iDreamPost
android-app
ios-app

చిరంజీవి ఆశీస్సులు తీసుకుంటున్న ఈ చిన్నోడు ఎవరో తెలుసా..?

  • Published Aug 22, 2024 | 1:47 PM Updated Updated Aug 22, 2024 | 1:47 PM

ఈ ఫోటోలో చిరంజీవి కాళ్లపై పడి సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఆశీస్సులు తీసుకుంటున్న ఈ చిన్నోడిని గుర్తు పట్టారా..? ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో. ఫస్ట్ సినిమాతో మంచి యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంతకు ఆ నటుడు ఎవరంటే..?

ఈ ఫోటోలో చిరంజీవి కాళ్లపై పడి సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఆశీస్సులు తీసుకుంటున్న ఈ చిన్నోడిని గుర్తు పట్టారా..? ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో. ఫస్ట్ సినిమాతో మంచి యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంతకు ఆ నటుడు ఎవరంటే..?

  • Published Aug 22, 2024 | 1:47 PMUpdated Aug 22, 2024 | 1:47 PM
చిరంజీవి ఆశీస్సులు తీసుకుంటున్న ఈ చిన్నోడు ఎవరో తెలుసా..?

టాలీవుడ్ స్థాయిని దేశ నలుమూలలా ఇనుమడింప చేసిన నటుల్లో ఒకరు మెగాస్టార్ చిరంజీవి. తెలుగు ప్రేక్షకులు ముద్దుగా పిలుచుకునే అన్నయ్య ఆయన. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి స్వయంకృషితో సుప్రీమ్ హీరో నుండి మెగాస్టార్ అయ్యారు. ప్రాణం ఖరీదుతో మొదలైన ఆయన సినీ ప్రయాణం.. ఎంతో మందికి స్ఫూర్తి దాయకం. సినీ పరిశ్రమలోకి రావాలనుకునే వారికి చిరు ఓ గైడ్, మెంటర్ అనడంలో సందేహం లేదు. సినీ పరిశ్రమకు చిరంజీవి చేసిన సేవలకు గానూ.. దేశంలోనే రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్‌తో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. ఆగస్టు 22న ఈ లెజండరీ హీరో పుట్టిన రోజు. ఈ సందర్భంగా సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన వ్యక్తులు విషెస్ చేస్తున్నారు. అలా ఆయనకు పుట్టిన రోజు విషెస్ తెలిపిన వారిలో ఈ చిన్నోడు కూడా ఉన్నాడు.

చిరంజీవి పాదాలపై పడి సాష్టాంగ నమస్కారం చేసి ఆశీస్సులు తీసుకుంటున్న ఈ చిన్నోడు ఎవరో తెలుసా..? మెగా వారసుడు. రామ్ చరణ్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే. మెగా తనయుడు వరుణ్ తేజ్. పెద్దనాన్న బర్త్ డే సందర్భంగా విషెస్ తెలియజేస్తూ ఈ ఫోటోను షేర్ చేసుకున్నాడు వరుణ్. ‘ప్రతి సమస్యను చిరునవ్వుతో ఎదుర్కోవడం నేర్పినందుకు, మాకు సపోర్టు చేస్తూ.. ప్రేమతో కూడిన విలువలు నేర్పినందుకు థాంక్యూ. నాకు ఎప్పుడూ మీరు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నందుకు ధన్యవాదాలు. విష్ యు ఎ వెరీ హ్యాపీ బర్త్ డే డాడీ. లవ్ యూ’ అంటూ ట్వీట్ చేశాడు నాగబాబు తనయుడు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇందులో మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన తండ్రి కొణిదెల వెంకట్రావు కూడా కనిపిస్తున్నారు. ఓ ఫోటోలో వరుణ్ .. చిరు ఆశీస్సులు తీసుకుంటుంటే.. మరోఫోటోలో కొడుకుని ఆటపట్టిస్తున్నాడు మెగాస్టార్.

Chiranjeevi , Varun Tej, Happy Birth Day Chiranjeevi 1

ఇక వరుణ్ తేజ్ సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది ఆపరేషన్ వాలంటైన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హిందీ- తెలుగులో బై లింగ్వల్ మూవీగా తెరకెక్కింది. ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఇప్పుడు మట్కా అనే మూవీ చేస్తున్నారు వరుణ్. పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి మూవీ హీరోయిన్. వైరా ఎంటర్‌టైన్‌మెంట్, ఎఆర్టీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై విజేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి తెరకెక్కిస్తున్నారు. తాజాగా హీరో ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో వరుణ్ వింటేజ్ లుక్కుతో కనిపించాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

View this post on Instagram

 

A post shared by Varun Tej Konidela (@varunkonidela7)

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet