iDreamPost
android-app
ios-app

Jani Master: లైంగిక వేధింపుల కేసు.. జానీ మాస్టర్ పై వేటు?

  • Published Sep 17, 2024 | 9:33 AM Updated Updated Sep 17, 2024 | 12:31 PM

Choreographers Association take action against Jani Master: లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై వేటు వేయడానికి డ్యాన్సర్స్ అసోసియేషన్ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

Choreographers Association take action against Jani Master: లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై వేటు వేయడానికి డ్యాన్సర్స్ అసోసియేషన్ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

Jani Master: లైంగిక వేధింపుల కేసు.. జానీ మాస్టర్ పై వేటు?

జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని, ముంబై, చెన్నై, హైదరాబాద్ లతో సహా పలు ఔట్ డోర్ షూటింగ్స్ లో తనపై అత్యాచారం చేశాడని ఆయన దగ్గర పని చేసే మధ్యప్రదేశ్ కు చెందిన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు జానీ మాస్టర్ పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇక తాజాగా ఆ యువతి నుంచి 3 గంటల పాటు స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు అధికారులు. ఈ స్టేట్ మెంట్ లో సంచలన విషయాలను బాధితురాలు వెల్లడించింది. జానీ మాస్టర్ భార్య కూడా తనపై దాడి చేసిందన్న షాకింగ్ విషయాలను పోలీసులకు తెలిపింది. కాగా.. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న మాస్టర్ పై వేటు వేయడానికి డ్యాన్సర్ అసోసియేషన్ రెడీ అవుతున్నట్లు సమాచారం.

లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు టీవీ అండ్ ఫిల్మ్ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి జానీ మాస్టర్ పై తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దాంతో మాస్టర్ పై చర్యలు తీసుకునేందుకు అసోసియేషన్ సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. కాగా.. ప్రస్తుతం కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జానీ మాస్టర్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. లైంగిక ఆరోపణలతో ఈ పదవి నుంచి ఆయన వైదొలగడం ఖాయంగా కనిపిస్తోంది. ఒక వ్యక్తి చేసిన తప్పు వల్ల అసోసియేషన్ మెుత్తానికే చెడ్డ పేరు రావడం మంచిది కాదని, అందులో భాగంగానే జానీ మాస్టర్ అధ్యక్ష పదవితో పాటుగా అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అదీకాక యూనియన్ బైలాస్ ప్రకారం జానీ మాస్టర్ ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని కొరియోగ్రాఫర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి సోమవారమే డెసిషన్ తీసుకోవాల్సి ఉండగా.. సెక్రటరీ అందుబాటులో లేకపోవడంతో.. నేడు అంటే మంగళ వారం ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. లైంగిక ఆరోపణల నేపథ్యంలో జానీ మాస్టర్ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. దాంతో మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కాగా.. ఇటీవలే ప్రకటించిన 70వ నేషనల్ అవార్డ్స్ లో జానీ మాస్టర్ కు అవార్డు వచ్చిన సంగతి విదితమే. మరి ఈ కేసులో అసోసియేషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా? అని ఇండస్ట్రీ మెుత్తం ఎదురుచూస్తోంది.