iDreamPost
android-app
ios-app

ఈ చిన్నారి డాక్టర్ చదివి యాక్టరయ్యింది.. ఇప్పుడో స్టార్..

  • Published Mar 20, 2024 | 5:28 PM Updated Updated Mar 20, 2024 | 5:28 PM

బూరెల్లాంటి బుగ్గలు వేసుకుని తదేకంగా చూస్తున్న ఈ చిన్నారి స్టార్ హీరోయిన్. డాక్టర్ చదివి పుసుక్కున యాక్టర్ అయ్యింది. నిర్మాతగా కూడా ట్రై చేస్తోంది. ఇంతకు ఆమె ఎవరో చెప్పగలరా..?

బూరెల్లాంటి బుగ్గలు వేసుకుని తదేకంగా చూస్తున్న ఈ చిన్నారి స్టార్ హీరోయిన్. డాక్టర్ చదివి పుసుక్కున యాక్టర్ అయ్యింది. నిర్మాతగా కూడా ట్రై చేస్తోంది. ఇంతకు ఆమె ఎవరో చెప్పగలరా..?

  • Published Mar 20, 2024 | 5:28 PMUpdated Mar 20, 2024 | 5:28 PM
ఈ చిన్నారి డాక్టర్ చదివి యాక్టరయ్యింది.. ఇప్పుడో స్టార్..

గాడ్స్ ఓన్ కంట్రీ అనగానే గుర్తుకు వచ్చే రాష్ట్రం కేరళ. దక్షిణాది రాష్ట్రాల్లో ఒకటైన కేరళలో ఎన్నో పర్యాటక ప్రాంతాలున్నాయి. కేరళ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేవి కొబ్బరి తోటలు. ఆ తర్వాత సినిమాలు. కొత్త కొత్త కాన్సెప్టులతో సినిమాలు తెరకెక్కించాలంటే మలయాళ పరిశ్రమ తర్వాతే మరో ఇండస్ట్రీ అనే ముద్ర పడింది. అంతేనా అక్కడి హీరోయిన్లు కూడా ఫేమస్. ఇక్కడ నీళ్లలో ఏదో మత్తు ఉంది అనుకుంటా.. ఒక్కొక్క హీరోయిన్ ఒక్కో ఆణి ముత్యం. మలబార్ బ్యూటీలనగానే.. యమ క్రేజ్ అనడంలో సందేహం లేదు. మలయాళ హీరోయిన్లకు తెలుగులో ఉండే క్రేజే వేరు. ఇప్పటికే ఎంతో మంది నటీమణులు టాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న సంగతి విదితమే.

ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న బొద్దు గుమ్మ కూడా మాలీవుడ్ సోయగమే. ఇంత ఇంత బుగ్గలు వేసుకుని పెద్ద బొట్టు పెట్టుకుని బోసి నవ్వులు చిందిస్తున్న ఈ బ్యూటీ.. ఇప్పుడో స్టార్ హీరోయిన్. కన్నడ మినహాయించి.. సౌత్ ఇండస్ట్రీని చుట్టేసింది. తెలుగు, మలయాళం కన్నా.. తమిళంలో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంది ఈ మలబార్ అందం. ఇంతకు ఆమె ఎవరంటే.. పొన్నియన్ సెల్వం నటి ఐశ్వర్య లక్ష్మి. ఇంత బొద్దుగుమ్మే.. పెద్దయ్యాక నాజూగ్గా మారి అలరిస్తోంది. కేరళలోని త్రివేండ్రంలో పుట్టిన ఆమె డాక్టర్ చదివింది. ఎర్నాకుళంలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. డాక్టర్ కాబోయి యాక్టర్ అయిపోయింది. 2017లో మాలీవుడ్ తెరపైకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్ము.. వరుస పెట్టి సినిమాలు చేస్తోంది.

తమిళంలో యాక్షన్ మూవీతో ఎంటరై.. పొన్నియన్ సెల్వంతో టాప్ హీరోయిన్ అయిపోయింది. సత్యదేవ్ గాడ్సే మూవీతో టాలీవుడ్ గడ్డపై అడుగుపెట్టిన ఈ మల్లు బ్యూటీ.. తర్వాత అమ్ము అనే చిత్రంలో నటించింది. అయితే ఆ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యింది. శాడిస్ట్ అయిన భర్తకు బుద్ది చెప్పే అమ్ముగా నటించి మెప్పించింది. ఇందులో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. తెలుగులో సినిమాలు చేయకపోయినా డబ్బింగ్ చిత్రాల ద్వారా అలరిస్తోంది అమ్మడు. ఇక పొన్నియ్ సెల్వన్ మూవీతో తెలుగు వారికి మరింత దగ్గరైంది. మలయాళ హార్రర్ థ్రిల్లర్ కుమారి కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక గట్టా కుస్తీ( తెలుగులో మట్టీ కుస్తీ)తో వాట్ ఎ ఫెర్ఫ్మామెన్స్ అనిపించుకుంది. కింగ్ ఆఫ్ కోతతో కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. నిర్మాతగా మారి… గార్గి లాంటి చిత్రాలను నిర్మించింది. ఇందులో సాయి పల్లవి హీరోయిన్. ప్రస్తుతం ఐశ్వర్య లక్ష్మి కమల్ థగ్ లైఫ్ చిత్రంలో నటిస్తోంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss