iDreamPost
android-app
ios-app

మెగా బ్రదర్స్‌తో ఉన్న పిల్లాడ్ని గుర్తు పట్టారా..? అమ్మాయిల కలల హీరో

  • Published Aug 28, 2024 | 4:07 PM Updated Updated Aug 28, 2024 | 4:07 PM

మెగా బ్రదర్స్‌తో ఉన్న పిల్లాడ్ని గుర్తు పట్టారా.. టాలీవుడ్ స్టార్ హీరో. విభిన్న కథా చిత్రాల కథానాయకుడే కాదు... అమ్మాయిల కలల రాకుమారుడు కూడా. ఇంతకు ఆ చిన్నారి ఎవరంటే..?

మెగా బ్రదర్స్‌తో ఉన్న పిల్లాడ్ని గుర్తు పట్టారా.. టాలీవుడ్ స్టార్ హీరో. విభిన్న కథా చిత్రాల కథానాయకుడే కాదు... అమ్మాయిల కలల రాకుమారుడు కూడా. ఇంతకు ఆ చిన్నారి ఎవరంటే..?

  • Published Aug 28, 2024 | 4:07 PMUpdated Aug 28, 2024 | 4:07 PM
మెగా బ్రదర్స్‌తో ఉన్న పిల్లాడ్ని గుర్తు పట్టారా..? అమ్మాయిల కలల హీరో

మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్‌తో ఉన్న ఈ పిల్లాడు ఎవరో గుర్తు పట్టారా..? మోస్ట్ హ్యాండ్సమ్ హీరో. బాల నటుడిగా ఓ మూవీతో ఆకట్టుకుని..తొలి సినిమాతోనే లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. భిన్నమైన చిత్రాలు చేసి.. డైరెక్టర్ల హీరోగా మారాడు. హిట్, ఫట్‌తో సంబంధం లేకుండా  సెలైంట్‌గా సినిమాలు చేసుకుంటూ పోతుంటాడు. గత ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టి.. అమ్మాయిల గుండె కోతను మిగిల్చిన ఈ గ్రీకు వీరుడు ఎవరో కాదు మెగా ఫ్యామిలీ ముద్దుబిడ్డ వరుణ్ తేజ్. నాగబాబు, బ్రహ్మానందం హ్యాండ్సప్ మూవీలో ఓ చిన్న పాత్రలో మెరిసిన ఈ నట వారసుడు.. ముకుందతో హీరోగా ఎంట్రీ ఇచ్చి అతి కొద్ది కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు ఈ ఆరడుగుల అందగాడు.

ఈ ఫోటో బ్యాగ్రౌండ్ చూస్తుంటే.. బర్త్ డే వేడుకల్లో దిగినట్లు కనిపిస్తుంది. నాగబాబుకు కొడుకైనా..చిరంజీవిని కూడా డాడీ అనే పిలుస్తుంటాడు వరుణ్ తేజ్. ఇక బాబాయ్‌ పవన్ కళ్యాణ్‌కు కూడా ముద్దుల కొడుకే. గతంలో ఎన్నో ఇంటర్వ్యూలో చిరంజీవి, బాబాయ్ పవన్ కళ్యాణ్‌తో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నాడు ఈ మెగా తనయుడు. ముకుందతో ఎంట్రీ ఇచ్చి.. మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటుడు.. కమర్షియాలిటీకి దూరంగా.. కంచె వంటి చిత్రం చేశాడు. ఇందులో అతడి నటనకు మంచి అప్లాజ్ వచ్చింది. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ మూవీలో నటించగా.. బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టింది. మిస్టర్ మూవీతో ఓకే అనిపించినా.. శేఖర్ కమ్ముల మూవీ ఫిదాలో యాక్ట్ చేసి.. మరోసారి అమ్మాయిల మనసు ఫిదా చేశాడు.

Varun Tej Konidela childhood pic 1

ఆ తర్వాత వచ్చిన తొలి ప్రేమ, అంతరిక్షం చిత్రాలు ఆకట్టుకున్నాయి. ఇక తనలో కొత్త యాంగిల్ చూపించిన సినిమా ఎఫ్ 2. ఇందులో ఫన్ జోన్‌లో నటించాడు. సీనియర్ నటుడు, మెగా ఫ్యామిలీకి అత్యంత ఆప్తుడు వెంకటేశ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. గద్దల కొండ గణేష్‌లో న్యూ వరుణ్ తేజ్ కనిపిస్తాడు. ఎఫ్ 3లో కూడా కితకితలు పెట్టించాడు. కానీ ఆ తర్వాత వచ్చిన రెండు చిత్రాలు బాక్సాఫీసు వద్ద బెడిసికొట్టాయి. గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలంటీన్ మెప్పించలేకపోయాయి. ప్రస్తుతం మట్కా చిత్రంలో బిజీగా ఉన్నాడు. మిస్టర్ మూవీలో నటించిన లావణ్య త్రిపాఠితో పరిచయం.. ప్రేమగా దారి తీసింది. అంతరిక్షం మూవీకి ఆ బంధం మరింత బలంగా మారింది. చివరకు పెద్దలను ఒప్పించి.. గత ఏడాది వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు ఈ లవ్ బర్డ్స్.

 

View this post on Instagram

 

A post shared by Varun Tej Konidela (@varunkonidela7)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom