Somesekhar
Jani Master wife involved in this case: జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మాస్టర్ భార్య కూడా తనపై దాడిచేసిందని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన స్టేట్ మెంట్ లో తెలిపినట్లు సమాచారం.
Jani Master wife involved in this case: జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మాస్టర్ భార్య కూడా తనపై దాడిచేసిందని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన స్టేట్ మెంట్ లో తెలిపినట్లు సమాచారం.
Somesekhar
ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. జానీ మాస్టర్ తనపై ముంబై, చెన్నై, హైదరాబాద్ లతో పాటుగా పలు ఔట్ డోర్ షూటింగ్స్ లో అత్యాచారానికి పాల్పడ్డాడని ఆయన దగ్గర అసిస్టెంట్ గా చేసే లేడీ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేయగా.. కేసును నార్సింగ్ పీఎస్ కి బదిలీ చేశారు. ఈ క్రమంలోనే నార్సింగ్ పోలీసులు ఆమె నుంచి స్టేట్ మెంట్ తీసుకున్నారు. దాదాపు 3 గంటల పాటు బాధితురాలి నుంచి వివరాలను సేకరించారు అధికారులు. ఈక్రమంలోనే ఆమె పలు సంచలన విషయాలు వెల్లడించింది. స్టేట్ మెంట్ లో జానీ మాస్టర్ భార్య కూడా దాడి చేసిందని షాకింగ్ విషయాలను తెలిపింది.
జానీ మాస్టర్ తనపై అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి నుంచి అధికారులు స్టేట్ మెంట్ ను తీసుకున్నారు. 3 గంటల పాటు లేడీ కొరియోగ్రాఫర్ నుంచి స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు. ఈ క్రమంలోనే ఆమె సంచలన విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. షూటింగ్ టైమ్ లో క్యారవ్యాన్ లోకి వచ్చి ప్యాంట్ జిప్ తీసి బలవంత చేసేవాడని పోలీసులకు తెలిపింది. అలాగే తన సెక్స్ కోరికలు తీర్చకపోతే.. ఆఫర్లు రాకుండా చేస్తానని బెదిరించే వాడని, అతడి కోరిక తీర్చకపోతే.. నాపై బలవంతంగా దాడికి దిగబడేవాడని స్టేట్ మెంట్ లో పేర్కొంది. జానీ మాస్టర్ టార్చర్ భరించలేక బయటకి వెళ్లి పనిచేసుకుంటుంటే.. అతడితో పాటు అతడి భార్య కూడా మా ఇంటికి వచ్చి దాడి చేశారన్న షాకింగ్ విషయాన్ని పోలీసులకు తెలిపింది. మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని తనపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు స్టేట్ మెంట్ లో పేర్కొంది. ప్రస్తుతం లేడీ కొరియోగ్రాఫర్ పోలీసులకు వెల్లడించిన విషయాలు వెలుగులోకి రావడంతో.. కేసు సంచలనంగా మారింది.
కాగా.. బాధితులరాలిని భరోసా కేంద్రానికి తీసుకెళ్లిన అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు జానీ మాస్టర్ ఒక్కడే సదరు యువతిని వేధించాడని అనుకుంటుండగా.. ఇప్పుడు ఆయన భార్య కూడా దాడి చేసిందన్న షాకింగ్ విషయాన్ని పోలీసులకు బాధితురాలు వెల్లడించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక ఆమె నుంచి స్టేట్ మెంట్ ను రికార్డ్ చేసుకున్న అధికారులు విచారణను వేగవంతం చేశారు. ఇక ఈ వ్యవహారం ఫిలిం ఛాంబర్ కు చేరిన విషయం తెలిసిందే. మరి ఈ కేసు విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.