iDreamPost
android-app
ios-app

పవన్ కళ్యాణ్‌ను కాక పడుతున్న ఈ చిన్నోడు ఎవరో తెలుసా..? స్టార్ హీరో..!

  • Published Sep 02, 2024 | 4:45 PM Updated Updated Sep 02, 2024 | 4:45 PM

పవన్ కళ్యాణ్‌ను కాక పడుతున్న ఈ చిన్నోడు ఎవరో తెలుసా..? టాలీవుడ్ స్టార్ హీరో. చైల్ట్ ఆర్టిస్టుగా నటించి.. ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు.

పవన్ కళ్యాణ్‌ను కాక పడుతున్న ఈ చిన్నోడు ఎవరో తెలుసా..? టాలీవుడ్ స్టార్ హీరో. చైల్ట్ ఆర్టిస్టుగా నటించి.. ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు.

  • Published Sep 02, 2024 | 4:45 PMUpdated Sep 02, 2024 | 4:45 PM
పవన్ కళ్యాణ్‌ను కాక పడుతున్న ఈ చిన్నోడు ఎవరో తెలుసా..? స్టార్ హీరో..!

ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్‌కు కాళ్లు నొక్కుతూ కాక పడుతున్న ఈ చిన్నోడు ఎవరో తెలుసా…? టాలీవుడ్ స్టార్ హీరో. చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన ఈ పిల్లోడు.. ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు కూడా. కామ్ గోయింగ్ పర్సన్. హిట్లతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. కానీ గత ఏడాది అమ్మాయిల గుండెలకు గాయం చేసి ఓ నటిని వివాహం చేసుకున్నాడు. ఇంతకు ఆ నటుడు ఎవరో చెప్పనక్కర్లేదు కదా మెగాస్టార్ నట వారసుడు కొణిదెల వరుణ్ తేజ్ అని. ఈ రోజు టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ ఫోటోను షేర్ చేస్తూ బాబాయ్‌కి విషెస్ తెలియజేశాడు వరుణ్. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతుంది.

‘నేను మిమ్మల్ని చూస్తూనే పెరిగాను. ధర్మం వైపు మీరు అనుసరించిన మార్గం, ఇతరులకు సాయం చేయాలన్న సంకల్పం ఎంతో స్ఫూర్తిదాయకం. మీకు ఆరోగ్యం, బలం చేకూరాలని కోరుకుంటున్నా’ అంటూ పోస్టు చేశాడు. ఇప్పుడే కాదు గత నెలలో పుట్టిన రోజు సందర్భంగా కూడా పెద్దనాన్న చిరంజీవికి కూడా విషెస్ తెలియజేశాడు. అప్పుడు కూడా తన పెద్దనాన్న కాళ్లపై సాష్టాంగ నమస్కారం చేసిన పిక్ షేర్ చేసుకున్నాడు. ఇక వరుణ్ కెరీర్ విషయానికి వస్తే.. హ్యాండ్సప్ మూవీతో బాల నటుడిగా యాక్ట్ చేశాడు వరుణ్ తేజ్. చదువులు పూర్తయ్యాక పెద్దనాన్న, నాన్న, బాబాయ్, అన్న.. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ బాటలోనే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

ముకుందతో హీరోగా అడుగుపెట్టిన వరుణ్.. ఫస్ట్ మూవీతోనే మంచి మార్కులు వేయించుకున్నాడు. కంచె, ఫిదా, తొలి ప్రేమ, ఎఫ్ 2, ఎఫ్ 3, గద్దల కొండ గణేష్ చిత్రాలతో ఆకట్టుకున్నాడు. ఇక గత రెండు చిత్రాలు బాక్సాఫీసు వద్ద బెడిసికొట్టాయి. గాంఢీవధారి అర్జున, ఆపరేషన్ వాలంటైన్ చిత్రాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక గత ఏడాది తనతో మిస్టర్, అంత్యాక్షరి మూవీలో నటించిన యాక్ట్రెస్ లావణ్య త్రిపాఠిని వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం మట్కా చిత్రంతో రాబోతున్నాడు వరుణ్. ఇక పవన్ కళ్యాణ్ కూడా త్వరలో ఓజీ మూవీ షూటింగ్ చిత్రంలో పాల్గొననున్నాడని నిర్మాత డీవీవీ దానయ్య వెల్లడించారు.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetjolly girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş