iDreamPost
android-app
ios-app

కుటుంబం తలదించుకునే పని చేయను.. పరువు కోసం చచ్చిపోతా: నటి హేమ

Tollywood ActressHema: బెంగుళూరులో జరిగిన రేవ్ పార్టీలో నటి హేమతో పాటు పలువురుని నిందితులుగా పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై నటి హేమ తాజాగా స్పందించింది.

Tollywood ActressHema: బెంగుళూరులో జరిగిన రేవ్ పార్టీలో నటి హేమతో పాటు పలువురుని నిందితులుగా పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై నటి హేమ తాజాగా స్పందించింది.

కుటుంబం తలదించుకునే పని చేయను.. పరువు కోసం చచ్చిపోతా: నటి హేమ

గత కొంత కాలం నుంచి మీడియా, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్న విషయం ఏదైనా ఉందంటే అది నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్న అంశంమే. కర్ణాటకలో జరిగిన బర్త్ డే పార్టీ సందర్భంగా నిర్వహించిన రేవ్ పార్టీలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొనడంతో తీవ్ర కలకలం రేగింది. చిత్ర పరిశ్రమ్లలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా అక్కడ రేవ్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు వెళ్లి రైడ్ చేయగా పలువురు పట్టుబడ్డారు. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో పలువురు డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో నటి హేమతో పాటు 88 మందిని నిందితులుగా పేర్కొన్నారు. హేమ మాత్రం తాను బెంగళూరులో లేనని హైదరాబాద్ ఫాం హౌస్ లో ఉన్నానని తెలిపింది. ఆ తర్వాత బెంగళూరు పోలీసులు నటి హేమను అరెస్ట్ చేశారు.

ఆ తర్వాత ఆమె బెయిల్ పై విడుదలయ్యారు. ఇక ఈ వివాదం సద్దమణిగింది అనుకుంటే మరోసారి బెంగళూరు పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేయడంతో మరోసారి వార్తల్లో నిలిచింది. దీంతో రేవ్ పార్టీ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఛార్జ్ షీట్ లో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. హేమ ఎండీఎంఏ డ్రగ్స్ వాడినట్లు నిర్దారణ అయిందని తెలిపారు. ఎండీపీఎస్ సెక్షన్ 27 కింద హేమపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై స్పందించిన హేమ మాత్రం తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని చెప్పుకొచ్చింది. తాజాగా ఈ కేసుకు సంబంధించి హేమ తన ఇన్ స్టా ఖాతా ద్వారా మాట్లాడుతూ వీడియో రిలీజ్ చేసింది. మీడియా సంస్థలపై హేమ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. హేమ మాట్లాడుతూ.. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ వారు డ్రగ్స్ కేసులో హేమకి పాజిటివ్ వచ్చిందని పదే పదే ప్రచారం చేస్తున్నారని తెలిపింది.

ఇంకా ఛార్జ్ షీట్ నాకే రాలేదు.. నేనే చూడలేదు అలాంటిది పాజిటివ్ వచ్చిందని మీకెలా తెలుసు అంటూ ప్రశ్నించింది. ఆధారాలు లేకుండా మీరెలా స్ప్రెడ్ చేస్తున్నారో నాకు అర్ధం కావట్లేదంటూ పలు మీడియా సంస్థలను దుయ్యబట్టింది. మీ మీడియా చానల్స్ వారు అంతా కలిసి వచ్చి నాకు టెస్టులు చేయించండి. ఒకవేళ పాజిటివ్ అని తేలితే నేను మీ కాళ్లకు దణ్ణం పెడతాను. ఏ శిక్ష విధించిన నేను సిద్ధం అంటూ వారిపై ఫైర్ అయ్యింది. నా కుటుంబం తలవంచుకునే తప్పు ఎప్పుడూ చేయలేదు. ఇండస్ట్రీకి తలవొంపులు తెచ్చేలా నేనెప్పుడు వ్యవహరించలేదు. పరువు కోసం చచ్చిపోతాను అంటూ తెలిపింది. నా మీద ఇలా తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారు అంటూ తన ఆవేదనను వ్యక్తం చేసింది. మా అమ్మ అనారోగ్యానికి గురయ్యింది. ఆమెకు కిడ్నీలు పని చేస్తలేవు. బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ ఉంది. ఇలాంటి సమయంలో మీరు హేమ డ్రగ్స్ కేసులో పాజిటివ్ గా తేలిందని ప్రచారం చేస్తుంటే ఆవిడ మరింత టెన్షన్ కు గురవుతున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానుకోండి అంటూ మీడియా సంస్థలను కోరారు.

 

View this post on Instagram

 

A post shared by KOLLA HEMA (@hemakolla1211)