iDreamPost
android-app
ios-app

వాళ్ళు అర్ధరాత్రుళ్లు ఫోన్ చేసి.. డైరెక్ట్ గా అడుగుతారు: కిరణ్‌ రాథోడ్‌

  • Published Mar 14, 2024 | 2:01 PM Updated Updated Mar 14, 2024 | 2:01 PM

టాలీవుడ్ పరిశ్రమలో తొలి చిత్రంతోనే ఓ వెలుగు వెలుగిన హీరోయిన్ తన జీవితంలో ప్రేమ, పెళ్లి, పిల్లలు వంటి విషయాలపై తాజాాగా కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

టాలీవుడ్ పరిశ్రమలో తొలి చిత్రంతోనే ఓ వెలుగు వెలుగిన హీరోయిన్ తన జీవితంలో ప్రేమ, పెళ్లి, పిల్లలు వంటి విషయాలపై తాజాాగా కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

  • Published Mar 14, 2024 | 2:01 PMUpdated Mar 14, 2024 | 2:01 PM
వాళ్ళు అర్ధరాత్రుళ్లు ఫోన్ చేసి.. డైరెక్ట్ గా అడుగుతారు: కిరణ్‌ రాథోడ్‌

సినీ ఇండస్ట్రీలో చాలామంది ఎంత త్వరగా ఎదుగుతారో, అంతే త్వరగా పాతాళంలోకి జారుకుంటారు. అందుకు కారణం ఆవకాశాలు లేకపోవడం అనే మాట ఒక ఎత్తు అయితే.. మరో వైపు సెలబ్రిటీల ప్రేమ, డేటింగ్, ఎఫైర్స్ వంటి కారణాలతో పూర్తిగా కనుమరగవుతారు. కానీ, కొంతమంది మాత్రం ఈ ఆవకాశల పేరిట ఇండస్ట్రీలో పెద్దల చేతిలో కీలు బొమ్మలుగా మారుతారు. ఏమాత్రం వారికి ఎదురు తిరుగుతే వెండితెర పై జాడ లేకుండా తొక్కి వేస్తారు. అయితే టాలీవుడ్ లో చాలామంది నటులు, ఇలాంటి చేదు అనుభవాలను ఎదుర్కొని, బయటకు చెప్పుకోగా.. మరి కొందరు మాత్రం ఇంక అజ్ఞాతంలోనే ఉండిపోతున్నారు. అయితే తాజాగా టాలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ హీరోయిన్ ఇన్నాళ్లకు తన జీవితంలో ఎదురైన సంఘటనల గురించి బహిరంగంగా చెప్పుకున్నారు. ఇంతకి ఆమె ఎవరంటే..

టాలీవుడ్ పరిశ్రమలో తొలి చిత్రంతోనే ఓ వెలుగు వెలుగిన హీరోయిన్లలో కిరణ్ రాథోడ్ కూడా ఒకరు. ఈమె మొదటిగా జెమిని చిత్రంతో కథానాయకిగా వెండితెరకు పరిచయమైయింది. ఆ చిత్రం మంచి విజయం సాధించడంతో ఈమె పేరు ఇండస్ట్రీలో మారు మెగిపోయింది. దీంతో వరుస అవకాశాలు కిరణ్ కు క్యూ కట్టాయి. ఈ క్రమంలోనే ఈమె వరుసగా.. కమలహాసన్, అజిత్, విజయకాంత్, ప్రశాంత్ వంటి స్టార్ హీరోలతో జత కట్టారు. అయితే ఆ తర్వాత పెద్దగా ఏ సినిమాల్లో కనిపించలేదు. కానీ, చాలా కాలం తర్వాత.. కిరణ్ మళ్లీ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఒకటి రెండు చిత్రాల్లో నటించారు. అలాగే ఐటమ్ సాంగ్స్ లోనూ నటించారు. అయితే ఈమె పై గతంలో చాలా వదంతాలు దొర్లాయి. కాగా, ఇటీవలే ఒక టీవి ఛానెల్ లో పాల్గొన్న కిరణ్ తన వ్యక్తిగత, సినీ రంగ జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది.

ఈ క్రమంలోనే కిరణ్ మాట్లాడుతూ.. కథానాయకిగా అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో.. తన ప్రియుడి చెప్పిన మాటాలు విని సినిమాలకు దూరం అయ్యానని చెప్పారు. అయితే అదే తాను చేసిన పెద్ద తప్పు అని ఆ తర్వాత తెలుసుకున్నాని పేర్కొన్నారు. దీంతో మళ్లీ ఇప్పుడు నటించడానికి సిద్ధంగా కాగా, కొందరు తనను తప్పుగా వాడుకునే ప్రయత్నం చేశారని చెప్పుకొచ్చారు. పైగా అడ్జెస్ట్మెంట్ కావాలని సలహా ఇస్తున్నారని బహిరంగంగానే తెలిపారు. అలాంటి సమయంలో తన ప్రేమికుడు వదిలేశాడని చెప్పారు. అందుకు కారణం తమ మధ్య చిన్న సమస్యలేనని, ఒకరోజు ఆయన నన్ను కొట్టారని అది సహించుకోలేకపోయానని చెప్పారు. అలాగే ఆ తర్వాత అతనికి ఫోన్ చేసి రమ్మని పిలిచి తాను కూడా కసీ తీరా కొట్టాడంతో.. చివరికి అతడు చిరిగిన బట్టలతో రోడ్డున పడ్డాడని వివరించింది. ఈ కారణంగానే ఏమో తెలియదు కానీ, చాలామంది తనను తప్పుగా ఉపయోగించుకోవాలని చూశారని, మరి కొందరు రాత్రి వేళల్లో ఫోన్ చేసేవాళ్లని చెప్పారు. దీని బట్టి చూస్తే వాళ్లంతా తప్పుడు వాళ్లని అర్థమయ్యిందని.. ఇక తనకి మంచి స్నేహితులే లేరని కిరణ్ చెప్పారు.

ఇక ఇలాంటి కారణాల వల్లే కిరణ్ సినిమా అవకాశాలను కోల్పోయానని చెప్పారు. అలాగే తనకుచ పెళ్లి అయ్యిందని, పిల్లలు కూడా పుట్టారని చాలా పుకార్లు పుట్టించారని, అసలు నేను పెళ్లే చేసుకోలేదని స్పష్టం చేశారు. కాగా, కిరణ్ గతంలో తెలుగు బిగ్ బాస్ సీజన్ 7లో ఆమె కంటెస్టెంట్ గా పాల్గొన్న విషయం తెలిసిందే. మరి, హీరోయిన్ కిరణ్ రాథోడ్ జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş