iDreamPost
android-app
ios-app

డబ్బు కోసం అలా చేయకండి! వారికి హీరోయిన్‌ మీనా వార్నింగ్‌

  • Published Mar 24, 2024 | 1:06 PM Updated Updated Mar 24, 2024 | 1:07 PM

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మల్లో హీరోయిన్  మీనా కూడా ఒకరు. అయితే ఈ మధ్యకాలంలో హీరోయిన్ మీనా పై తన భర్త విద్య సాగర్ మరణించిన దగ్గర నుంచి రకరకాల రూమర్స్ అనేవి వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా మీనా రెండో పెళ్లికి సంబంధించిన పుకార్లు జోరుగా వినిపిస్తున్నాయి. ఇక తాజాగా వీటిపై స్పందించిన మీనా అలా పుకార్లు సృష్టిస్తున్న వారి పై స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మల్లో హీరోయిన్  మీనా కూడా ఒకరు. అయితే ఈ మధ్యకాలంలో హీరోయిన్ మీనా పై తన భర్త విద్య సాగర్ మరణించిన దగ్గర నుంచి రకరకాల రూమర్స్ అనేవి వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా మీనా రెండో పెళ్లికి సంబంధించిన పుకార్లు జోరుగా వినిపిస్తున్నాయి. ఇక తాజాగా వీటిపై స్పందించిన మీనా అలా పుకార్లు సృష్టిస్తున్న వారి పై స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

  • Published Mar 24, 2024 | 1:06 PMUpdated Mar 24, 2024 | 1:07 PM
డబ్బు కోసం అలా చేయకండి! వారికి హీరోయిన్‌ మీనా వార్నింగ్‌

వెండితెర పై ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మల్లో హీరోయిన్  ‘మీనా’ కూడా ఒకరు. ఈమె తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక హీరోయిన్ గా కంటే ముందుగా మీనా.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సిని పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే.. సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించింది. అలాగే తమిళ్ కూడా మీనా అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఇక ఆ తర్వాత హీరోయిన్ గా తెలుగు తో పాటు తమిళ్, కన్నడ , హిందీ భాషల్లో తన నటనతో ప్రేక్షకులను అలరించిన మీనా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. అంతేకాకుండా.. టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు ఆగ్ర హీరోలైన చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున లతో జతకట్టి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక కేరీయర్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడే వ్యాపారవేత్త విద్యాసాగర్ ను మీనా పెళ్లి చేసుకుంది. కాగా, వీరికి నైనికా అనే పాప కూడా జన్మించింది. అయితే 2022లో మీనా భర్త విద్యా సాగర్ అనారోగ్యనికి గురయ్యి మరణించడంతో మీనా తన కుమార్తెతో ఒంటరిగ జీవనం సాగిస్తుంది. అయితే ఈ క్రమంలో మీనా పై పలు తప్పుడు పుకార్లు కొందరు సృష్టిస్తున్నారు. అయితే తాజగా అలా చేస్తున్నా వారిపై స్పందిస్తూ మీనా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

హీరోయిన్ మీన పై తన భర్త విద్యసాగర్ మరణించిన నుంచి రకరక రూమర్స్ అనేవి వినిపిస్తునే ఉన్నాయి. అందులో ఆమె రెండో పెళ్లి చేసుకుంటుదనే వార్త జోరుగా వినిపిస్తుంది. ఇప్పటికే మీనా, హీరో ధనుష్ ను పెళ్లి చేసుకుంటుందని పలు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. వీటిపై మీనా గతంలో కూడా స్పందించి దయచేసి ఇలాంటి వార్తలు రాయవద్దని, అవి తనకు తన కుటుంబానికి ఎంతో బాధను కలగిస్తున్నాయని చెప్పుకొచ్చింది. అయిన ఇలా పలుమార్లు తనపై వస్తున్న పుకార్లకు స్పందింస్తున్న మీనా రెండో పెళ్లి చేసుకోబోతుందని వార్తలు రాయడం అగడంలేదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనా రెండో పెళ్లి పై ప్రచారం గురించి ఓ ప్రశ్న ఎదురైంది.

కాగా, సోషల్ మీడియాలో ఇలాంటి రూమర్స్ ని వైరల్ చేస్తున్న వారిపై మీనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘డబ్బు కోసం ఎవరైనా, ఏమైనా రాస్తారా? అసలు సోషల్‌ మీడియా రోజు రోజుకు దిగజారిపోతుంది. కనీసం వాస్తవాలు తెలుసుకుని రాయండి. ఇక వాస్తవాలు తెలుసుకొని రాస్తే.. అందరికీ మంచిది. ఎందుకంటే.. దేశంలో నాలా చాలామంది ఒంటరిగా జీవించే మహిళలు ఉన్నారు. అలాగే నా తల్లిదండ్రులు, కూతురు భవిష్యత్తు గురించి కూడా ఆలోచించండి. ప్రస్తుతానికి నేను రెండో పెళ్లి గురించి ఎటువంటి ఆలోచన లేదు. ఒకవేళ భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటానో అది ఇప్పుడు ఎలా చెప్తాను. ఇక రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు ఉంటే తప్పకుండా నేనే మీడియాకు ప్రకటిస్తాను. అంతవరకు ఇలాంటి పుకార్లను ఎవరూ పట్టించుకోవద్దు.’ అంటూ చెప్పుకొచ్చారు. మరి, ప్రస్తుతం హీరోయిన్ మీనా చేసిన వ్యాఖ్యలు పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom