఫ్యామిలీ నుంచి సుష్మిత, నిహారికలు కూడా పలు వెబ్ సిరీస్ లు, సినిమాలను నిర్మించారు. అలా నిర్మాత కుమార్తెలు సినీ నిర్మాణంలో విజయవంతగా రాణిస్తున్నారు. వీరి లిస్ట్ లో  ప్రముఖ నిర్మాత చిన బాబు కుమార్తె హారికా కూడా  చేరారు.

చిన బాబు అనగానే చెప్పగానే ‘అల వైకుంఠపురంలో’,’ అ..ఆ’, సన్నాఫ్ సత్యముూర్తి లాంటి సూపర్ హిట్ సినిమాలు గుర్తొస్తాయి. ఈయన వారసత్వంతో హారిక కూడా వస్తున్నారు. ఇలా వారసురాళ్ల నిర్మాణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో భవిష్యత్తులో మహిళ నిర్మాతల హవానే నడుస్తోందని సినీ విశ్లేషకులు అంటున్నారు. అంతేకాక టాలీవుడ్ బడ నిర్మాతల కూతుర్లు ఎంట్రీ.. ఇండస్ట్రీ వారి చేతుల్లోకి వెళ్లి.. వెరైటీ సినిమాలు వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  ఇలా నిర్మాతల వారసురాళ్ల ఎంట్రీలతో భవిష్యత్తులో టాలీవుడ్ లో కూతుళ్ల హవా నడుస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఈ వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş